అన్వేషించండి

Telangana Andhra Pradesh Rains Update: తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వర్షాలు - హైదరాబాద్‌లో మళ్లీ జడివాన - ఆదివారం ఎలా ఉంటుందంటే ?

Southwest Monsoon Telugu States: తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల రాకతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. హైదరాబాద్‌తో పాటు ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

 IMD Orange Alert Hyderabad:  తెలుగు రాష్ట్రాల ప్రజలను ఇన్నాళ్లూ ఉక్కిరిబిక్కిరి చేసిన ఎండ తీవ్రతకు ఎట్టకేలకు తెరపడింది. నైరుతి రుతుపవనాల విస్తరణతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం వరకు ఉభయ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంతో పాటు ఏపీలోని సెంట్రల్ కోస్తా, రాయలసీమ ప్రాంతాలను వరుణుడు పలకరించడంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ఎండ వేడి నుంచి ఉపశమనం లభించినప్పటికీ.. ఒక్కసారిగా కురిసిన కుండపోత వానల వల్ల పలు చోట్ల జనజీవనం స్తంభించింది.    

హైదరాబాద్‌లో మధ్యాహ్నం నుంచి వర్షం

హైదరాబాద్ నగరంలో శనివారం మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో వాన బీభత్సం సృష్టించింది. ఐఎండీ  హైదరాబాద్ కేంద్రం నగరానికి ఎల్లో, పరిసర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కోటి, సుచిత్ర, రాజేంద్రనగర్, అత్తాపూర్, మణికొండ, నాంపల్లి, మియాపూర్, మాదాపూర్ వంటి ప్రధాన ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈకల గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆకస్మికంగా కురిసిన ఈ వాన వల్ల ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, ప్రధాన కూడళ్లలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. జీహెచ్ఎంసీ, డిజాస్టర్ మేనేజ్మెంట్   బృందాలు రంగంలోకి దిగి రోడ్లపై నిలిచిన నీటిని తొలగించే చర్యలు చేపట్టాయి. తెలంగాణలోని రంగారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు శనివారం రాత్రి వరకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుందని, గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.   

ఏపీలోనూ బలంగా రుతుపవనాల ప్రభావం

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ రుతుపవనాల ప్రభావం బలంగా కనిపిస్తోంది. సెంట్రల్ ఆంధ్రా పరిధిలోని ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గురువారం రాత్రి నుంచి శనివారం వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. విజయవాడ నార్త్ నియోజకవర్గంలో అత్యధికంగా 102 మిమీ రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా విజయవాడలోని పలు ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. అలాగే రాయలసీమలోని కర్నూలు మంత్రాలయం 50 మిమీ , అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు పడుతుండటంతో రైతన్నలు సాగు పనులకు సిద్ధమవుతున్నారు.   

మరో రోజు ఈదురుగాలులతో వర్షం

భారత వాతావరణ శాఖ  తాజా బులిటెన్ ప్రకారం.. నైరుతి రుతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలకు వేగంగా విస్తరిస్తున్నాయి. అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో రాబోయే రెండు మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమల్లో జూన్ 14 వరకు భారీ వర్షాలు, ఈదురు గాలులు ఉంటాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ప్రజలు ఎవరూ చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకూడదని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. ముఖ్యంగా వాహనదారులు రోడ్లు జారే ప్రమాదం ఉన్నందున వేగాన్ని తగ్గించి ప్రయాణించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ అధికారులు విజ్ఞప్తి చేశారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
Breaking News: ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 
ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం 
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget