అన్వేషించండి

TS EDCET Results: నేడు తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు, రిజల్ట్స్ సమయమిదే!

బీఈడీ రెగ్యులర్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్‌ ఎడ్‌సెట్‌ ఫలితాలు సోమవారం విడుదలకానున్నాయి. అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కన్వీనర్‌ ప్రొఫెసర్‌ రామకృష్ణ సూచించారు.

బీఈడీ రెగ్యులర్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్‌ ఎడ్‌సెట్‌ ఫలితాలు సోమవారం విడుదలకానున్నాయి. సాయంత్రం 4 గంటలకు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి, వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ వెంకటరమణ, మహాత్మాగాంధీ వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ గోపాల్‌రెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాల కోసం https://edcet.tsche.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కన్వీనర్‌ ప్రొఫెసర్‌ రామకృష్ణ, కో-కన్వీనర్‌ ప్రొఫెసర్‌ శంకర్‌ సూచించారు.

ఎడ్‌సెట్‌ ర్యాంక్‌ ఆధారంగా 2023-24 విద్యా సంవత్సరానికి గానూ రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో రెండు సంవత్సరాల బీఈడీ రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశాలకు గానూ తెలంగాణ ఉన్నత విద్యామండలి (TSCHE) తరపున మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఎడ్‌సెట్‌ నిర్వహించింది. ఎడ్‌సెట్‌ ఎగ్జామ్‌ను మే 18న మూడు సెషన్లలో నిర్వహించగా, 86 శాతం విద్యార్థులు హాజరయ్యారు.

Also Read:
తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి స్కూల్స్ ప్రారంభం- సెలవుల పొడిగింపు వార్తలన్నీ ఫేక్
తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి బడి గంట మోగనుంది. విపరీతమైన ఎండ కారణంగా పని వేళలను తగ్గించాయి ప్రభుత్వాలు. ఇప్పటికే కొత్త విద్యాసంవత్సరం పని దినాలు, చేపట్టాల్సిన కార్యచరణను ప్రభుత్వాలు విద్యాసంస్థలకు పంపించాయి. తెలంగాణలో 41 వేల స్కూళ్లు, గురుకులాలు, వసతిగృహాలు తెరుచుకోనున్నాయి. దాదాపు 60 లక్షల మంది విద్యార్థులు స్కూల్‌కు వెళ్లనున్నారు. 2023-24 విద్యా సంవత్సరంలో చేపట్టాల్సిన కార్యక్రమాలతో పటిష్టమైన ప్రణాళికను రూపొందించారు.తెలంగాణలో పాఠశలల సెలవులు పొడిగించారని వస్తున్న వార్తలపై విద్యాశాఖ స్పందించింది.  విద్యాశాఖ సెక్రటరీ మాట్లాడుతూ... వేసవి సెలవులను 19 వరకు పొడిగించారని ఫేక్‌ న్యూస్‌ తమ దృష్టికి వచ్చిందన్నారు. అది నిజం కాదన్నారు. సెలవులను పొడిగించలేదని తేల్చి చెప్పారు. సోషల్‌మీడియాలో ఫేక్‌ సర్క్యులర్‌ వైరల్ అవుతోందని క్లారిటీ ఇచ్చారు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

తొలిరోజే విద్యాకానుక అందిస్తున్న ప్రభుత్వం- పల్నాడు జిల్లాలో స్టార్ట్ చేయనున్న సీఎం
జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న 43,10,165 మంది విద్యార్థినీ, విద్యార్థులకు రూ. 1,042.53 కోట్ల ఖర్చుతో విద్యా కానుక కిట్ల పంపిణీ చేయనున్నారు.విద్యార్ధుల బంగారు భవిష్యత్తుకు బాటను వేస్తూ, చదువుల భారం మొత్తాన్ని సర్కార్ భరిస్తోందని ప్రభుత్వం చెబుతోంది. వరుసగా నాలుగో ఏడాది 2023-24 విద్యా సంవత్సరానికి జగనన్న విద్యా కానుక పంపిణి చేయబోతున్నట్టు ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లాంచనంగా ప్రారంభించనున్నారు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఉమ్మడి కౌన్సెలింగ్‌ ద్వారానే మెడికల్ కాలేజీల్లో యూజీ ప్రవేశాలు, ఎన్‌ఎంసీ ప్రతిపాదన!
దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఇకపై ఉమ్మడి కౌన్సెలింగ్‌ నిర్వహించాలని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) ప్రతిపాదించింది. నీట్‌-యూజీ మెరిట్‌ లిస్ట్‌ ఆధారంగా ఈ కౌన్సెలింగ్‌ జరగాలని తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ మేరకు జూన్‌ 2న గెజిట్‌ విడుదల చేసింది. కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఎన్‌ఎంసీ జారీ చేసిన సీట్ల వివరాల జాబితా ఆధారంగానే జరగాలని, అవసరమైతే పలు దశల్లో సీట్ల భర్తీ చేపట్టవచ్చని సూచించింది. ప్రభుత్వం త్వరలోనే ఈ ప్రక్రియకు సంబంధించి ప్రత్యేక అధికారిని నియమిస్తుందని ఎన్‌ఎంసీ పేర్కొంది. కౌన్సెలింగ్‌కు సంబంధించిన మార్గదర్శకాలను అండర్-గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ (UGMEB) విడుదల చేస్తుంది. సెక్షన్-17 కింద ప్రచురించిన మార్గదర్శకాలకు అనుగుణంగా కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తుంది. కౌన్సెలింగ్ కోసం ప్రభుత్వం ఒక నిర్దేశిత అధికారిని నియమిస్తుంది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Harsh Dubey Replaces Washington: ఇంగ్లాండ్ తో మూడో వ‌న్డేకు ముందు టీమిండియాలో మార్పు.. స్పిన్ ఆల్ రౌండ‌ర్ ప్లేస్ లో మ‌రో యంగ్ ప్లేయ‌ర్.. సిరీస్ పై క‌న్నేసిన ఇరుజ‌ట్లు..
ఇంగ్లాండ్ తో మూడో వ‌న్డేకు ముందు టీమిండియాలో మార్పు.. స్పిన్ ఆల్ రౌండ‌ర్ ప్లేస్ లో మ‌రో యంగ్ ప్లేయ‌ర్.. సిరీస్ పై క‌న్నేసిన ఇరుజ‌ట్లు..
ABP Desam Top 10, 18 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 18 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Breaking News: 72 జాతీయ చలనచిత్ర అవార్డులు లైవ్ వీక్షించండి
72nd నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటన.. ఉత్తమ నటీనటులు, డైరెక్టర్ ఎవరంటే ?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Guntur Crime News: గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
Embed widget