By: ABP Desam | Updated at : 08 Sep 2023 02:56 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
ఈనెల 20నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పూర్తయి ఆరు నెలలు కావస్తోంది. ఆరు నెలల వ్యవధిలో మరోసారి సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈనెల 24కి 6 నెలల గడువు తీరిపోతుండటంతో.. 20వతేదీనుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని అధికార వర్గాల సమాచారం. ఈ సమావేశాలు వారం రోజులపాటు కొనసాగే అవకాశాలున్నాయి.
ముందు కేబినెట్ మీటింగ్, తర్వాత అసెంబ్లీ..
అసెంబ్లీకి ముందుగా కేబినెట్ భేటీ అవుతుంది. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశమయ్యే అవకాశాలున్నాయి. బడ్జెట్ సెషన్ అంతా టీడీపీ ఆందోళనలతో రచ్చ రచ్చగా మారింది. ఇప్పుడు జరగబోయే సమావేశాల్లో అయినా చర్చ సజావుగా జరుగుతుందేమో చూడాలి. ఇంకా చదవండి
అవినీతి అధికారుల సమాచారం ఇవ్వండి- గిఫ్ట్ గెలుచుకోండి
అవినీతి అంతం మీ పంతమా..? అక్రమాలను ప్రశ్నించడం మీకు అలవాటా..? లంచగొండులు లేని మంచి సమాజం కోసం మీవంతు ప్రయత్నిస్తున్నారా..? అయితే ఏసీబీతో చేతులు కలపండి, పనిలో పనిగా నగదు బహుమతి కూడా స్వీకరించండి అంటున్నారు అధికారులు. ఏపీలో ఏసీబీకి ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన వారికి నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. 5 వేల రూపాయలనుంచి 10వేల రూపాయల వరకు ఈ బహుమతి ఉంటుందని తెలిపారు. ఇంకా చదవండి
ఆత్మహత్యాయత్నం చేసిన హోంగార్డు రవీంద్ర మృతి
ఆత్మహత్యాయత్నం చేసుకొని అపోలో డీఆర్డీఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డు రవీందర్ ఈ ఉదయం మృతి చెందారు. 70శాతానికి పైగా కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవీందర్.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. అయితే ఉన్నతాధికారుల వేధింపులు వల్లే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు మరణ వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఈక్రమంలోనే పోస్టుమార్టం నిమిత్తం రవీందర్ మృతదేహాన్ని ఉస్మానియా మోర్చరీకి తరలించారు. ఇంకా చదవండి
తీన్మార్ మల్లన్న నాయకత్వాన తెలంగాణలో మరో కొత్త పార్టీ, అభ్యంతరాలు స్వీకరిస్తున్న ఈసీ
తెలుగు రాష్ట్రాల్లో రెండు కొత్త రాజకీయ పార్టీలు రాబోతున్నాయి. తెలంగాణ ఒకటి, ఏపీలో మరో పార్టీ...కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నాయి. తెలంగాణ నిర్మాణ పార్టీ పేరుతో తీన్మార్ మల్లన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ పేరుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే...ఈ నెల 20లోగా తెలియజేయాలని ఈసీ వెబ్ సైట్ లో తెలియజేసింది. సెక్షన్ 29ఎ పీపుల్స్ రెప్రజంటేషన్ చట్టం ప్రకారం....పార్టీని రిజిస్టర్ చేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. అటు క్రిష్ణ జిల్లా కంచికర్లకు వ్యక్తి...తెలుగు రాజ్యాధికార పార్టీ పేరుతో ఈసీకి దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా చదవండి
IITH: ఐఐటీ హైదరాబాద్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, ఈ అర్హతలు అవసరం
AP PECET: ఏపీ పీఈసెట్-2023 సీట్ల కేటాయింపు పూర్తి, కళాశాలలవారీగా వివరాలు ఇలా
Aditya L1: ఇస్రో కీలక అప్‌డేట్, సూర్యుడి వైపు దూసుకెళ్తున్న ఆదిత్య L1
JNTUH: జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో అకడమిక్ అసిస్టెంట్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
TS EAMCET: ఎంసెట్ బైపీసీ స్పాట్ ప్రవేశాల గడువు పొడిగింపు, ఎప్పటివరకు అవకాశం ఉందంటే?
TDP Protest: న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్తాం, త్వరలోనే టీడీపీ జైలు భరో చేస్తుంది: చినరాజప్ప
Bigg Boss Season 7 Telugu: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!
HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే
Hari Teja: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ
/body>