అన్వేషించండి

SC On CBI: బెంగాల్‌ ఎన్నికల అనంతర కేసులు పక్క రాష్ట్రాలకు బదిలీ చేయాలన్న సీబీఐ, తీవ్రంగా మండి పడ్డ సుప్రీంకోర్టు

SC raps CBI : బెంగాల్‌లోని ఎన్నికల అనంతర కేసులు పక్క రాష్ట్రాలకు బదిలీ చేయాలన్న సీబీఐ అభ్యర్థనపై సుప్రీం కోర్టు తీవ్రంగా మండిపడింది. దెబ్బకు సీబీఐ తన వ్యాజ్యాన్ని వెనక్కి తీసుకుంది.

SC raps CBI on Over Bengal Post-Poll Violence Plea : సుప్రీం కోర్టు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పై మండి పడింది. పశ్చిమ బెంగాల్‌లో 2021 ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసుల విచారణ సందర్భంగా సీబీఐ పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ అల్లర్ల కేసులు వెస్ట్ బెంగాల్ వెలుపల ఏదైనా రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ సీబీఐ వ్యాజ్యం దాఖలు చేయగా.. దానిపై ఇవాళ విచారణ చేపట్టిన న్యాయ స్థానం న్యాయ వ్యవస్థ పట్ల సీబీఐ వైఖరిపై అసహనం వ్యక్తం చేసింది.

న్యాయవ్యవస్థ  రెప్యుటేషన్ దెబ్బ తీసేలా సీబీఐ ఎలా వ్యవహరించగలరని నిలదీత.. ?

            సీబీఐ దాఖలు చేసిన వ్యాజ్యంపై జ,స్టిస్ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో సీబీఐ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్‌ వీ రాజు వాదనలు ప్రారంభించారు.  2021 నాటి ఎన్నికల అనంతర హింసకు సంబంధించి దాఖలైన కేసుల విచారణను పక్క రాష్ట్రాలకు బదిలీ చేయాలని ఆయన కోరారు. అయితే.. ఏ విధమైన ఆధారాలతో జ్యుడిషియరీ పనితీరును దెబ్బతీసేలా మీరు మాట్లాడ గలుగుతున్నారంటూ సుప్రీం ధర్మాసనం మండిపడింది. మొత్తం జ్యుడీషియరీ ప్రతిష్ఠను మంట గలిపేలా మీరు ఆరోపణలు ఎలా చేస్తున్నారని నిలదీసింది. ఒక రాష్ట్రంలోని జ్యుడీషియరీలో ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు తప్పు చేసి ఉండొచ్చని.. అంత మాత్రాన మొత్తం జ్యుడీషియరీనే ఎలా నిందించగలరని సీబీఐని కోర్టు ప్రశ్నించింది.

జడ్జిలు, సివిల్‌ జడ్జెస్‌, సెషన్స్ జడ్జ్‌లు ఇక్కడి వరకూ  వచ్చి తమ ప్రతిష్ఠను భంగం కలిగించేలా మీరు చేస్తున్న ఆరోపణలను వారు ఎదుర్కోలేక పోవచ్చు కానీ.. తాము చూస్తూ ఊరుకోబోమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తమకు జ్యుడీషియరీ ప్రతిష్ఠకు భంగం కలిగేలా చేయాలన్నది తమ విధానం కాదని.. ఇది లూజ్ డ్రాఫ్టింగ్‌ మాత్రమేనని ఎస్‌వీ రాజు కోర్టుకు తెలిపారు. కోర్టు అసహనాన్ని అర్థం చేసుకున్న రాజు. తన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని ప్రతి కోర్టుపై స్కాండిల్స్‌కు సంబంధించిన ఆరోపణలు చాలా సాదారణంగా చేశారంటూ.. సుప్రీం కోర్టు తన ఆర్డర్లులో పొందు పరిచింది. ఇలాంటి ఆరోపణలు రిపీటెడ్‌గా చేస్తుండడం వల్ల కోర్టులు తమ పనిని తాము చేయలేక పోతున్నాయని టాప్‌ కోర్టు అభిప్రాయ పడింది. సీబీఐ కూడా ఇలాంటి ఆరోపణలే వెస్ట్ బెంగాల్‌ కోర్టులపై చేయడం దురదృష్ట కరమని వ్యాఖ్యానించింది. అయితే కోర్టు వ్యాఖ్యలపై స్పందించిన అదనపు సొలిసిటర్ జనరల్‌ ఎస్‌ వీ రాజు.. తనకు కోర్టుకు దురుద్దేశాలు ఆపాదించే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు.

తాము ఈ పిల్‌ను విత్‌ డ్రా చేసుకునేకేందుకు అవకాశం కల్పించాలని కోర్టును కోరగా.. అందుకు ధర్మాసనం అనుమతించింది. 2021 ఎన్నికల అనంతరం జరిగిన హింసపై సీబీఐ దర్యాప్తు చేపట్టగా.. 2023లో ఈ కేసులన్నీ పక్క రాష్ట్రానికి బదిలీ చేయాలని.. వెస్ట్ బెంగాల్‌లో సాక్షులకు బెదిరింపులు ఎక్కువ అయ్యాయని.. పక్క రాష్ట్రంలో ఐతే న్యాయం జరిగే అవకాశం ఉందని సుప్రీంలో పిల్‌ దాఖలు చేయగా.. దానిపై శుక్రవారం విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget