Shraddha Murder Case: శ్రద్ధా హత్య కేసు నిందితుడికి కస్టడీ పొడిగింపు- నార్కో టెస్ట్‌కు అనుమతి
Shraddha Murder Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్‌కు కస్టడీ పొడిగించింది కోర్టు.
Shraddha Murder Case: శ్రద్ధా వాల్కర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ పూనావాలాకు పోలీసు కస్టడీని పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఐదు రోజుల పాటు అఫ్తాబ్ కస్టడీని పొడిగించింది. అంతేకాకుండా నిందితుడికి నార్కో అనాలిసిస్ టెస్ట్ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. నిందితుడు అఫ్తాబ్ కూడా పరీక్షకు సమ్మతి తెలిపాడు.
Shraddha murder case | Police submitted in the court that the accused Aftab is to be taken to Uttrakhand and Himachal Pradesh for investigation. The court also allowed the police application seeking permission for the Narco analysis test of accused Aftab.
— ANI (@ANI) November 17, 2022
తనతో సహజీవనం చేసిన శ్రద్ధాను అత్యంత కిరాతకంగా హత్య చేసిన పూనావాలాను గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు పోలీసులు హాజరుపరిచారు.
ఇదీ కేసు
అఫ్తాబ్, శ్రద్ధ.. ముంబయిలోని ఓ కాల్ సెంటర్‌లో పనిచేశారు. అక్కడ వారు మొదట కలుసుకున్నారు. తరువాత డేటింగ్ ప్రారంభించారు. ఆమె కుటుంబం వారి సంబంధాన్ని ఆమోదించకపోవడంతో ఈ జంట దిల్లీకి పారిపోయి లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో జీవిస్తున్నారు.అయితే శ్రద్ధా తల్లిదండ్రులు మాత్రం.. ఆమె సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా తమ కుమార్తె యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు.
కానీ చాలా కాలంగా ఆమె సోషల్ మీడియా ఖాతాలో ఎటువంటి అప్‌డేట్ రాకపోవడంతో శ్రద్ధ తండ్రి దిల్లీకి వచ్చారు. తన కూతురు వివరాలు తెలియకపోవడంతో ఆమె తండ్రి దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అఫ్తాబ్‌పై అనుమానం
తన కుమార్తె ముంబయిలోని కాల్ సెంటర్‌లో పనిచేసేదని, అక్కడ అఫ్తాబ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిందని, వారి స్నేహం సన్నిహితంగా మారిందని శ్రద్ధ తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడటం ప్రారంభించారని, అయితే కుటుంబం దానిని అంగీకరించలేదని శ్రద్ధా తండ్రి ఆరోపించారు. దీంతో అతని కూతురు, అఫ్తాబ్ ముంబయి వదిలి దిల్లీకి వచ్చి ఇక్కడి ఛతర్‌పుర్ ప్రాంతంలో ఉంటున్నట్లు తెలిపారు. ఆయన ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిఘా ద్వారా అఫ్తాబ్‌ను పట్టుకున్నారు.
అఫ్తాబ్‌ను ప్రశ్నించగా, అమ్మాయి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోందని, దీని వల్ల వారి మధ్య తరచూ గొడవలు జరగినట్లు తెలిపాడు. మే నెలలో శ్రద్ధాను దారుణంగా చంపి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి.. నగరంలోని పలు ప్రాంతాల్లో పారేసినట్లు ఒప్పుకున్నాడు.
దర్యాప్తులో
అఫ్తాబ్ అమీన్ పూనావాలా (Aftab) గురించి రోజుకో సంచలన విషయం బయటపడుతోంది. 28 ఏళ్ల యువకుడు ఇంత కిరాతకంగా హత్య చేసి, దీని నుంచి తప్పించుకునేందుకు చేసిన పనులు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అయితే ఆ యువకుడు 'డెక్స్‌టర్' (Web Series Dexter) అనే డ్రామా వెబ్ సిరీస్ ద్వారా 'స్పూర్తి' పొందాడని దర్యాప్తులో తేలింది.
Also Read: Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో బాలీవుడ్ బ్యూటీ- రాహుల్‌తో అడుగులేసిన రియా సేన్