SCO Summit 2022: భారత్‌లో 100కు పైగా యూనికార్న్‌లు, 70 వేల స్టార్టప్‌లు: మోదీ
SCO Summit 2022: షాంఘై సహకార సంస్థ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
SCO Summit 2022: ఉజ్బెకిస్థాన్‌లోని సమర్ఖండ్ వేదికగా జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రసంగించారు. ప్రపంచంలో షాంఘై సహకార సంఘం పాత్ర ప్రాధాన్యం పెరుగుతోందని మోదీ అన్నారు. దేశాల మధ్య సహకారం మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌ను గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామన్నారు.
At the SCO Summit in Samarkand, emphasised on the constructive role SCO can play in the post-COVID era particularly in furthering economic recovery and strengthening supply chains. Highlighted India’s emphasis on people-centric growth which also gives importance to technology. pic.twitter.com/kwF5bDESkR
— Narendra Modi (@narendramodi) September 16, 2022
ఫేస్ టూ ఫేస్
తూర్పు లద్దాఖ్‌లో భారత్-చైనా మధ్య ప్రతిష్టంభన ఏర్పడిన తర్వాత చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ప్రధాని మోదీ కలుసుకోవడం ఇదే మొదటిసారి. అయితే వీరిద్దరి మధ్య ద్వైపాక్షిక సమావేశం జరుగుతుందా? లేదా అనే విషయంపై స్పష్టత లేదు. మరోవైపు వచ్చే ఏడాది షాంఘై సహకార సంస్థ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్‌ను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అభినందించారు. తాము సదస్సు విషయంలో పూర్తి మద్దతు ఇస్తామన్నారు.
ద్వైపాక్షిక చర్చలు
SCO శిఖరాగ్ర సదస్సులో భాగంగా టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. విభిన్న రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇరువురు నేతలు చర్చించినట్లు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది.
Also Read: Viral Video: మాజీ సీఎంను కొండెక్కించిన ఏనుగు- ప్రాణ భయంతో పరుగో పరుగు!
Also Read: Bharat Jodo Yatra: వ్యాపారిపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి- జోడో యాత్రకు డబ్బులు ఇవ్వలేదని!