అన్వేషించండి

12 th August 2024 News Headlines: ముగిసిన విశ్వ క్రీడా సంబరం, తుంగభద్ర డ్యాం కు పొంచి ఉన్న ముప్పు వంటి మార్నింగ్ టాప్ న్యూస్‌

12th August 2024 School News Headlines Today: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తాజా వార్తల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఇది మీ స్కూల్ అసెంబ్లీలో చదవడానికి పనికొస్తాయి.

12 th August 2024 School News Headlines Today: 

నేటి ప్రత్యేకత:
ప్రపంచ ఏనుగుల దినోత్సవం
అంతర్జాతీయ యువ దినోత్సవం
జాతీయ గ్రంథాలయ దినోత్సవం (లైబ్రరీ డే)
 
ఒలింపిక్స్‌
పారిస్‌ ఒలింపిక్స్‌ క్రీడలకు తెరపడింది. జూలై 25న  సీన్‌ నదిలో ఆరంభమైన ఈ విశ్వ క్రీడలు ఆగస్టు 11న ముగిశాయి. పతకాల పట్టికలో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది, భారత్‌ ఆరు పతకాలతో వెనుదిరిగింది. 2028 లాస్‌ ఏంజెల్స్‌లో అమెరికా విశ్వక్రీడలకు ఆతిథ్యమివ్వనుంది. 
 
ఒలింపిక్స్‌లో అమెరికాకు చైనా గట్టిపోటీ ఇచ్చింది. అమెరికాతో ఢీ అంటే ఢీ అంటున్న చైనా ఒలింపిక్స్‌లోనూ ఆ దేశానికి పోటీనిచ్చింది. అమెరికా, చైనా చెరో 40 స్వర్ణాలతో అగ్రస్థానాల్లో నిలిచాయి. అయితే మొత్తంగా అమెరికాకు 126 పతకాలు రాగా చైనా 91 పతకాలే వచ్చాయి.
 
ఆంధ్రప్రదేశ్‌ వార్తలు
లక్షల ఎకరాలకు సాగునీటిని, వేల గ్రామాలకు తాగునీటిని అందిస్తున్న తుంగభద్ర డ్యాం 19వ నంబరు గేటు కొట్టుకుపోయింది. వరద ఉద్ధృతికి గేటు కొట్టుకుపోయింది. దీంతో 60 టీఎంసీల నీరు వృథాగా పోతోంది. అయిదు నంబర్ల గేట్లు ఎత్తి 30 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. 
 
జగన్‌ ప్రభుత్వ హయాంలో విలీనం చేసిన 3, 4, 5 తరగతులను వెనక్కి తేవాలని ఉపాధ్యాయులు ఏపీ సర్కార్‌ను కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంతోపాటు తెలుగు మాధ్యమాన్నీ కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. రేషనలైజేషన్‌ జీవో-117ను రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు చేశారు.
 
తెలంగాణ వార్తలు:
జేఎన్‌టీయూ హైదరాబాద్‌ క్యాంపస్‌తోపాటు తెలంగాణలోని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం భారీగా పడిపోతోంది. ఈ ఏడాది జనవరిలో ఇంజనీరింగ్‌ తొలి సెమిస్టర్‌ రాసిన 17,063 మంది విద్యార్థుల్లో 7,380 మంది మాత్రమే అన్ని సబ్జెక్టులు పాసయ్యారు. 57% మంది ఫెయిలయ్యారు. బోధనా సిబ్బంది తగ్గడం, ఆచార్యులు లేకపోవడం ఉత్తీర్ణతా శాతంపై ప్రభావం చూపుతోంది. తొలి సెమిస్టర్‌లో 9,677 మంది ఫెయిల్‌ కావడం ఇదే తొలిసారి.
 
తెలంగాణలో ఈ రెండు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే హైదరబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం నేపథ్యంలో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని GHMC అధికారులు సూచిస్తున్నారు. 
 
జాతీయ వార్తలు
దేశవ్యాప్తంగా నేడు అన్ని ఆస్పత్రుల్లో ఎంపిక చేసిన సేవలను నిలిపేస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది. అత్యవసర సేవలను మినహాయిస్తున్నట్లు వెల్లడించింది. కోల్‌కతాలో ఈనెల 9న చోటుచేసుకున్న జూనియర్ వైద్యురాలి హత్య ఘటనను నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
రైతుల ఆదాయాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రధాని మోదీ 109 రకాల నూతన వంగడాలను విడుదల చేశారు. ఈ వంగడాలను భారత వ్యవసాయ పరిశోధన మండలి అభివృద్ధి చేసింది. 61 పంటలకు చెందిన 109 వంగడాలు విడుదల చేశారు.
 
అంతర్జాతీయ వార్తలు
నార్త్‌ కరోలినా స్టేట్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు ఎలక్ట్రిక్‌ బ్యాండేజ్‌’ని తయారుచేశారు. తీవ్ర గాయాలను సైతం ఈ బ్యాండేజ్‌లు నయం చేయగలదు. మాములు బ్యాండేజ్‌లతో పోల్చితే 30 శాతం వేగంగా ఈ ఎలక్ర్టిక్‌ బ్యాండేజీలు గాయాలను మాన్చగలవని శాస్త్రవేత్తలు తెలిపారు.
 
మంచిమాట
కెరటం నాకు ఆదర్శం.. పడినందుకు కాదు.. పడినా లేచినందుకు
- స్వామి వివేకానంద
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget