అన్వేషించండి

SC on Two Finger Test: అత్యాచార కేసుల్లో "టూ ఫింగర్ టెస్ట్‌"పై సుప్రీం బ్యాన్!

SC on Two Finger Test: అత్యాచార కేసుల్లో"టూ- ఫింగర్ టెస్ట్‌" నిర్వహించడాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. ఈ పరీక్షపై బ్యాన్ విధించింది.

SC on Two Finger Test: అత్యాచారం కేసులను నిర్ధరించడానికి చేసే "టూ-ఫింగర్ టెస్ట్"పై సుప్రీం కోర్టు సోమవారం బ్యాన్ విధించింది. అలాంటి పరీక్షలు నిర్వహించే వారిని దుష్ప్రవర్తన కింద నేరంగా పరిగణించాలని సుప్రీం వ్యాఖ్యానించింది. ఈ పరీక్షపై నిషేధం అమలయ్యేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.

ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం.. "రెండు వేళ్ల టెస్ట్" నేటికీ నిర్వహించటం విచారకమని పేర్కొంది. ఓ అత్యాచార కేసు విచారణలో భాగంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

" సమాజంలో ఇప్పటికీ ఈ "టూ- ఫింగర్ టెస్ట్" కొనసాగుతుండటం దురదృష్టకరం. ఇది మహిళల గోప్యత, గౌరవమర్యాదలకు భంగం కలిగిస్తుంది. ఈ పరీక్షను తక్షణమే నిషేధించాలి. ఇలాంటి పరీక్షలు ఎవరు చేసినా దుష్ప్రవర్తన నేరం కింద పరిగణించాలి. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కళాశాలల పాఠ్యాంశాల నుంచి 'రెండు వేళ్ల పరీక్ష'కు సంబంధించిన అంశాలను తొలగించాలి.                                                              "
-     సుప్రీం ధర్మాసనం

మళ్లీ బాధించడమే

అత్యాచార కేసుల్లో మహిళలకు ఈ పరీక్ష నిర్వహించడం వల్ల వారిని మరోసారి బాధించడమే అవుతుందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.

" అత్యాచారం, లైంగిక వేధింపుల కేసుల్లో "టూ- ఫింగర్ టెస్ట్"ను నిలిపివేయాలని కోర్టు పదే పదే చెప్పింది. ఈ పరీక్షకు శాస్త్రీయ ఆధారం లేదు. అంతేకాకుండా ఇది మహిళలను తిరిగి బాధితురాలిని చేస్తుంది, మళ్లీ గాయపరుస్తుంది. ఈ పరీక్ష చేయకూడదు. లైంగికంగా చురుగ్గా ఉండే మహిళలపై అత్యాచారం జరగదనే తప్పుడు ఊహ ఆధారంగా ఈ పరీక్ష నిర్వహించేవారు. కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదు.                                          "
- సుప్రీం ధర్మాసనం

ఇదీ కేసు

హత్యాచారం కేసులో భాగంగా ఓ నిందితుడిని దోషిగా తేల్చుతూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం సమర్థించింది. ట్రయల్ కోర్టు తీర్పును తప్పుబట్టిన ఝార్ఖండ్ హైకోర్టు నిర్ణయాన్ని తోసిపుచ్చింది.  ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది.

Also Read: Morbi Bridge Collapse: తీవ్ర విషాదం- భాజపా ఎంపీ కుటుంబంలో 12 మంది మృతి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

వీడియోలు

BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam
History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
Embed widget