Top Headlines Today: ఏపీ ఇంఛార్జీ డీజీపీగా శంఖబ్రత బాగ్చీ- ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు బిగ్ షాక్
AP Telangana Latest News 06 May 2024: నేటి ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో టాప్ హెడ్ లైన్స్ మీకోసం.. ఒక్క క్లిక్ చేసి 5 ప్రధాన వార్తలు చదవండి.
Telugu News Today - ఏపీ ఇంఛార్జీ డీజీపీగా శంఖబ్రత బాగ్చీ - నూతన డీజీగా ఎవరికి అవకాశం దక్కేనో!
ఏపీ ఇంఛార్జీ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి శంఖబ్రత బాగ్చీ (IPS Shankhabrata Bagchi) నియమితులయ్యారు. ప్రస్తుత డీజీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. డీజీ నియామకంపై ఈసీ తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. కాగా, డీజీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికల సంఘం ఆదివారం వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన్ను వెంటనే విధుల నుంచి రిలీవ్ కావాలని ఆదేశించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
'నేను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రత్యక్ష బాధితుడిని' - విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ సంచలన ట్వీట్
ప్రస్తుతం ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ చట్టం ద్వారా వైసీపీ నేతలు భూములు లాక్కునేందుకు కుట్రలు పన్నుతున్నారని టీడీపీ ఆరోపిస్తుండగా.. సీఎం జగన్ (Cm Jagan) పేదలకు భూములు ఇస్తాడని.. భూములు లాక్కోడని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ (Land Titling Act)పై విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ (PV Ramesh) సంచలన ట్వీట్ చేశారు. తాను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ఇబ్బందులు పడ్డానని #LandTitlingAct హ్యాష్ ట్యాగ్ తో పోస్ట్ చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు బిగ్ షాక్ - బెయిల్ నిరాకరించిన రౌస్ అవెన్యూ కోర్టు
ఢిల్లీ లిక్కర్ కేసులో (Delhi Liquor Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) బిగ్ షాక్ తగిలింది. ఈ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ న్యాయమూర్తి జస్టిస్ కావేరి బవేజా సోమవారం తీర్పు ఇచ్చారు. ఈ కేసుల్లో వేర్వేరుగా కవిత బెయిల్ పిటిషన్లు దాఖలు చేయగా.. న్యాయస్థానం మే 2న తీర్పు రిజర్వ్ చేసింది. ఎన్నికల నేపథ్యంలో స్టార్ క్యాంపెయినర్ ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని కవిత పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
'వారు జగన్ పడేసే బిస్కెట్లకు ఆశ పడేవారే' - వైఎస్ షర్మిల
తాను సీఎం జగన్ (Cm Jagan) ను పని కావాలని అడిగినట్లు కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (Ys Sharmila) మండిపడ్డారు. సోమవారం కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె జగన్ పై విమర్శలు గుప్పించారు. తాను రూ.వెయ్యి కోట్ల పని అడిగానని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అలా మాట్లాడేవాళ్లు జగన్ పడేసే బిస్కెట్లకు ఆశ పడే వాళ్లే అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
నీట్ యూజీ పరీక్షలో గందరగోళం - సెలెక్ట్ చేసిన పేపర్ బదులు వేరే పేపర్, ఆసిఫాబాద్ లో ఘటన
వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే నీట్ యూజీ - 2024 (NEET UG Exam - 2024) ప్రవేశ పరీక్ష దేశవ్యాప్తంగా ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. అయితే, రాష్ట్రంలోని కొమురం భీం ఆసిఫాబాద్ (Asifabad) జిల్లా కేంద్రంలో ఓ సెంటర్ లో నీట్ పరీక్ష నిర్వహణలో గందరగోళం నెలకొంది. దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఎన్టీఏ అందించిన పేపర్ ఒకటైతే.. జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ మోడల్ స్కూల్ సెంటర్ లో ఇచ్చిన పేపర్ మరొకటని విద్యార్థులు చెబుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి