అన్వేషించండి
Advertisement
19 th July 2024 News Headlines: జులై 19న మీ స్కూల్ అసెంబ్లీలో చదవదగ్గ న్యూస్ హెడ్‌లైన్స్ ఇక్కడ చూసుకోవచ్చు
19 th July School News Headlines Today: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తాజా వార్తల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఇది మీ స్కూల్ అసెంబ్లీలో చదవడానికి పనికొస్తాయి.
19 th July 2024 News Headlines in Telugu For School Assembly:
1. వాయువ్య బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి, కాకినాడ, ప్రకాశం, నంద్యాల, కోనసీమ, గోదావరి,శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు, కృష్ణా, నెల్లూరు, తిరుపతి, విజయనగరం జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
2. అమెరికా ఉపాధ్యక్ష పదవికి రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా జేడీ వాన్స్ పేరు నామినేట్ కావడంతో ఆయన సతీమణి ఉషా చిలుకూరి పేరు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతోంది. ఉషకు విశాఖలో దగ్గరి బంధువులున్నారు. ఉపాధ్యక్షుడిగా పోటీ చేస్తున్న వాన్స్ భార్య తెలుగింటి అమ్మాయి కావడంతో వాన్స్ తెలుగింటి అల్లుడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రొఫెసర్ శాంతమ్మకు ఉష మనవరాలు అవుతారు
3. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసే నిధులను రుణమాఫీకే వినియోగించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ నిధులను ఇతర అప్పుల్లో జమ చేయొద్దని సూచించారు. అప్పుల జమ విషయంలో రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని... బ్యాంకర్లతో సమావేశంలో భట్టి సూచించారు. రూ.2లక్షల రుణమాఫీని ఒకేసారి ఏ రాష్ట్రం చేయలేదన్నారు.
4. సైబర్ నేరగాళ్లు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుల రుణమాఫీ సొమ్ముపై కన్నేశారు. బ్యాంకు లోగోతో ఉండే వాట్సప్ నంబర్ల నుంచి లింకులు పంపి వాటిని క్లిక్ చేయగానే సొమ్ము కాజేస్తున్నారు. రుణమాఫీపై వాట్సప్ ద్వారా నకిలీ మెసేజ్‌లు పంపిస్తున్నట్లు గుర్తించిన సైబర్‌క్రైమ్ పోలీసులు... అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. ఎవరైనా మోసపోతే 1930 టోల్‌ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.
5. ఉత్తరప్రదేశ్‌లో చండీగఢ్-డిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో నలుగురు మరణించారు. ఈ ప్రమాదంలో దాదాపు 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. నాలుగు ఏసీ బోగీలు సహా 12 బోగీలు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
6. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరో సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే ప్రైవేట్ కంపెనీల్లో 70 శాతం ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వాలని తీసుకొచ్చిన ‘బిల్లు’పై తీవ్ర దుమారం రేగుతోంది. అయితే ఈ బిల్లుపై కేబినెట్ సమావేశంలో మరోసారి చర్చిస్తామని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. బిల్లుపై ఉండే సందేహాలను పూర్తిగా నివృత్తి చేస్తామని వెల్లడించారు
7. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ దూసుకుపోతున్నారు. కాల్పుల ఘటన జరిగిన తర్వాత ట్రంప్‌నకు క్రమంగా మద్దతు పెరుగుతోంది. మరోవైపు బైడెన్‌కు మద్దతు తగ్గుతోంది. స్వయాన బరాక్ ఒబామా కూడా బైడెన్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటే బాగుంటుందని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు.
8. శ్రీలంక టూర్‌కు టీమిండియా జట్టును ప్రకటించింది. అనుకున్నట్లే టీ20 జట్టుకి సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా నియమించింది. వన్డేలకు రోహిత్ శర్మను కెప్టెన్‌గా ఎంపిక చేసిన అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. గిల్‌ను వైస్-కెప్టెన్‌గా నియమించింది. రోహిత్ లేని సమయంలో వన్డే సిరీస్‌లకు గిల్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది.
9. 2024కి ఆస్ట్రానమీ విభాగంలో ప్రఖ్యాత ‘షా’ పురస్కారానికి ఎంపికైన భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త ఎవరు?
శ్రీనివాస్ రామచంద్ర కులకర్ణి ( ఈయన ఇన్ఫోసిస్ సంస్థ సహ వ్యవస్థాపకులు సుధామూర్తికి సోదరుడు)
10: మంచిమాట
శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్
టెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement