అన్వేషించండి

Annamalai Real Name: అన్నామలైకు రజనీకాంత్ భాషాకు ఉన్నంత ఫ్లాష్ బ్యాక్ ఉంది - ఆయన అసలు పేరు శివ సెంథిల్ కుమార్ - ఇదిగో ఫుల్ స్టోరీ

Annamalai New Political Movement: తమిళనాట సరికొత్త రాజకీయ సంచలనం అన్నామలై కు చాలా ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఆయన అసలు పేరు శివ సెంథిల్ కుమార్.

Singam Annamalai IPS: తమిళనాడు రాజకీయాల్లో సంచలన నేతగా ఎదిగిన మాజీ ఐపీఎస్ అధికారి, బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై చుట్టూ ఇప్పుడు సరికొత్త రాజకీయ చర్చ నడుస్తోంది. ఇటీవల ఆయన బీజేపీకి రాజీనామా చేసి, కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు తమిళనాడులో ఎక్కడ చూసినా ఆయన పేరే వినిపిస్తోంది. దీంతో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన నిజం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమిళనాడు వ్యాప్తంగా లక్షలాది మందికి  అన్నామలై గా సుపరిచితుడైన ఈ నేత అసలు పేరు అది కాదనే విషయం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఆయన అసలు పేరు శివ సెంథిల్ కుమార్ . కరూర్ జిల్లాలో జన్మించిన ఆయన, పాఠశాల రోజుల్లోనే తన పేరును మార్చుకున్నట్లు సమాచారం. 10వ తరగతి చదువుతున్న సమయంలో  శివ సెంథిల్ కుమార్ అనే పేరు చాలా పొడవుగా ఉండటంతో, కాస్త చిన్నదిగా, అందరికీ సులువుగా గుర్తిండిపోయేలా ఉండేందుకు ఆయన  అన్నామలై గా తన పేరును మార్చుకున్నారు. శివభక్తుడైన ఆయన.. పరమశివునితో ఉన్న ఆధ్యాత్మిక అనుబంధం కారణంగానే  అన్నామలై  అనే పేరును ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ పేరు మార్పే తర్వాతి కాలంలో ఆయనకు ఒక బలమైన పర్సనల్ బ్రాండ్‌గా ఉపయోగపడింది.

విద్యాభ్యాసం విషయానికి వస్తే, అన్నామలై పీఎస్‌జీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసి, ఆపై ప్రతిష్టాత్మక ఐఐఎం లక్నో నుండి ఎంబీఏ పట్టా పొందారు. ఆ తర్వాత యూపీఎస్‌సీ  పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, 2011 బ్యాచ్‌కు చెందిన కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ అధికారిగా సేవలందించారు. కర్ణాటకలో పోలీస్ అధికారిగా ఉన్న సమయంలో ఆయన చూపించిన దూకుడు, నిక్కచ్చిగా వ్యవహరించే శైలి కారణంగా ప్రజలు ఆయనను  సింగం  సినిమాలోని దొరైసింగం పాత్రతో పోల్చేవారు. అలా ఆయనకు  సింగం అన్నామలై అనే ముద్దుపేరు వచ్చింది.

2019లో ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. అతి తక్కువ కాలంలోనే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి, ద్రావిడ రాజకీయాలు రాజ్యమేలే ఆ రాష్ట్రంలో బీజేపీకి ఒక ప్రత్యేక గుర్తింపును, విజిబిలిటీని తీసుకువచ్చారు. అయితే, పార్టీ అధిష్టానంతో వచ్చిన కొన్ని అంతర్గత విభేదాల కారణంగా ఆయన ఇటీవల బీజేపీకి గుడ్ బై చెప్పారు.  

ప్రస్తుతం, సరికొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన అన్నామలై, నాడు  శివ సెంథిల్ కుమార్  నుండి అన్నామలై గా మారినట్లే.. ఇప్పుడు సరికొత్త రాజకీయ రూపంలో తనను తాను రీ-ఇన్వెంట్   చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ద్రావిడ కోటలో ఈ మాజీ ఐపీఎస్ అధికారి వేస్తున్న కొత్త అడుగులు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
ABP Desam Top 10, 18 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 18 August 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Embed widget