అన్వేషించండి

తొలిరోజే విద్యాకానుక అందిస్తున్న ప్రభుత్వం- పల్నాడు జిల్లాలో స్టార్ట్ చేయనున్న సీఎం

"జగనన్న విద్యాకానుక" కిట్ కు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (QCI) తో సహా 4 దశల్లో నాణ్యత పరీక్షలు పూర్తి చేశామని ప్రభుత్వం చెబుతోంది. ప్రతి విద్యార్థి దాదాపు రూ.2,400ల లబ్ధిపొందుతున్నట్టు పేర్కొంటోంది.

జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న 43,10,165 మంది విద్యార్థినీ, విద్యార్థులకు రూ. 1,042.53 కోట్ల ఖర్చుతో విద్యా కానుక కిట్ల పంపిణీ చేయనున్నారు.

విద్యార్ధుల బంగారు భవిష్యత్తుకు బాటను వేస్తూ, చదువుల భారం మొత్తాన్ని సర్కార్ భరిస్తోందని ప్రభుత్వం చెబుతోంది. వరుసగా నాలుగో ఏడాది 2023-24 విద్యా సంవత్సరానికి జగనన్న విద్యా కానుక పంపిణి చేయబోతున్నట్టు ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లాంచనంగా ప్రారంభించనున్నారు. 

కిట్‌లో ఏముంటాయి
ప్రతి విద్యార్థికి ఉచితంగా బైలింగువల్ పాఠ్య పుస్తకాలు ( ఒక పేజీలో ఇంగ్లీష్ మరో పేజీలో తెలుగులో పాఠ్యాంశాలు), నోట్ బుక్‌లు, వర్క్‌బుక్‌లు, 3జతల యూనిఫామ్ క్లాత్ కుట్టు కూలితో సహా, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతో పాటు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీషు-తెలుగు డిక్షనరీ (6-10 తరగతి పిల్లలకు), పిక్టోరియల్ డిక్షనరీ (1-5 తరగతి పిల్లలకు)తో కూడిన విద్యాకానుక కిట్ ను స్కూల్స్ తెరిచిన ఫస్ట్ డేనే అందించనున్నారు.

"జగనన్న విద్యాకానుక" కిట్ కు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (QCI) తో సహా 4 దశల్లో నాణ్యత పరీక్షలు కూడ పూర్తి చేశారు. ప్రతి విద్యార్థికి దాదాపు రూ.2,400ల విలువైన విద్యా కానుక పంపిణి చేస్తున్నట్లుగా సర్కార్ చెబుతోంది.  

గతంలో అలా...ఇప్పుడు ఇలా....
గత ప్రభుత్వంలో స్కూల్స్ తెరిచి 6-7 నెలలైనప్పటికీ యూనిఫారం ఇచ్చే పరిస్దితి ఉండేదని కాదని, కనీసం పాఠ్యపుస్తకాలు కూడా అందించలేని దుస్థితిలో విద్యార్థులు పడిన అవస్దలను గురించి కూడ జగన్ సర్కార్ ప్రస్తావిస్తోంది.  ఇక విద్యార్థులకు అవసరం అయిన ఇతర వస్తువుల ఊసే లేకపోయేదని చెబుతున్నారు. ఆ పరిస్థితిని సమూలంగా మారుస్తూ ఈ ప్రభుత్వంలో పాఠశాలలు తెరిచిన రోజే 10 వస్తువులతో కూడిన జగనన్న విద్యా కానుక కిట్ అందచేయటం గొప్ప విషయమని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. కార్పొరేట్ స్కూళ్ళు సైతం ప్రభుత్వ బడులతో పోటీపడేలా విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేలా, రాబోయే రోజుల్లో ప్రతి బడి ఇంగ్లీషు మీడియంతో సీబీఎస్ఈ సిలబస్ తీసుకువస్తున్నట్టు పేర్కొంటోంది. 

డిజిటల్ విధానంలో పాఠ్యాంశాలు బోధించే దిశగా తొలిదశ "మనబడి నాడు నేడు"లో -అభివృద్ధిపరిచిన 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న 30 వేలకుపైగా క్లాస్ రూములలో బైజూస్ కంటెంట్‌తో కూడిన ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్ అందించింది. దీని వలన సులభంగా అర్థమయ్యేలా డిజిటల్ బోధన, ఇంగ్లీష్ లాబ్స్ ఏర్పాటు 1-5 వరకు ప్రతి స్కూల్లో ఉండేలా 10 వేల స్మార్ట్ టీవీలు కూడా ఏర్పాటు దిశగా అడుగులు వేసింది.

మొదటి దశ మనబడి నాడు -నేడులో పనులు పూర్తైన 15,715 స్కూళ్లలో ఈ ఏడాది జులై 12 నాటికి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ (IFP) ఏర్పాటు చేయనున్నారు. రెండో దశలో భాగంగా 22,344 స్కూళ్ళలో ఈ ఏడాది డిసెంబర్ 21 నాటికి ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్ నెలకొల్పనున్నారు. ఇక మిగిలిన 15 వేల స్కూళ్ళకు మూడో దశలో ఐఎఫ్పీలు, 8వ తరగతి విద్యార్ధులకు బైజాన్ కంటెంట్ తో కూడిన ఉచిత ట్యాబ్లు, 4 నుంచి 10వ తరగతి వరకు ఉచితంగా బైజూస్ కంటెంట్ కూడా సమకూర్చుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా బైజూస్ కంటెంట్ ఇవ్వనున్నారు. 

పాఠశాలలకు ఇంటర్ నెట్ సదుపాయం...
బీఎస్ఎన్ఎల్, ఏపీ ఫైబర్ నెట్ ద్వారా 45,000 పాఠశాలల్లో ఇంటర్ నెట్ అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులు స్పోకెన్ ఇంగ్లీష్‌లో నైపుణ్యం సాధించేలా ఈ ఏడాది నుంచే ప్రతి స్కూల్లో శిక్షణ ఇవ్వనున్నారు. టోఫెల్ ప్రైమరీ, టోఫెల్ జూనియర్ పరీక్షలు కూడా నిర్వహించి అమెరికన్ సర్టిఫికెట్ కూడా విద్యార్థులకు అందిస్తామని సర్కార్ చెబుతోంది. ఈ మేరకు అమెరికన్ సంస్ధ ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీసెస్ (ఈటీఎస్) తో ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. 

అయితే హెడ్ మాస్టర్...లేదంటే టోల్ ఫ్రీ...
విద్యా కానుక ద్వారా పొందిన వస్తువుల్లో ఏమైనా ఇబ్బందులుంటే విద్యార్థులు తమ స్కూల్ హెడ్ మాష్టర్ కు వాటిని అందిస్తే వారం రోజుల్లో రీప్లేస్ చేసుకోవచ్చు. అప్పటికి సమస్యల పరిష్కారం కాకపోయినా, లేదంటే మరే ఇతర ఫిర్యాదులున్నా 14417 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి ఫిర్యాదు చేసే సదుపాయాన్ని కూడా సర్కార్ అందుబాటులోకి తెచ్చింది. జగనన్న అమ్మఒడి లబ్ధిదారుల సంఖ్య 44,48,865, అందించిన మొత్తం 19,674.34 కోట్లని ప్రభుత్వం వెల్లడించింది. విద్యా కానుక లబ్ధిదారుల సంఖ్య 47,40,421, అందించిన మొత్తం 3,366.53కోట్లు కాగా, గోరుముద్ద లబ్ధిదారుల సంఖ్య 43,26,782, అందించిన మొత్తం 3,590.00కోట్లు. 

పాఠశాలల్లో నాడు నేడు మొదటి దశలో 15,715 స్కూల్స్ లో 3,669.00కోట్లు ఖర్చు చేశారు. పాఠశాలల్లో నాడు నేడు రెండో దశ 22,344 స్కూల్స్‌లో 8,000.00కోట్లతో పనులు చేశారు. మూడు దశల్లో రూ. 17,805 కోట్ల వ్యయంతో మొత్తం 45,975 స్కూల్స్‌లో అభివృద్ది పనులు చేపట్టామని ప్రభుత్వం వెల్లడిస్తోంది. వైఎస్సార్ సంపూర్ణ పోషణ లబ్ధిదారుల సంఖ్య 35,70,675 కాగా అందించిన మొత్తం 6,141.34కోట్లని ప్రకటించారు. స్వేచ్ఛ (శానిటరీ న్యాప్కిన్స్) లబ్ధిదారుల సంఖ్య 10,01,860 కాగా అందించిన మొత్తం 32.00కోట్లు. 5,18,740 మంది 8 వ తరగతి విద్యార్ధులు, టీచర్లకు 685.87కోట్లతో ట్యాబ్ లు అందించామని చెబుతోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
Stock Market: కేంద్ర బడ్జెట్ శనివారం రోజున వస్తే స్టాక్ మార్కెట్లకు సెలవు ఇస్తారా, ఓపెన్‌ చేస్తారా?
కేంద్ర బడ్జెట్ శనివారం రోజున వస్తే స్టాక్ మార్కెట్లకు సెలవు ఇస్తారా, ఓపెన్‌ చేస్తారా?
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Embed widget