NEET UG : సమోసాలమ్ముకుంటూనే చదివాడు - డాక్టరైపోతున్నాడు - కల నెరవేర్చుకుంటున్న 18 ఏళ్ల సన్నీకుమార్
Medical : నీట్ యూజీలో ర్యాంక్ తెచ్చుకుని మెడిసిన్ లో చేరిపోవాలని చాలా మంది కోరిక. కానీ రోజంతా కష్టపడినా అది కొంత మందికి అందదు.కానీ నోయిడా కు చెందిన సన్నీకుమార్ ది వేరే స్టోరీ.
Noida samosa seller cracks NEET UG at the age of 18 : నీట్ యూజీ ఎంట్రన్స్‌లో 720 మార్కులకు గాను 664 తెచ్చుకున్నారు సన్నీకుమార్. ఆ కుర్రాడి వయసు పద్దెనిమిదేళ్లు. దేశంలోనే అత్యంత క్లిష్టమైన ఎగ్జామ్ లో ఇంత మంచి మార్కులు తెచ్చుకుని మెడిసిన్ లో చేరిపోవడానికి రెడీ అయిపోయిన సన్నీకుమార్ ఎలా చదివారో తెలుసుకునేందుకు చాలా మంది అతని అడ్రస్ కోసం ప్రయత్నించారు. అతి కష్టం మీద తెలుసుకున్నారు. తీరా వెళ్లేసరికి ఆయన ఓ సమోసా స్టాల్ వద్ద ఉన్నారు. నోయిడాలో రోడ్ పక్కన ఉన్న ఓ సమోసా బండి దగ్గర సమోసాలు అమ్ముతున్నారు. ఆ సన్నీకమార్ ని చూసి వచ్చిన వారంతా ఆశ్చర్యపోయారు.
ఇరవై ఏళ్లకే బిలియనీర్లయిపోయారు - తాత, ముత్తాతల ఆస్తితో కాదు - Zepto ఫౌండర్ల కథ ఇదే
తాను సమోసా స్టాల్ ను నడుపుతూనే చదువుకుంటున్నానని.. నీట్ యూజీ ఎగ్జామ్ ను కూడా ఎక్కడా కోచింగ్ తీసుకోకుండా.. ఈ స్టాల్ నడుపుకుంటూనే చదువుకుని ఎగ్జామ్ రాశనని చెప్పడంతో వారందరికి ఇన్ స్పైరింగ్ గా అనిపించింది. ప్రతీ రోజూ కాలేజీకి వెళ్తతాడు..సాయంత్రం నాలగైదు గంటలు మాత్రం సమోసా స్టాల్ కోసం కేటాయిస్తాడు.చిన్న చిన్న మందులు పెద్ద పెద్ద వ్యాధుల్ని ఎలా నయం చేస్తాయన్నదాన్ని తెలుసుకోవాలన్న ఉద్దేశంతో సన్నీ కుమార్ బయాలజీని ఎంచుకుని చదివారు. తర్వాత నీట్ కు ప్రిపేర్ అయ్యారు.
సన్నీకుమార్ రూమ్ కూడా సోషల్ మీడియాలో వరైల్ అయింది. ఆయన రూమ్ నిండా నోట్స్‌కు సంబంధించిన పేపర్ కటింగ్‌లే ఉన్నాయి. గోడల నిండా అంటించి ఉన్నాయి. అంటే..ఎంత హార్డ్ వర్క్ తో సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. సన్నీ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని మెడిసిన్ కాలేజీ ఫీజులు కట్టడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. ఫిజిక్స్ వాలా ఆన్ లైన్ ఎడ్యూకేషన్ పోర్టల్ యజమాని.. సన్నీకుమార్ రూముకు వచ్చాడు. ఆరు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు.
ట్రంప్ ఓడిపోవాలని అమెరికన్లు కోరుకుంటున్నారు, ఫస్ట్ ఇంటర్వ్యూలో కమలా హారిస్
నిరుపే ద కుటుంబంలో పుట్టినప్పటికీ చదువులో మొదటి నుంచి ముందున్న సన్నీకుమార్.. నీట్ ఎగ్జామ్ కష్టం అని ఎప్పుడూ నిరాశపడలేదు. దేశవ్యాప్తంగా ఇరవై రెండు లక్షల మందికిపైగా మెడిసిన్ లో ప్రవేశానికి పరీక్ష రాసినా ఆయన మాత్రం తనదైన ముద్ర వేశారు. సన్నీకుమార్ స్టోరీ చాలా మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. కోచింగ్ లేకుండా సొంతంగా నోట్స్ తయారు చేసుకుని.. సాయంత్రం నాలుగైదు గంటలు సమోసా స్టాల్ నడుపుకుని మరీ సాధించారు. భవిష్యత్ లో మంచి వైద్యుడిగా పేరు తెచ్చుకోవాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.