అన్వేషించండి

Asteroids : హైస్పీడ్ తో భూమిపైకి వస్తున్న భారీ గ్రహశకలాలు, నాసా ఏం చెప్పిందంటే!

Asteroids: డిసెంబర్ 17న మూడు గ్రహశకలాలు భూమిని దాటనున్నాయని నాసా ధృవీకరించింది. అత్యంత వేగంతో సమీపిస్తోన్న ఈ గ్రహశకలాలతో ప్రమాదం లేదని నిపుణులు అంటున్నారు.

Asteroids : మూడు భారీ గ్రహశకలాలు భూమికి సమీపం నుంచి ప్రయాణించనున్నాయన్న సమాచారాన్ని నాసా ధృవీకరించింది. సమీపంగా వచ్చినప్పటికీ దీని వల్ల మన గ్రహానికి ఎలాంటి ప్రమాదం ఉండదని నిపుణులు హామీ ఇచ్చారు. భూమి సమీపానికి రానున్న మూడు గ్రహశకలాలు 2024 XR6, 2024 XC17, 2024 YO1

గ్రహశకలం 2024 XR6

భూమి సమీపానికి రానున్న మూడు గ్రహశకలాల్లో మొదటిది 2024 XR6. దీని పరిమాణం 49 అడుగుల వెడెల్లు ఉంటుంది. ఇది గంటకు 10,805 మైళ్ల వేగంతో ప్రయాణిస్తూ రాత్రి 10:49 PM నాటికి భూమిని దాటుతుంది. ఈ గ్రహశకలం భూమికి 3,640,000 మైళ్లకు దగ్గరగా వస్తుంది. ఇది చంద్రునికి 17 రెట్లు దూరం. ఇది భూమికి సమీపంలో వచ్చినప్పటికీ, శాస్త్రవేత్తలు ఎటువంటి ముప్పు లేదని చెప్పారు.

గ్రహశకలం 2024 XC 17

రెండో గ్రహశకలమైన ‘2024 XC 17’. పరిమాణం 38 అడుగుల వెడల్పు. ఈ గ్రహశకలం గంటకు 10,805 మైళ్ల వేగంతో వెళుతుంది. ఇది భూమికి దాదాపు 2,180,000 మైళ్ల దూరం నుంచి ప్రయాణించనుంది. చంద్రుడి దూరం కంటే 16 రెట్లు ఎక్కువ దూరం నుంచి ఈ గ్రహశకలం వెళ్లనుంది. ఇది కూడా ఎలాంటి ప్రమాదాన్ని కలిగించదని అంటున్నారు.

2024 YO1

మూడవ గ్రహశకలం 2024 YO1 మిగతా రెండింటి కన్నా చాలా చిన్నది. ఇది కేవలం 11అడుగుల వెడెల్పుతో.. కేవలం 4,70,000 మైళ్ల దూరం నుంచి భూమిని దాటుతుంది. దాని పరిమాణం చిన్నదైనప్పటికీ.. గంటకు 32,063 మైళ్ల వేగంతో చాలా వేగంగా కదులుతుంది. అయితే ఈ గ్రహశకలాలు సౌర వ్యవస్థ ఆరంభానికి సంబంధించినవని, ఇవి సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గ్రహశకలాలు అంతరిక్షం, భూమి.. ఈ రెండింటి చరిత్రను అర్థం చేసుకోవడంతో కీలకమైనవని చెప్పవచ్చు,

నాసా భూమికి సమీపంలో ఉన్న వస్తువులను ట్రాక్ చేయడానికి అధునాతన సాధనాలను ఉపయోగిస్తోంది. జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ గ్రహశకలాల కదలికలను గమనించడానికి రాడార్ వ్యవస్థలను వినియోగిస్తోంది. OSIRIS-REx, Hayabusa2 వంటి మిషన్లు గ్రహశకలం నమూనాలను కూడా భూమికి తీసుకువచ్చాయి. ఈ మిషన్లు సౌర వ్యవస్థ మూలాలు, భూమిపై జీవితం ప్రారంభాల గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయి. ఈ గ్రహశకలాలను అధ్యయనం చేయడం ద్వారా, శాస్త్రవేత్తలు విలువైన జ్ఞానాన్ని పొందుతారు. ఇది వారు.. అంతరిక్షంలో చేసే ప్రయోగాల్లో భవిష్యత్ ముప్పుల నుండి భూమిని రక్షించడంలో సహాయపడుతుంది.

ఇలాంటి గ్రహశకలాలను అధ్యయనం చేస్తే భూమి మూలాలు, విశ్వం చరిత్రకు సంబంధించిన వివరాలు తెలుస్తాయని నాసా శాస్త్రవేత్తలు విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, భూమికి సమీపంలో ఉన్న వస్తువులను పర్యవేక్షించడానికి అధునాతన వ్యవస్థలను నాసా ఉపయోగిస్తుంది. 

నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ (JPL) ఈ గ్రహశకలాలను పూర్తిగా పర్యవేక్షించనున్నట్టు సమాచారం. దీని వల్ల ఎటువంటి ముప్పు లేదని తెలిపినప్పటికీ, భూమికి సమీపంలో వచ్చే గ్రహశకలాలను గమనించడం శాస్త్రీయ పరిశోధనలకు కీలకం. అటువంటి అంతరిక్ష వస్తువులను అధ్యయనం చేయడం వలన శాస్త్రవేత్తలు గ్రహశకలాలు, వాటి ప్రవర్తన, మన సౌర వ్యవస్థ పరిమాణం గురించి మరింత తెలుసుకునే అవకాశం ఉంటుంది.

గాల్లోనే మండిన గ్రహశకలం

కొన్ని రోజుల క్రితం ఇలానే ఓ గ్రహశకలం భూమి వాతావరణంలోకి ప్రవేశించింది. ఈ చిన్న గ్రహశకలం రష్యా భూభాగాన్ని తాకింది. అయితే గాల్లోనే మండిపోవడంతో కాసేపు మెరుపులు మెరిశాయి. 70 సెంటీమీటర్ల కంటే తక్కువ వ్యాసం కలిగిన గ్రహశకలాన్ని యురోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ (ESA) ముందుగానే గుర్తించింది. అయితే ఇది అంత ప్రమాదకరమైనది కాదని తెలిపింది.

Also Read : Elon Musk: ఇక టెస్లా వాట్సాప్, జీమెయిల్‌ - తేవాలని టెకీ సలహా - సిద్దమన్న ఎలాన్ మస్క్ !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Case Sritej Health Update | 13 రోజుల తర్వాత శ్రీతేజ్ హెల్త్ పై పోలీసుల అప్డేట్ | ABP Desamటీమిండియా పరువు కాపాడిన బౌలర్లుత్వరలోనే టెస్ట్‌ మ్యాచ్‌లకి రోహిత్ శర్మ గుడ్‌బై!జమిలి ఎన్నికలపై జేపీసీ, ప్రతిపక్షాల డిమాండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
అమరావతి, ఎన్టీఆర్ ఘాట్‌లపై కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు - పొంగులేటి, కోమటిరెడ్డిలకు సీక్రెట్ ఎజెండా ఉందా?
KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!
RRR Documentary On Netflix: సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ... ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది
One Nation One Election: రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎలా పని చేస్తుందో తెలుసా?
Look Back 2024: 151 నుంచి 11కు- జగన్ కు చేదు జ్ఞాపకంలా 2024
151 నుంచి 11కు- జగన్ కు చేదు జ్ఞాపకంలా 2024
Weather Today : తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
తెలంగాణపై చలి పిడుగు- వణికిపోతున్న జనం- ఏపీని వెంటాడుతున్న వర్షాల భయం
Keerthy Suresh: సౌత్ కంటే డబుల్... బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
సౌత్ కంటే డబుల్... బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
Love Jihad Fack Check: హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
హైదరాబాద్‌లో లవ్‌ జిహాద్ నుంచి ముగ్గురు అమ్మాయులను రక్షించారా..? వైరల్ అవుతున్న వీడియో వాస్తవమేనా...?
Embed widget