News
News
వీడియోలు ఆటలు
X

The Kerala Story: సుప్రీంకోర్టుకి కేరళ స్టోరీ మూవీ మేకర్స్, బ్యాన్ చేయడాన్ని సవాలు చేస్తూ పిటిషన్

The Kerala Story: రెండు రాష్ట్రాల్లో తమ సినిమాను బ్యాన్ చేయాడన్ని సవాలు చేస్తూ కేరళ స్టోరీ మూవీ మేకర్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

FOLLOW US: 
Share:

The Kerala Story:

నష్టపోతున్నాం: మూవీ మేకర్స్ 

The Kerala Story సినిమాపై దేశవ్యాప్తంగా తలెత్తిన వివాదం ఇంకా చల్లారలేదు. తమిళనాడు, కర్ణాటకల్లో పలు చోట్ల షోలు నిలిపివేశారు. థియేటర్లలో ప్రదర్శించకుండా బ్యాన్ చేశారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వాలు అధికారికంగానే  ఈ సినిమాపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించాయి. అప్పటి నుంచి అగ్గి మరింత రాజుకుంది. అటు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు మాత్రం పన్ను రాయితీతో పాటు పన్ను ఎత్తివేస్తూ సినిమాను సపోర్ట్ చేస్తున్నాయి. మొత్తంగా ఈ మూవీ రాజకీయాలనూ వేడెక్కించింది. అయితే...తమ సినిమాను రెండు రాష్ట్రాలు బ్యాన్ చేయడంపై మూవీ మేకర్స్ అసహనం వ్యక్తం చేశారు. కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని అంటున్నారు. అందుకే న్యాయపోరాటానికి దిగారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు ప్రభుత్వం తమ సినిమాను బ్యాన్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని పరిశీలించిన సర్వోన్నత న్యాయస్థానం మే 12వ తేదీన విచారించేందుకు అంగీకరించింది. సీజేఐ చంద్రచూడ్ ముందుకు ఈ పిటిషన్ ప్రస్తావన రాగా..ఆయన విచారణకు అంగీకరించారు. "మేం రోజూ డబ్బులో నష్టపోతున్నాం. ఇలా చూస్తుంటే అన్ని రాష్ట్రాలూ బ్యాన్ చేసేలా ఉన్నాయి" అని కోర్టులో చెప్పారు మూవీ మేకర్స్. ఇందుకు బదులుగా చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ "మే 12న విచారిస్తాం. వెస్ట్ బెంగాల్ ఏం చెప్పిందో ఆ ఆర్డర్ కాపీలు ఇవ్వండి" అని బదులిచ్చారు. 

అల్లర్లు జరుగుతాయని..

ఈ సినిమా కారణంగా అనవసరంగా మత విద్వేషాలు చెలరేగే ప్రమాదముందని, అల్లర్ల జరుగుతాయనే కారణంతోనే బ్యాన్ చేస్తున్నామని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. తమిళనాడు ప్రభుత్వం కూడా అలెర్ట్ ప్రకటించింది. దీనిపైనా న్యాయపోరాటం చేస్తోంది మూవీ టీం.  ఈ మూవీని ప్రదర్శించడానికి కొన్ని థియేటర్లు వెనకడుగు వేస్తున్నాయి. షోను రద్దు చేస్తున్నాయి. అల్లరు జరిగితే థియేటర్లు ధ్వంసం చేస్తారనే భయం వారిని వెంటాడుతోంది. మరోవైపు కొన్ని రాష్ట్రాలు కూడా ఈ మూవీపై బ్యాన్ విధించాయి. తాజాగా ఆ జాబితాలో పశ్చిమ బెంగాల్ కూడా చేరింది. ANI వార్తా సంస్థ సమాచారం ప్రకారం.. రాష్టంలో ద్వేషం, హింసాత్మక సంఘటనలు నివారించడానికి, శాంతిని కొనసాగించడానికి ‘ది కేరళ స్టోరీ’ మూవీని నిషేదిస్తున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ తరహాలోనే ‘ది కేరళ స్టోరీ’ కూడా ఒక వర్గాన్ని కించపరిచే చిత్రమేనని, ఇది విక్రీకరించిన కథ అని వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ నిర్ణయంపై చిత్ర నిర్మాత విపుల్ షా స్పందిస్తూ.. ‘‘మమతా మా మూవీపై నిషేదం విధించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. చట్టంలోని నిబంధనల ప్రకారం ఏది సాధ్యమైతే అది చేస్తాం. ప్రభుత్వ నిర్ణయంపై పోరాడుతాం’’ అని వెల్లడించారు. ‘ది కేరళ స్టోరీ’లో సున్నితమైన అంశాలు ఒక వర్గం మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయనే కారణంతో తమిళనాడులో కూడా ఈ మూవీపై నిషేదం విధించారు. అయితే, ఈ నిర్ణయాన్ని నేరుగా థియేటర్ అసోషియేషన్లే తీసుకోవడం గమనార్హం.

Also Read: Karnataka Elections 2023: కర్ణాణక ఎన్నికల్లో నోట్ల కట్టలు, మందు సీసాలు - గతంలో కన్నా భారీగా సీజ్

Published at : 10 May 2023 12:06 PM (IST) Tags: West Bengal The Kerala Story Tamilnadu Supreme Court The Kerala Story Controversy The Kerala Story Ban

సంబంధిత కథనాలు

VIDYADHAN: పేద విద్యార్థులకు సహకారం - ‘విద్యాధన్’ ఉపకారం! ఎంపిక, స్కాలర్‌షిప్ వివరాలు ఇలా!

VIDYADHAN: పేద విద్యార్థులకు సహకారం - ‘విద్యాధన్’ ఉపకారం! ఎంపిక, స్కాలర్‌షిప్ వివరాలు ఇలా!

3D Printed Temple: ప్రపంచంలోనే తొలి 3D ప్రింటెడ్ టెంపుల్, ఎక్కడో కాదు మన దగ్గరే

3D Printed Temple: ప్రపంచంలోనే తొలి 3D ప్రింటెడ్ టెంపుల్, ఎక్కడో కాదు మన దగ్గరే

CBSE Exams: సీబీఎస్‌ఈ 10, 12 తరగతి సప్లిమెంటరీ పరీక్షల డేట్‌ షీట్స్‌ విడుదల! ఏ పరీక్ష ఎప్పుడంటే?

CBSE Exams: సీబీఎస్‌ఈ 10, 12 తరగతి సప్లిమెంటరీ పరీక్షల డేట్‌ షీట్స్‌ విడుదల! ఏ పరీక్ష ఎప్పుడంటే?

AP SSC Exams: ఏపీలో రేపటి నుంచే పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!

AP SSC Exams: ఏపీలో రేపటి నుంచే పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!

TSPSC Group1: 'గ్రూప్-1' పరీక్షపై మళ్లీ హైకోర్టుకెక్కిన అభ్యర్థులు, దర్యాప్తు పూర్తయ్యేదాకా వద్దంటూ విజ్ఞప్తి!

TSPSC Group1: 'గ్రూప్-1' పరీక్షపై మళ్లీ హైకోర్టుకెక్కిన అభ్యర్థులు, దర్యాప్తు పూర్తయ్యేదాకా వద్దంటూ విజ్ఞప్తి!

టాప్ స్టోరీస్

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !

YS Viveka Case  : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !