Top Headlines Today: దొంగ ఓట్లపై ఈసీకి టీడీపీ, వైసీపీ ఫిర్యాదులు! హైదరాబాద్‌లో రోడ్లపై ప్రజాపాలన దరఖాస్తులు
AP Telangana Latest News 09 January 2024: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..

Telugu News Today: నేడు వైసీపీ మూడో జాబితా-సీటు ఉండేదెవరికి..? ఊడేదెవరికి?
వైనాట్ 175 లక్ష్యంగా.. నియోజకవర్గ ఇంఛార్జ్‌ల మార్పులు చేర్పులు చేస్తోంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP). ఇప్పటికే రెండు జాబితాలు విడుదల చేసింది. మొదటి జాబితా (First List)లో 11 మంది, రెండో జాబితా(Second List) లో 27 మంది కలిసి... మొత్తం 38 స్థానాల్లో ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించింది. ఈ రెండు జాబితాల్లో కొందరు సిట్టింగ్‌ల సీట్లు గల్లంతు కాగా... మరికొందరికి స్థానచలనలం కలిగింది. ఇవాళ మరో 29 స్థానాలకు ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. దీంతో వైసీపీ నేతల్లో (Ysrcp Leadrs) టెన్షన్ కనిపిస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
కాళేశ్వరంపై విజిలెన్స్ విచారణ - ఈఎన్సీ కార్యాలయంలో సోదాలు !
కాళేశ్వరంలో అవినీతిపై విచారణ చేయిస్తామని కొద్ది రోజులుగా ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కార్యరూపంలోకి వచ్చాయి. ముందస్తుగా మేడిగడ్డ కుంగుబాటుపై విచారణను విజిలెన్స్ కు అప్పగించారు. జలసౌధలోని ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. మేడిగడ్డ కుంగుబాటుకు కారణాలేమిటో తేల్చాలని విజిలెన్స్ ను ఆదేశించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మొత్తం పన్నెండు చోట్ల సోదాలు జరుగుతున్నాయని చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఈసీని కలిసిన చంద్రబాబు పవన్ కల్యాణ్- ఓటర్ లిస్ట్‌పై ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ లిస్టులో తప్పులు ఉన్నాయని వాటిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా రాష్ట్ర అధికారులు పట్టించుకోలేదని ఎన్నిక సంఘానికి టీడీపీ, జనసేన అధినేతలు ఫిర్యాదు చేశారు. ఈ ఉదయం ఈసీతో సమావేశమైన చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్యలు తీసుకోవాలని లిస్ట్ సరిచేయాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు... రాష్ట్రంలోని ఓటర్ల లిస్టులో జరుగుతున్న అక్రమాలు, ఎన్నికల సిబ్బంది నియామకంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అన్ని విషయాలు చాలా స్పష్టంగా వివరించామని... తమ వాదనను సుదీర్ఘంగా వివరించామన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
రోడ్లపై ప్రజాపాలన దరఖాస్తులు- ప్రజల్లో ఆందోళన
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు కోసం స్వీకరించిన ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డుపాలయ్యాయి. హైదరాబాద్‌లోని బాలానగర్ ఫ్లైఓవర్‌పై... ర్యాపిడో బైక్‌పై అప్లికేషన్లు తీసుకెళ్తుండగా.. దరఖాస్తులన్నీ కిందపడి గాలికి ఎగిరిపోయాయి. రోడ్లుపై ప్రజాపాలన దరఖాస్తులు కనిపించడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అవన్నీ హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌కు చెందిన ప్రజాపాలన దరఖాస్తులుగా సమాచారం. బాలానగర్ ఫ్లైఓవర్‌పై చిందరవందరగా పడి ఉండటం చూసి... వాహనదారులు అవాక్కయ్యారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
జనసేన గుర్తింపు లేని పార్టీ - బోగస్ ఓట్లు లేవు - విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు !
ఏపీ, తెలంగాణలో ఒకే సారి ఎన్నికలు పెట్టాలని ఎన్నికల సంఘాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ విజయవాడలో నిర్వహించిన సమావేశానికి పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో వారి అభ్యంతరాలను , ఫిర్యాదులను సీఈసీ స్వీకరించింది. ఈ క్రమంలో వైసీపీ నుండి ఎంపీ విజయసాయి రెడ్డి ఈ సమావేశానికి హాజర్యయారు. ఈ సందర్బంగా టీడీపీ ఇల్లీగల్ ఓటర్ ప్రొఫైలింగ్ చేస్తుందని సీఈసీకి ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి





















