X

Cm Stalin: సిటీ బస్సెక్కిన సీఎం... సెల్ఫీల కోసం ఎగబడ్డ ప్రయాణికులు

సీఎం సడన్ గా సిటీ బస్సు ఎక్కారు. అందరికీ ఒక్క నిమిషం ఏం జరుగుతుందో అర్థంకాలేదు. సరదాగా ప్రయాణికులను పలకరించి ప్రభుత్వ పథకాలపై ఆరా తీశారు. ప్రయాణికులతో సెల్పీలు కూడా దిగారు.

FOLLOW US: 

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ ఏంచేసినా సంచలనంగా మారింది. పరిపాలనలో తన మార్క్ చూపిస్తున్న స్టాలిన్... ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వీలున్నప్పుడల్లా ప్రజలతో మాటలు కలుపుతున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా అనే విషయాన్ని స్వయంగా పరిశీలించడానికి శనివారం అకస్మాత్తుగా కాన్వాయ్‌ దిగి చెన్నైలోని కన్నగి నగర్‌ వైపు వెళ్తున్న సిటీ బస్సు ఎక్కారు. బస్సులోని ప్రయాణికులతో సీఎం స్టాలిన్ సంభాషించారు. తమిళనాడులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుచేస్తున్నారు. దీని గురించి మహిళలు ఎలా భావిస్తున్నారో స్టాలిన్‌ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. 

Also Read: తమిళనాడు సీఎం స్టాలిన్ సో స్వీట్.. మెగాస్టార్ మీట్.. పవర్ స్టార్ ట్వీట్

మహిళలకు ఉచిత ప్రయాణంపై ఆరా

చెన్నై నగరంలో వివిధ బస్సు సర్వీసుల గురించి అడిగిన సీఎం... ఫిర్యాదులు, అభిప్రాయాలు తెలుసుకున్నారు. బస్సుల్లో ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలో అడిగి తెలుసుకున్నారు. కరోనా నిబంధనల్ని పాటిస్తూ ప్రయాణాలు చేయాలని సీఎం స్టాలిన్‌ సూచించారు. సీఎంతో సెల్ఫీలు దిగేందుకు ప్రయాణికులు పోటీపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే మేనిఫెస్టోలో సిటీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, ప్రభుత్వ రంగంలోని మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు ఆరు నెలల నుంచి సంవత్సరానికి పెంచడం, ప్రసూతి సాయంగా రూ.24,000 అందించడం, మహిళలపై నేరాలను విచారించడానికి ప్రత్యేక సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీటిల్లో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నారు. బస్సులో కొంతమంది మాస్క్‌లు పెట్టుకోకపోతే వారిని మాస్క్‌లు ధరించాలని సీఎం సూచించారు. 

Also read: రాష్ట్రాల హక్కులపై ఒక్క స్టాలిన్‌కేనా బాధ? మిగతా సీఎంలు ఎందుకు స్పందించరు?

కాన్వాయ్ దిగి బస్సు ఎక్కిన సీఎం

తన సంచలన నిర్ణయాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్న తమిళనాడు సీఎం స్టాలిన్... కాసేపు ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. తమిళనాడులో టీకా పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు శనివారం ఆయన చెన్నైలోని కన్నగి ప్రాంతంలోని ఓ వ్యాక్సిన్‌ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి ఆరోగ్య సిబ్బంది, టీకా తీసుకునేవారితో మాట్లాడారు. అనంతరం తిరిగి వస్తున్న సమయంలో అటుగా వెళ్తోన్న ఓ ఆర్టీసీ బస్సును సీఎం ఆపారు తన కాన్వాయ్‌ దిగి బస్సు ఎక్కారు. సీఎం స్టాలిన్ బస్సు ఎక్కడంతో డ్రైవరు, కండక్టర్‌, ప్రయాణికులు కాసేపు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ వీడియోలు తమిళనాడు సీఎంవో కార్యాలయం ట్విటర్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. 

Also Read: బాణసంచా నిషేధ బాటలో రాష్ట్రాలు .. ఆ పని చేయవద్దని సీఎం స్టాలిన్ లేఖలు !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: tamilnadu CM Stalin cm stalin city bus travel stalin latest news tamilnadu latest news

సంబంధిత కథనాలు

Pooja Hegde New House: సొంతింటి కోసం పూజా హెగ్డే అలా ప్లాన్ చేశారు! ఇంకా ఆమె తల్లి చేసిన సాయం ఏంటంటే...

Pooja Hegde New House: సొంతింటి కోసం పూజా హెగ్డే అలా ప్లాన్ చేశారు! ఇంకా ఆమె తల్లి చేసిన సాయం ఏంటంటే...

Jagityala Crime: మంత్రాలకు ప్రాణాలు పోయాయి... చేతబడి అనుమానంతో కాలనీవాసులే దారుణం... జగిత్యాల హత్యల కేసులో కీలక విషయాలు

Jagityala Crime: మంత్రాలకు ప్రాణాలు పోయాయి... చేతబడి అనుమానంతో కాలనీవాసులే దారుణం... జగిత్యాల హత్యల కేసులో కీలక విషయాలు

Breaking News Live: నేడు గోదావరి యాజమాన్య బోర్డు కీలక సమావేశం

Breaking News Live: నేడు గోదావరి యాజమాన్య బోర్డు కీలక సమావేశం

AP PRC Issue: నేడు సమ్మె నోటీసు ఇవ్వనున్న ఉద్యోగ సంఘాలు... పీఆర్సీ జీవోలు రద్దు చేస్తేనే చర్చలకు వస్తామని ప్రకటన

AP PRC Issue: నేడు సమ్మె నోటీసు ఇవ్వనున్న ఉద్యోగ సంఘాలు... పీఆర్సీ జీవోలు రద్దు చేస్తేనే చర్చలకు వస్తామని ప్రకటన

Corona virus: ఒమిక్రాన్ వేరియంట్ కొత్త లక్షణం... చెవి లోపలి భాగంపై వైరస్ ప్రభావం, చెవినొప్పి వస్తే టెస్టు చేయించుకోవాల్సిందే

Corona virus: ఒమిక్రాన్ వేరియంట్ కొత్త లక్షణం... చెవి లోపలి భాగంపై  వైరస్ ప్రభావం, చెవినొప్పి వస్తే టెస్టు చేయించుకోవాల్సిందే
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Spirituality: సోమవారం, శనివారం గణపతిని ఇలా పూజిస్తే శనిబాధలతో పాటూ కష్టాలన్నీ తొలగిపోతాయట…

Spirituality: సోమవారం, శనివారం గణపతిని ఇలా పూజిస్తే శనిబాధలతో పాటూ కష్టాలన్నీ తొలగిపోతాయట…

Gold Silver Price Today 24 January 2022 : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు, స్థిరంగా వెండి... ప్రధాన నగరాల్లో ఇవాళ్టి ధరలు

Gold Silver Price Today 24 January 2022 : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు, స్థిరంగా వెండి... ప్రధాన నగరాల్లో ఇవాళ్టి ధరలు

Ind VS SA: పరాజయం పరిపూర్ణం... సిరీస్ వైట్ వాష్ చేసిన దక్షిణాఫ్రికా.. చాహర్ పోరాటం సరిపోలేదు!

Ind VS SA: పరాజయం పరిపూర్ణం... సిరీస్ వైట్ వాష్ చేసిన దక్షిణాఫ్రికా.. చాహర్ పోరాటం సరిపోలేదు!

Petrol-Diesel Price 24 January 2022: వాహనదారులకు స్వల్ప ఊరట.. పలు నగరాల్లో తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవీ

Petrol-Diesel Price 24 January 2022: వాహనదారులకు స్వల్ప ఊరట.. పలు నగరాల్లో తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవీ