Revanth Reddy: 26న ఢిల్లీకి రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీతో భేటీ కోసమే పర్యటన!
Revanth Reddy Delhi Tour: సాయంత్రం 4 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తారని సమాచారం. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలను రేవంత్ రెడ్డి ప్రధానితో చర్చించే అవకాశం ఉంది.
Revanth Reddy Delhi Tour to Meet PM Modi: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు (డిసెంబర్ 26) ఢిల్లీకి (Revanth Reddy Delhi Tour) వెళ్లనున్నారు. ప్రధాని మోదీని కలవడం కోసం ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. రేవంత్ రెడ్డి వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కూడా వెళ్తున్నారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక రేవంత్ రెడ్డి ప్రధానిని (Revanth Reddy Meets PM Modi) కలవనుండడం ఇదే మొదటిసారి.
బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఢిల్లీకి (Revanth Reddy Delhi Tour) వెళ్లనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తారని సమాచారం. తెలంగాణకు సంబంధించిన విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, పలు అంశాలను రేవంత్ రెడ్డి ప్రధానితో (Revanth Reddy Meets PM Modi) చర్చించే అవకాశం ఉంది. ఈ భేటీ అనంతరం ఏఐసీసీ అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ వ్యవహారాలు, పార్లమెంటు ఎన్నికలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడి పని చేసిన కాంగ్రెస్ నేతలతో పాటు టికెట్లు త్యాగం చేసిన కాంగ్రెస్ లీడర్లకు నామినేటెడ్ పోస్టులు ఇస్తామని అప్పట్లో చెప్పి సముదాయించారు. ప్రస్తుతం వారు నామినేటెడ్ పోస్టుల కోసం వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో దిల్లీ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. కాంగ్రెస్ పెద్దలతో సమావేశం అయి రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై చర్చించనున్నారు. అధికారం చేపట్టిన తరువాత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించబోతున్నారు. ఎమ్మెల్సీ పదవులు, లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై ఏఐసీసీ పెద్దలతో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.