ABP C-Voter Survey: పంజాబ్‌లో హంగ్ తప్పదా? మరి కింగ్ మేకర్ ఎవరు? తాజా ABP C-Voter సర్వే ఫలితాలివే
రానున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపెవరిది? కింగ్ మేకర్ ఎవరు? తాజా ఏబీపీ-సీఓటర్ ఫలితాలు విడుదలయ్యాయి.
![ABP C-Voter Survey: పంజాబ్‌లో హంగ్ తప్పదా? మరి కింగ్ మేకర్ ఎవరు? తాజా ABP C-Voter సర్వే ఫలితాలివే ABP C-Voter Survey punjab election 2022 Aam Aadmi Party Favourite, CM Channi-Led Congress Gets Stronger SAD Can Be Kingmaker ABP C-Voter Survey: పంజాబ్‌లో హంగ్ తప్పదా? మరి కింగ్ మేకర్ ఎవరు? తాజా ABP C-Voter సర్వే ఫలితాలివే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/10/31000154573d2e4256b8a251783158fd_original.webp?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
2022 ఫిబ్రవరి 14న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నడూ లేనట్లుగా పంజాబ్‌లో ఈసారి పార్టీల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. అంతేకాకుండా రాజకీయ సమీకరణాలు కూడా చాలా వేగంగా మారాయి.
పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ ననజోత్ సింగ్ సిద్ధూతో విభేదాల కారణంగా సీఎం పదవికి, పార్టీకి రాజీనామా చేసి కొత్త కుంపటి పెట్టుకున్నారు కెప్టెన్ అమరీందర్ సింగ్. ఈ ఎన్నికల్లో భాజపాతో కలిసి బరిలోకి దిగుతున్నారు. మరోవైపు భాజపాతో ఎన్నో ఏళ్లుగా ఉన్న మైత్రిని వదులుకుని శిరోమణి అకాలీ దళ్.. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ)తో జత కట్టింది. దీంతో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.
మరి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై ఏబీపీ- సీఓటర్ చేసిన ఓపీనియన్ పోల్‌లో ఎవరు పైచేయి సాధించారు. ఏ పార్టీకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో చూద్దాం.
ఆప్ దే..
117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్‌లో ఆమ్‌ఆద్మీ అత్యధికంగా 52-58 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉన్నట్లు సర్వేలో తేలింది. కానీ ఇది మెజారిటీ మార్కుగా ఉన్న 59 కంటే తక్కువే. తర్వాత 37-43 సీట్లు గెలుపొంది కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది.
మరోవైపు శిరోమణి అకాలీ దళ్ నేతృత్వంలోని కూటమి కింగ్‌మేకర్‌గా మారే అవకాశం ఉంది. ఈ కూటమి 17-23 స్థానాలు గెలుపొందే అవకాశం ఉన్నట్లు తాజా ఒపీనియన్ పోల్‌లో తేలింది. భాజపా 1-3 సీట్లు గెలుపొందే అవకాశం ఉంది.
ఓట్ల శాతం..
కానీ ఓట్ల శాతానికి వచ్చే సరికి కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ మధ్య తీవ్ర పోటీ ఉంది.
నవంబర్, డిసెంబర్ అంచనాలను పక్కన పెట్టి చూస్తే చన్నీ నేతృత్వంలోని కాంగ్రెస్ కాస్త పుంజుకున్నట్లు తేలింది. వివిధ పార్టీల ఓట్ల శాతం ఇలా ఉంది.
మోగిన ఎన్నికల నగారా..
దేశంలో కీలకమైన ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపుర్ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు విడతలుగా ఎన్నికలు జరపనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అన్ని రాష్ట్రాల ఎన్నికలకు కౌంటింగ్ మార్చి 10న నిర్వహించనున్నారు
Also Read: ABP C-Voter Survey: యూపీలో భాజపా హవా.. ఉత్తరాఖండ్‌లోనూ కాషాయం జోరు.. పంజాబ్‌లో మాత్రం!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)