అన్వేషించండి

AP Telangana Weather Update: ఏపీలో పలు జిల్లాలకు పిడుగుల వార్నింగ్.. తెలంగాణలో ఆ జిల్లాల్లో 3 రోజులు భారీ వర్షాలు

Hyderabad Rains | నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దాంతో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి ప్రజల్ని అప్రమత్తం చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల పిడుగులతో వర్షాలు, ఆరెంజ్ అలెర్ట్.
  • కొన్ని జిల్లాల్లో 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం.
  • తెలంగాణలో రుతుపవనాలు విస్తరించి మూడు రోజులు భారీ వర్షాలు.
  • వివిధ జిల్లాలకు ఎల్లో హెచ్చరిక, ప్రజలకు ఉపశమనం లభించింది.

Rains In AP and Telangana | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాగల 24 గంటల్లో వాతావరణం పూర్తిగా మారుతోంది. ఒకవైపు ఎండల తీవ్రత కొనసాగుతుండగానే.. మరోవైపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. బుధవారం నాడు (జూన్ 10న) అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, ప్రకాశం (మార్కాపురం), నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉండటంతో పాటు తేలికపాటి జల్లులు కురుస్తాయని పేర్కొన్నారు.

వర్ష సూచన ఉన్నప్పటికీ కొన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత తగ్గలేదు. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలతో పాటు పోలవరం పరిసర ప్రాంతాల్లోని కొన్ని చోట్ల పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 41 డిగ్రీల నుండి 42 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.

పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ
తీవ్రమైన గాలులు, పిడుగుల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేసింది. విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాలతో పాటు పోలవరం ప్రాంతాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ సమయంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వర్షం పడే సమయంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు, గొర్రెల కాపర్లు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద, పాత భవనాల వద్ద నిలబడకుండా సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలో విస్తరిస్తున్న రుతుపవనాలు.. మూడు రోజులు భారీ వర్షాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ వేగంగా విస్తరిస్తున్నాయి. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని మిగిలిన అన్ని ప్రాంతాలకూ పూర్తిగా విస్తరించడానికి వాతావరణం అనుకూలంగా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే కొన్ని రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ముఖ్యంగా దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మూడు రోజులుపాటు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

రుతుపవనాల ప్రభావంతో మొదలైన వర్షాల కారణంగా వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. వీటితో పాటు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అలాగే  హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, కరీంనగర్, వరంగల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని హెచ్చరించారు.

రుతుపవనాల ప్రభావంతో జూన్ నెల 14వ తేదీ వరకు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురవనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. గత కొన్ని వారాలుగా భానుడి భగభగలు, సాధారణం కంటే ఎక్కువ నమోదైన ఉష్ణోగ్రతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తొలకరి జల్లులు ఉపశమనాన్ని కలిగించాయి. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలతో వాతావరణం చల్లగా మారడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సాగు పనులకు సిద్ధమవుతున్న రైతుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. 

Frequently Asked Questions

ఆంధ్రప్రదేశ్‌లో రాగల 24 గంటల్లో వాతావరణం ఎలా ఉండనుంది?

ఎండల తీవ్రత కొనసాగుతూనే కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి వంటి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఆశించవచ్చు.

తెలంగాణలో రుతుపవనాల పరిస్థితి ఏమిటి?

నైరుతి రుతుపవనాలు తెలంగాణలో చురుగ్గా కదులుతూ వేగంగా విస్తరిస్తున్నాయి. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరించడానికి వాతావరణం అనుకూలంగా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఏ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు?

విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాలతో పాటు పోలవరం ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. బలమైన ఈదురుగాలులు, పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు ఆశించబడుతున్నాయి.

తెలంగాణలో ఏ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు?

రుతుపవనాల ప్రభావంతో వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

వర్షాలు పడే సమయంలో ఏపీ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?

వర్షం పడే సమయంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు, గొర్రెల కాపర్లు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకుండా సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Breaking News: 10 వేల పోస్టులతో ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల
10 వేల పోస్టులతో ఏపీలో జాబ్ క్యాలెండర్ విడుదల
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget