అన్వేషించండి

Supreme Court: ఎమ్మెల్యేలు, ఎంపీల భావ ప్రకటనపై అధిక పరిమితులు విధంచలేం: సుప్రీంకోర్టు

SC on Ministers: ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల భావ ప్రకటనపై అధిక పరిమితులు విధించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. వారి వాక్ స్వాతంత్ర్యంపై ఎలాంటి అదనపు ఆంక్షలు విధించలేమని వివరించింది. 

SC on Ministers: భావ ప్రకటన స్వేచ్ఛపై భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల భావ ప్రకటనపై అదనపు పరిమితులు విధించలేమని స్పష్టం చేసింది. సమష్టి బాధ్యత సూత్రం వర్తింపజేసినప్పటికీ ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వానికి ఆపాదించలేమని చెప్పింది. ఇదే సమయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) కింద నిర్దేశించినవి మినహా.. వారి వాక్ స్వాతంత్ర్యంపై ఎలాంటి అదనపు ఆంక్షలు విధించలేమని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. ఉత్తర్ ప్రదేశ్ లో కొన్నేళ్ల క్రితం జరిగిన ఓ సామూహిక అత్యాచార కేసుపై అప్పట్లో ఆ రాష్ట్ర మంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం.. 4:1 మెజార్టీతో ఈ విధమైన తీర్పు వెలువరించింది. 

ఆరోగ్యవంతమైన భావ ప్రకటన స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి ఎంతో ముఖ్యం

పౌరుల హక్కులకు విరుద్ధంగా మంత్రి చేసిన ప్రకటనను ప్రభుత్వానికి ఆపాదించలేమని పేర్కొంటూ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం వెల్లడించింది. అయితే నేతల విద్వేష పూరిత వ్యాఖ్యలపై మార్గదర్శకాలు జారీ చేయలేమని.. ఈ సమస్యలు పార్లమెంట్ పరిష్కారం చూపాలని ధర్మాసనంలోని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. నేతలు చేసే విద్వేష పూరిత ప్రసంగాలు రాజ్యాంగంలోని సోదర భావం స్వేచ్ఛ, సమానత్వాన్ని దెబ్బతీస్తాయని వివరించారు. సమాజంలో ప్రతీ ఒక్కరి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మరొక పౌరుడిపై ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి ఆరోగ్యవంతమైన భావ ప్రకటన స్వేచ్ఛ ఎంతో ముఖ్యమని జస్టిస్ నాగరత్న తెలిపారు

మంత్రిపై కేసు నమోదు చేయాలంటూ పిటిషన్..

యూపీలోని బులంద్ షహర్ జిల్లాలో 2016 జూలై నెలలో ఓ సామూహిక అత్యాచారం కేసు నమోదు అయింది. తన భార్య, కుమార్తెపై జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన కేసును దిల్లీకి బదిలీ చేయాలంటూ యూపీకి చెందిన వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. అంతే కాకుండా ఈ ఘటనను రాజకీయ కుట్రగా పేర్కొంటూ అప్పట్లో మంత్రిగా ఉన్న ఆజమ్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, అందుకు ఆయనపై కేసు నమోదు చేయాలంటూ పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు. తొలుత దీన్ని విచారించిన త్రిసభ్య ధర్మాసనం.. 2017 అక్టోబర్ లో రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది. నవంబర్ 15వ తేదీన ఈ కేసు విచారణ పూర్తి చేసిన జస్టిస్ బి.ఆర్ గవాయి, జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యం, జస్టిస్ నాగరత్నలతో కూడి జస్టిస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తాజాగా తీర్పు వెలువరించింది. 

టాప్ హెడ్ లైన్స్

Yograj VS Kapil Dev Controversy: యోగ్‌రాజ్ పిస్టల్ వార్నింగ్ పై కపిల్ దేవ్ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్.. యువరాజ్ తండ్రి గన్ పట్టుకుని, కపిల్ ఇంటికి వచ్చి..
యోగ్‌రాజ్ పిస్టల్ వార్నింగ్ పై కపిల్ దేవ్ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్.. యువరాజ్ తండ్రి గన్ పట్టుకుని, కపిల్ ఇంటికి వచ్చి..
Breaking News:రాజధాని అమరావతి రైతు జేఏసీ కీలక నిర్ణయం- ప్రభుత్వంతో సమన్వయం కోసం ప్రత్యేక కమిటీ
రాజధాని అమరావతి రైతు జేఏసీ కీలక నిర్ణయం- ప్రభుత్వంతో సమన్వయం కోసం ప్రత్యేక కమిటీ
Mbappe VS Paraguayan Senator: ఎంబాప్పేపై పరాగ్వే మహిళా సెనేటర్ తిట్ల పురాణం.. జైల్లో పెడతానంటూ ఓపెన్ వార్నింగ్, ఫ్రెంచ్ కోచ్ మైండ్ బ్లాకింగ్ కౌంటర్!
ఎంబాప్పేపై పరాగ్వే మహిళా సెనేటర్ తిట్ల పురాణం.. జైల్లో పెడతానంటూ ఓపెన్ వార్నింగ్, ఫ్రెంచ్ కోచ్ మైండ్ బ్లాకింగ్ కౌంటర్!
US Iran War: చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha vs Kadiam Srihari: కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Telangana Crime News: నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
US Iran War: చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
Truck Slogan: ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
Embed widget