Telangana Assembly Speaker Gaddam Prasad Kumar: తెలంగాణ శాసనసభాపతిగా గడ్డం ప్రసాద్ కుమార్ - ఎంపీటీసీ టూ స్పీకర్ చైర్, రాజకీయ ప్రస్థానం ఇదే!
Gaddam Prasad Kumar: తెలంగాణ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంపీటీసీ నుంచి సభాపతిగా ఎన్నికైన ఆయన రాజకీయ ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకమని నేతలు కొనియాడారు.
Telangana Assembly Speaker Gaddam Prasad Kumar: తెలంగాణ అసెంబ్లీ నూతన శాసన సభాపతిగా గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభ ప్రారంభమైన అనంతరం ముందుగా ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ ను అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత స్పీకర్ గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కు సీఎం రేవంత్ రెడ్డి (CM RevanthReddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. శాసన స్పీకర్ బాధ్యతలు చేపట్టిన తొలి దళిత నేతగా గడ్డం ప్రసాద్ కుమార్ చరిత్ర సృష్టించారు. ఆయన ఎంపీటీసీగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి నేడు స్పీకర్ గా ఎన్నికయ్యారు. స్పీకర్ గా ఎన్నికైన అనంతరం ఆయన్ను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పీకర్ స్థానం వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.
ఎంపీటీసీ టూ స్పీకర్ చైర్
గడ్డం ప్రసాద్ కుమార్.. 1964లో మర్పల్లిలో జన్మించారు. ఈయన 21 ఏళ్ల ప్రాయంలోనే రాజకీయాల్లోకి వచ్చారు. 1984లో ఇంటర్ పూర్తి చేసి, కాంగ్రెస్ అభ్యర్థిగా 2008 ఉప ఎన్నికల్లో బరిలో నిలిచారు. వికారాబాద్ లో అఖండ విజయాన్ని సాధించారు. 2009లో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012లో ఉమ్మడి ఏపీలో అప్పటి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పని చేశారు. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా ఓటమి చవిచూశారు. అనంతరం 2022లో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం ఆయన్ను స్పీకర్ పదవికి కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. స్పీకర్ గా గడ్డం ప్రసాద్ అభ్యర్థిత్వానికి బీజేపీ మినహా మిగతా అన్ని పార్టీల మద్దతు లభించింది. ఆయనకు 63 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంఐఎం 7, సీపీఐకు చెందిన ఓ ఎమ్మెల్యే మద్దతు తెలిపారు. దీంతో స్పీకర్ గా ఆయన ఎన్నిక ఏకగ్రీవమే అయ్యింది.
మంచి సంప్రదాయం కొనసాగాలి