అన్వేషించండి

తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి స్కూల్స్ ప్రారంభం- సెలవుల పొడిగింపు వార్తలన్నీ ఫేక్

సెలవులు పొడిగిస్తున్నారంటూ సోషల్ మీడియాలో తిరుగుతున్న వార్తలన్నీ ఫేక్‌. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి బడి గంట మోగనుంది.

తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి బడి గంట మోగనుంది. విపరీతమైన ఎండ కారణంగా పని వేళలను తగ్గించాయి ప్రభుత్వాలు. ఇప్పటికే కొత్త విద్యాసంవత్సరం పని దినాలు, చేపట్టాల్సిన కార్యచరణను ప్రభుత్వాలు విద్యాసంస్థలకు పంపించాయి. 

తెలంగాణలో 41 వేల స్కూళ్లు, గురుకులాలు, వసతిగృహాలు తెరుచుకోనున్నాయి. దాదాపు 60 లక్షల మంది విద్యార్థులు స్కూల్‌కు వెళ్లనున్నారు. 2023-24 విద్యా సంవత్సరంలో చేపట్టాల్సిన కార్యక్రమాలతో పటిష్టమైన ప్రణాళికను రూపొందించారు.

తెలంగాణలో పాఠశలల సెలవులు పొడిగించారని వస్తున్న వార్తలపై విద్యాశాఖ స్పందించింది.  విద్యాశాఖ సెక్రటరీ మాట్లాడుతూ... వేసవి సెలవులను 19 వరకు పొడిగించారని ఫేక్‌ న్యూస్‌ తమ దృష్టికి వచ్చిందన్నారు. అది నిజం కాదన్నారు. సెలవులను పొడిగించలేదని తేల్చి చెప్పారు. సోషల్‌మీడియాలో ఫేక్‌ సర్క్యులర్‌ వైరల్ అవుతోందని క్లారిటీ ఇచ్చారు. 

గతేడాది 1-8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టిన సర్కారు ఈసారి దాన్ని 9వ తరగతికి విస్తరించనుంది. అంతేకాకుండా విద్యార్థులపై చదువు భారం లేకుండా మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. ప్రతి మూడో శనివారం నో బ్యాగ్ డే నిర్వహిస్తారు. ఆ రోజు ఎలాంటి చదువుల ఒత్తిడి లేకుండా ఆటలు ఆడిపిస్తారు. సిలబస్‌లో లేని అంశాలు, విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని కలిగించే కార్యక్రమాలు చేపడతారు. ఆధునిక సాంకేతికతపైై జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీ నిర్వహిస్తారు. 

విద్యార్థులకు టీఎల్‌ఎం(టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్) అందిస్తారు. ఈ సంవత్సరం కూడా ఫౌండేషన్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్‌) కార్యక్రమం అమలు చేస్తారు. ఆధునిక ప్రపంచంతో పోటీ పడేలా చేపట్టాల్సిన కార్యక్రమాలతో ప్రత్యేక మాడ్యూల్‌ను తయారు చేసి ఆయా స్కూల్స్‌కు పంపించారు. 

తెలంగాణలోని 19,800 టీచర్లకు ట్యాబ్‌లు అందజేయనున్నారు. 2,265 జిల్లా పరిషత్‌ స్కూళ్లు, 467 మండల వనరుల కేంద్రాల్లో ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్‌ పంపిణీ చేస్తారు. 

ఏపీలో ఇలా

ఆంధ్రప్రదేశ్‌లో కూడా వేసవి సెలువుల పొడింగుపు లేదని అధికారులు తేల్చి చెప్పారు. రాష్ట్రంలోని పాఠశాలలు నేటి నుంచి తెరుచుకోనున్నాయి. అయితే ఉష్ణోగ్రతలు ఎక్కువ రిజిస్ట్ర అవుతున్న వేళ కొన్ని మార్పులు చేసింది ప్రభుత్వం. 17వ తేదీ వరకు ఒంటిపూట బడులే ఉంటాయని పేర్కొంది. ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 11.30 వరకు మాత్రమే స్కూల్ ఉంటుందని ప్రకటించింది. 

ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణి చేయనుంది. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లాంచనంగా ఈ కిట్ల పంపిణీని ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న 43,10,165 మంది విద్యార్థినీ, విద్యార్థులకు రూ. 1,042.53 కోట్ల ఖర్చుతో విద్యా కానుక కిట్ల పంపిణీ చేయనున్నారు.  

కిట్‌లో ఏముంటాయి
ప్రతి విద్యార్థికి ఉచితంగా బైలింగువల్ పాఠ్య పుస్తకాలు ( ఒక పేజీలో ఇంగ్లీష్ మరో పేజీలో తెలుగులో పాఠ్యాంశాలు), నోట్ బుక్‌లు, వర్క్‌బుక్‌లు, 3జతల యూనిఫామ్ క్లాత్ కుట్టు కూలితో సహా, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతో పాటు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీషు-తెలుగు డిక్షనరీ (6-10 తరగతి పిల్లలకు), పిక్టోరియల్ డిక్షనరీ (1-5 తరగతి పిల్లలకు)తో కూడిన విద్యాకానుక కిట్ ను స్కూల్స్ తెరిచిన ఫస్ట్ డేనే అందించనున్నారు.

"జగనన్న విద్యాకానుక" కిట్ కు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (QCI) తో సహా 4 దశల్లో నాణ్యత పరీక్షలు కూడ పూర్తి చేశారు. ప్రతి విద్యార్థికి దాదాపు రూ.2,400ల విలువైన విద్యా కానుక పంపిణి చేస్తున్నట్లుగా సర్కార్ చెబుతోంది.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Pawan Kalyan Latest News: పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
Political News : జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
Mirai Audio Rights: హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Pawan Kalyan Latest News: పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
Political News : జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
Mirai Audio Rights: హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
Tirumala News: తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
Priyanka Gandhi Took Oath Today: వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Nani Or Naga Chaitanya: శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీలో హీరో ఎవరు? నాని లేదా నాగ చైతన్య... ఇద్దరిలో ఛాన్స్ ఎవరికి?
శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీలో హీరో ఎవరు? నాని లేదా నాగ చైతన్య... ఇద్దరిలో ఛాన్స్ ఎవరికి?
Embed widget