Parlament Sessions : షిఫ్ట్ పద్దతిలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. త్వరలో నిర్ణయం తీసుకోనున్న సభాపతులు !
Parlament Sessions : షిఫ్ట్ పద్దతిలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. త్వరలో నిర్ణయం తీసుకోనున్న సభాపతులు !
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై మళ్లీ కరోనా ప్రభావం కనిపిస్తోంది. గత సెషన్స్‌లో కరోనా ఎలాంటి ప్రభావం చూపించలేదని అనుకునే సమయంలోనే ధర్డ్ వేవ్ విరుచుకుపడుతోంది. దీంతో ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు ఎలా నిర్వహించాలా అని ఉన్నత స్థాయి వర్గాలు తర్జనభర్జన పడుతున్నాయి. కోవిడ్ వ్యాప్తి కారణంగా ఎలాంటి చర్యలు చేపట్టాలో నిర్ణయించాలంటూ ఉభయ సభల సెక్రటరీ జనరల్స్‌కు సభాపతులు ఆదేశాలు జారీ చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాతో తొలుత ఫోన్లో మాట్లాడి అనంతరం సెక్రటరీ జనరల్‌కు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఆదేశాలిచ్చారు.
Also Read: ABP C-Voter Survey: పంజాబ్‌లో హంగ్ తప్పదా? మరి కింగ్ మేకర్ ఎవరు? తాజా ABP C-Voter సర్వే ఫలితాలివే
కోవిడ్-19 ప్రొటోకాల్ అమలుపై సమీక్ష అవసరమని లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ భావిస్తున్నారు. గత శీతాకాల సమావేశాల్లోనూ కోవిడ్-19 నిబంధనలు అమలు చేశారు.2020లో పూర్తిస్థాయి కోవిడ్-19 ప్రొటోకాల్ అనుసరించి, ఉదయం పూట రాజ్యసభ, మధ్యాహ్నం తర్వాత లోక్‌సభ నిర్వహించారు. సభా సమయంలో ఉభయ సభలు, పబ్లిక్ గ్యాలరీలో ఎంపీలను కూర్చోబెట్టి సోషల్ డిస్టెన్స్ పూర్తిగా అమలు చేశారు. 2021 బడ్జెట్ సెషన్ తొలి అర్థభాగంలోనూ ఇదే పద్ధతి అమలు చేశారు.
Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!
ఆ తర్వాత జరిగిన సెషన్లలో సాధారణ పద్ధతిలో ఏకకాలంలో ఉభయ సభలు జరిగాయి. అయితే ఆయా సభల్లో పబ్లిక్ గ్యాలరీలోనూ సభ్యులను కూర్చోబెట్టి సోషల్ డిస్టెన్స్ అమలు చేశారు. త్వరలో ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలను ఏ పద్ధతిలో నిర్వహించాలన్న అంశంపై సమీక్ష జరిపి నిర్ణయించనున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే 2020లో పూర్తిస్థాయి కోవిడ్-19 ప్రొటోకాల్ అనుసరించి, ఉదయం పూట రాజ్యసభ, మధ్యాహ్నం తర్వాత లోక్‌సభ నిర్వహించినట్లుగానే ఈ సారి అదే పద్దతిని ఫాలో అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
Also Read: ఉత్తరాఖండ్, మణిపుర్‌లో కాంగ్రెస్- భాజపా నువ్వానేనా.. గోవాలో మళ్లీ కాషాయమే!
ఇటీవల మహారాష్ట్ర్ల లో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలు ఐదు రోజు జరిగాయి. ఆ తర్వాత కనీసం యాభై మందికిపైగా ఎమ్మెల్యేలు.. పది మందికిపైగా మంత్రులు కరోనా బారిన పడ్డారు. అందుకే సారి మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు .
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి