అన్వేషించండి
Advertisement
29th July 2024 News Headlines: జులై 29న మీ స్కూల్ అసెంబ్లీలో చదవదగ్గ న్యూస్ హెడ్‌లైన్స్ ఇక్కడ చూసుకోవచ్చు
29th July School News Headlines Today: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తాజా వార్తల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఇది మీ స్కూల్ అసెంబ్లీలో చదవడానికి పనికొస్తాయి
నేటి ప్రత్యేకత:
ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం
అంతర్జాతీయ పులుల దినోత్సవం
ఒలింపిక్స్
ఒలింపిక్స్‌లో భారత స్టార్ షూటర్ మను బాకర్ చరిత్ర సృష్టించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్య పతకం సొంతం చేసుకుంది. విశ్వ క్రీడల్లో పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్‌గా మను రికార్డు సృష్టించింది.
ఒలింపిక్స్‌లో తెలుగు తేజాలు సత్తా చాటారు, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, బాక్సర్ నిఖత్ జరీన్, టేబుల్ టెన్నీస్‌లో ఆకుల శ్రీజ తదుపరి మ్యాచ్‌కు అర్హత సాధించి సత్తా చాటారు. వీరు ముగ్గురు ఏకపక్ష విజయాలు సాధించారు.
ఆంధ్రప్రదేశ్ వార్తలు
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలానికి భారీగా వరద పోటెత్తుతోంది. జురాల నుంచి 3 లక్షల క్యూసెక్కులు, సుంకేశల నుంచి 1.40 క్యూసెక్కుల వరద శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. దీంతో గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి రంగం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై సమీక్ష చేయనున్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీపై నెలకు 250 కోట్ల రూపాయల బారం పడుతుందని అంచనా వేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరు ప్రభుత్వ పథకాల పేర్లు మార్చింది. విద్యాకానుకను సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా, అమ్మఒడిని తల్లికి వందనంగా, గోరుముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా నాడు నేడు పథకాన్ని మన బడి మన భవిష్యత్గా, స్వేచ్‌ఛను బాలికా రక్షగా, జగనన్న ఆణిముత్యాలను అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా మార్చారు.
తెలంగాణ వార్తలు
తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. జిష్ణుదేవ్ త్రిపుర ముఖ్యమంత్రిగా పనిచేశారు. జిష్ణుదేవ్ త్రిపుర రాజకుటుంబానికి చెందిన వ్యక్తి. 1990లో భారతీయ జనతా పార్టీలో చేరారు.
రైతు రుణమాఫీ కింద ఇప్పటికే రూ.6,093 కోట్లు మంజూరు చేశామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. రూ.1.50 లక్షల వరకు ఉన్న రైతుల రుణాలను జులై 31కి ముందే మాఫీ చేస్తామని వెల్లడించారు. ఆగస్టు 2 నుంచి 14 వరకు విదేశాల్లో పర్యటించనున్నానని.. తిరిగి రాగానే రూ.2 లక్షల రుణమాఫీ కూడా చేసి రైతుల రుణం తీర్చుకుంటానని రేవంత్ తెలిపారు.
జాతీయ వార్తలు
పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు వచ్చారు. అస్సాం గవర్నర్‌గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య... పంజాబ్ గవర్నర్‌గా గులాబ్ చంద్ కటారియా, మహారాష్ట్ర గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్, జార్ఖండ్ గవర్నర్‌గా సంతోష్ కుమార్ గంగ్వార్, రాజస్థాన్ గవర్నర్‌గా హరిభౌ కిసన్‌రావ్ బాగ్డే, సిక్కిం గవర్నర్‌గా ఓం ప్రకాష్ మాథుర్, ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా విజయశంకర్ నియమితులయ్యారు.
రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్టు ప్రశాంత్ కిషోర్ అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ఆయన తన పార్టీని లాంఛనంగా ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.
అంతర్జాతీయ వార్తలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్-కమలా హారిస్ మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. రిపబ్లికన్ పార్టీకి, డెమోక్రటిక్ పార్టీ మధ్య 1శాతం మాత్రమే తేడా ఉందని న్యూయార్క్ టైమ్స్, సియానా కాలేజీ సర్వేల్లో వెల్లడైంది. 48% ట్రంప్‌నకు.. 47% హారిస్‌కు ఓటర్లు అండగా నిలిచారు.
మంచి మాట:
మంచి కోసం చేసే పోరాటంలో ఓడిపోయినా అది గెలుపే- అబ్దుల్ కలాం
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion