అన్వేషించండి

Tirumala News: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - నేడు జరిగే స్పెషల్ పూజలివే!

Tirumala News: తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. డిసెంబర్ 7వ తేదీ ఒక్కరోజే 64 వేల 162 మంది స్వామి వారిని దర్శించుకోగా.. 5.38 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.

Tirumala News: శ్రీనివాసుడి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీనివాసుడికి ప్రతి రోజు ఒక్కో రకమైన ప్రసాదాన్ని నైవేద్యంగా నివేదిస్తారు అర్చకులు. ఇక బుధవారం నాడు బెల్లంతో తయారు చేసిన పాయసాన్ని స్వామి వారికి నైవేద్యంగా మొదటి ఘంటాలో సమర్పిస్తారు. మంగళవారం అంటే డిసెంబర్ 6వ తేదీ 2022 సంవత్సర రోజున 64,162 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 23,709 మంది తలనీలాలు సమర్పించగా, 5.38 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్సులోవు ఒక్క కంపార్ట్మెంట్ లే మాత్రమే సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది. 

శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఇందులో‌ భాగంగానే బుధవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారమును తెరిచిన అర్చకులు.. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం తోమాల, అర్చన సేవలు నిర్వహించి ప్రాతఃకాల ఆరాధనలో‌ భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేశారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు సమర్పించగా, ఇక బుధవారం నాడు "బెల్లం పాయసం" ను స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.

ప్రతీ బుధవారం నిర్వహించే సహస్ర కళషాభిషేకం రద్దు..

సన్నిధిలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సాత్తుమొర నిర్వహించిన అనంతరం సర్కారు హారతి అందించి వీఐపీ భక్తులను స్వామి వారి దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ. అనంతరం స్వామి వారికి రెండ ఘంట నివేదన, బలి జరిపిన అనంతరం ప్రతి "బుధవారం" రోజు నిర్వహించే "సహస్ర కళషాభిషేకం"ను విగ్రహ అరుగుల కారణంగా పరిరక్షణకై ఆగమ శాస్త్రం పండితుల సలహాలు,‌ సూచనల మేరకు టీటీడీ రద్దు చేసింది. కేవలం ఏడాదికి‌ ఓ మారు సర్కారు వారి సహస్ర కళషాభిషేకం టీటీడీ నిర్వహిస్తొంది. అనంతరం సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించారు. శ్రీవారి ఉత్సవమూర్తులు అయినా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రాకారంలోనికి వేంచేపు చేసి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య కళ్యాణోత్సవాన్ని నేత్ర పర్వంగా నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను నిర్వహించి,‌ ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభోత్సవ మంపానికి ఊరేగింపుగా తీసుకెళ్ళి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు. 

సాయంకాలం సహస్ర దీపాలంకారసేవ కొలువులో ఊంజల్ సేవ నిర్వహించిన పిదప నిత్యోత్సవం నిర్వహిస్తారు. సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తారు. నిత్య సేవల్లో ‌భాగంగా సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి సహస్ర దీపాలంకార సేవను నిర్వహించి, తిరుఉత్సవం నిర్వహిస్తారు. అటు తరువాత ఉత్సవ మూర్తులు శ్రీవారి ఆలహం చేరుకోగానే, సర్వ దర్శనం భక్తులను నిలిపి వేసి రాత్రి కైంకర్యాలు ప్రారంభిస్తారు. రాత్రి కైంకర్యాల్లో‌ భాగంగా రాత్రి తోమాల, అర్చన, రాత్రి గంట, తిరువీసం, ఘంటాబలి నిర్వహిస్తారు. తిరిగి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించి, సర్వదర్శనం పూర్తి అయిన తరువాత ఆగమోక్తంగా శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
Miss Universe 2024: విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు
విశ్వ సుందరిగా డెన్మార్క్ భామ - ఆ దేశ తొలి మహిళగా రికార్డు
Delhi Minister Kailash Gehlot Resigns : ఢిల్లీలో గేమ్ స్టార్ట్ చేసిన బీజేపీ- ఆప్‌లో మొదటి వికెట్‌ డౌన్ - రాజీనామా చేసిన మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ తీవ్ర ఆరోపణలు
ఢిల్లీలో గేమ్ స్టార్ట్ చేసిన బీజేపీ- ఆప్‌లో మొదటి వికెట్‌ డౌన్ - రాజీనామా చేసిన మంత్రి కైలాష్‌ గెహ్లాట్‌ తీవ్ర ఆరోపణలు
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
Embed widget