Spicejet Flight: స్పైస్‌జెట్ విమానానికి గాల్లోనే మంటలు, అత్యవసర ల్యాండింగ్-ప్రయాణికులు సేఫ్
స్పైస్‌జెట్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. గాల్లోనే మంటలు అంటుకోవటం వల్ల అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.
పక్షి అడ్డురావటం వల్లే ప్రమాదమా..?
స్పైస్‌జెట్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. పట్నాలోని బిహ్‌తా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ వద్ద అత్యవసరంగా ల్యాండ్ అయింది. దిల్లీ వెళ్లాల్సిన స్పైస్ జెట్ ఫ్లైట్ పట్నాలో 12.10 గంటలకు టేకాఫ్ అయింది. అయితే గాల్లోకి వెళ్లిన కొద్ది సేపటికే ఎడమ వైపు రెక్కకి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఇది పైలట్ గమనించలేదు. పుల్వరి షరీఫ్ ప్రాంత ప్రజలు చూసి వెంటనే ఎయిర్‌పోర్ట్ అధికారులకు కాల్ చేశారు. అప్పటికే ఫైర్ ఎక్స్‌టింగ్విషర్‌లు ఆన్ కావటం వల్ల పైలట్ అప్రమత్తమయ్యాడు. అప్పటికప్పుడు మళ్లీ విమానాన్ని వెనక్కి మళ్లించి ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ప్రమాద సమయంలో విమానంలో 185 మంది ప్రయాణికులున్నారు. వీరంతా సురక్షితంగా ఉన్నారని ఎయిర్‌పోర్ట్ అధికారులు వెల్లడించారు. మంటలు భారీగా రాకపోవటం వల్లే ప్రమాదం తప్పిందని చెప్పారు. ఎడమవైపు ఉన్న ఇంజిన్‌లో రెండు బ్లేడ్‌లు వంగిపోయాయని, అక్కడి నుంచి మంటలు అంటుకున్నాయని తెలిపారు. పక్షి అడ్డురావటం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదం జరిగిన విమానాన్ని బోయింగ్ 727గా నిర్ధరించారు.
మరీ ఇంత నిర్లక్ష్యమా: ప్రయాణికుల ఆగ్రహం
విమానంలోని లైట్స్ ఒక్కసారిగా బ్లింక్ అయ్యాయని, ఏదో ప్రమాదం జరగనుందని ముందుగానే ఊహించామని చెబుతున్నారు ప్రయాణికులు. స్పైస్‌జెట్ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని మండి పడుతున్నారు. అధికారులు చెబుతున్న దాని ప్రకారం చూస్తే విమానం నార్మల్ ఫ్లైయింగ్ ఆల్టిట్యూడ్‌ని చేరుకునేందుకు చాలా ఇబ్బంది పడింది. ఆ ఎత్తుకు చేరుకునేందుకు గాల్లోనే దాదాపు 25 నిముషాలు ఉండిపోయింది. అయితే ఈ విషయంలో స్పైస్‌జెట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. విమానం ల్యాండ్ అయిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రయాణికులను సురక్షితంగా విమానంలో నుంచి బయటకు తీసుకొచ్చారు. శివసేన నేత ప్రియాంక చతుర్వేది ఈ ఘటనపై స్పందించారు. ప్రయాణికుల ప్రాణాలతో ఆడుకుంటున్నారంటూ ట్విటర్ వేదికగా విమర్శించారు.
#WATCH Delhi bound SpiceJet flight returns to Patna airport after reporting technical glitch which prompted fire in the aircraft; All passengers safely rescued pic.twitter.com/Vvsvq5yeVJ
— ANI (@ANI) June 19, 2022
This is playing with the lives of passengers. Repeatedly been raising this with the minister, with the aviation secretary. Don’t know when they will rise to the occasion and avoid a major mishap waiting to happen. https://t.co/xb896Y0ARU
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) June 19, 2022
Also Read: Fathers Day: గొప్ప కొడుకుగా, గర్వించే తండ్రిగా-మెగాస్టార్ ఫాదర్స్ డే ట్వీట్ వైరల్
Also Read: Delhi News: డిన్నర్ పెట్టలేదని దిండుతో చంపేశాడు, డెడ్‌బాడీ పక్కనే నిద్రపోయాడు