Sanjay Raut On Governor Koshyari: గుజరాతీలు లేకపోతే దమ్మిడి ఆదాయం ఉండదు, మహారాష్ట్ర గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు
Sanjay Raut On Governor Koshyari: గుజరాతీలు, రాజస్థానీలను మహారాష్ట్ర నుంచి తీసేస్తే, రాష్ట్రానికి ఆదాయమే ఉండదని గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మరాఠీల గౌరవానికి భంగం కలిగించారు : సంజయ్ రౌత్
దాదాపు నెల రోజులుగా మహారాష్ట్ర రాజకీయాలు హాట్ టాపిక్ అయ్యాయి. రోజూ శివసేన, ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఈ వివాదం కొనసాగుతుండగానే, మరోటి తెరపైకి వచ్చింది. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొషియారి చేసిన కామెంట్స్ సంచలనమయ్యాయి. మహారాష్ట్ర నుంచి గుజరాతీలు, రాజస్థానీలను తీసేస్తే రాష్ట్రానికి రెవెన్యూనే ఉండదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముంబయి, థానే నుంచి వారిని వేరు చేయలేమని, వారు అక్కడి నుంచి వెళ్లిపోతే రాష్ట్రానికి ఆదాయమే ఉండదన్న ఉద్దేశంతో ఈ కామెంట్స్ చేశారు. అంతే కాదు. ఇదే జరిగితే... ముంబయి దేశ ఆర్థిక రాజధానిగానూ కొనసాగలేదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఠాక్రే శివసేన తీవ్రంగా మండిపడుతోంది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ గవర్నర్‌పై ఆగ్రహించారు. "మరాఠీలను అవమానించారు" అంటూ ట్విటర్ వేదికగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిజానికి ఎన్నో ఏళ్లుగా...మహారాష్ట్రలో మరాఠీలకు, గుజరాతీలకు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి వాతావరణం ఉన్న రాష్ట్రంలో గవర్నర్ అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంపై సంజయ్ రౌత్ తీవ్ర అసహనానికి గురయ్యారు. ఆయన చేసిన కామెంట్స్‌ను వెంటనే ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే ఖండించాలని డిమాండ్ చేశారు. "మరాఠీల గౌరవానికి భంగం కలిగించారు" అని ట్విటర్‌లో గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. భాజపాకు చెందిన ముఖ్యమంత్రి రాగానే...మరాఠీలకు అవమానం జరిగిందని అన్నారు సంజయ్ రౌత్. కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరాం రమేశ్, సచిన్ సావంత్ కూడా ఈ వివాదంపై స్పందించారు. గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది అని అన్నారు.
#WATCH | If Gujaratis and Rajasthanis are removed from Maharashtra, especially Mumbai and Thane, no money would be left here. Mumbai would not be able to remain the financial capital of the country: Maharashtra Governor Bhagat Singh Koshyari pic.twitter.com/l3SlOFMc0v
— ANI (@ANI) July 30, 2022
This is an insult to the hard work of the people of Maharashtra and Marathi Manoos who have toiled day in and day out to make the state the leading state of the country. The Governor should apologise immediately,failing which,we will demand to replace him. pic.twitter.com/3D8pM5EIIH
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) July 30, 2022
महाराष्ट्रात भाजपा पुरस्कृत मुख्यमंत्री होताच मराठी माणूस आणि शिवरायांचा अपमान सुरू झाला..स्वाभिमान अभिमान यावर बाहेर पडलेला गट हे ऐकूनही गप्प बसणार असेल तर शिवसेनेचे नाव घेऊ नका..मुख्यमंत्री शिंदे..राज्यपालांचा साधा निषेध तरी करा.मराठी कष्टकरी जनतेचा हा अपमान आहे..
— Sanjay Raut (@rautsanjay61) July 30, 2022
ऐका .. ऐका... pic.twitter.com/dOvC2B0CFu
Also Read: Rashtrapatni row: రాష్ట్రపతి హోదాకు జెండర్‌కు సంబంధం లేదా? అప్పట్లో నెహ్రూ ఏం చెప్పారు?
Also Read: Nandamuri Kalyan Ram : ఫ్యాట్ టు ఫిట్, 88 నుంచి 75 కేజీల వరకూ - నందమూరి కళ్యాణ్ రామ్ కష్టం అంతా ఇంతా కాదు