అన్వేషించండి
Advertisement
24th August 2024 School News Headlines Today: ఏపీ విశ్వవిద్యాలయాల చట్టానికి భారీగా సవరణలు, ఉక్రెయిన్ పర్యటనలో ప్రధాని వంటి మార్నింగ్ టాప్ న్యూస్
24 th August 2024 School News Headlines Today: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తాజా వార్తల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఇది మీ స్కూల్ అసెంబ్లీలో చదవడానికి పనికొస్తాయి.
24 th August 2024 School News Headlines Today:
నేటి ప్రత్యేకత:
- భారత స్వాతంత్ర్యోద్యమ విప్లవకారుడు రాజ్ గురు జయంతి
- తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సాహితీవేత్త దాశరథి రంగాచార్య జయంతి
- ప్రజావైద్యుడు, గాంధేయవాది వెంపటి సూర్యనారాయణ మరణం
ఆంధ్రప్రదేశ్ వార్తలు:
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చట్టం తీసుకురాబోతుంది. ఏపీలోని యూనివర్సిటీలు అన్నింటికీ కలిపి ఒకే చట్టాన్ని తేనుంది. ఏపీలో 20 విశ్వవిద్యాలయాలు ఉండగా.. వీటికి వేర్వేరు చట్టాలు ఉండగా వీటన్నింటిని కలిపి ఒకే చట్టం తేనుంది. దీని కోసం భారీగా చట్ట సవరణను చేయనుంది.
- శాసనమండలిలో ప్రతిపక్షనేతగా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఎన్నికయ్యారు. ఈ మేరకు శాసన పరిషత్ కార్యదర్శి ప్రసన్నకుమార్ నోటిఫికేషన్ జారీ చేశారు. మండలిలో ఇక నుంచి ఆయన ప్రతిపక్షనేతగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.
తెలంగాణ వార్తలు:
- తెలంగాణలో కొత్త నగరం నిర్మాణం, ప్రతిష్మాత్మకంగా చేపట్టిన 19 ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫీషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ.. స్పీడ్ పేరుతో కొత్త కార్యాచరణ సిద్ధం చేసి వీటిని స్పీడ్ దీని పరిధిలోకి చేర్చింది.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు మహిళా కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై ఇటీవల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మహిళా కమిషన్ ముందు హాజరవుతానన్న కేటీఆర్, ఇప్పటికే మహిళలకు క్షమాపణలు కూడా తెలిపారు.
జాతీయ వార్తలు:
- ఉక్రెయిన్ లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ యుద్ధం కారణంగా మరణించిన చిన్నారుల వివరాలు తెలుసుకుని భావోద్వేగానికి గురయ్యారు. యుద్ధం పిల్లలకు వినాశకరమైనదని ప్రధాని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో మరణించిన చిన్నారుల ఫొటో ప్రదర్శనను రాజధాని కీవ్ లో మోదీ వీక్షించారు.
- కర్ణాటకలో ప్రభుత్వానికి..గవర్నర్ కు మధ్య వివాదం కొనసాగుతోంది. సిద్ధరామయ్య ప్రభుత్వం పంపిన 11 బిల్లులను గవర్నర్ వెనక్కి పంపారు. మరింత వివరణ కోరుతూ 11 బిల్లులను గవర్నర్ వెనక్కి పంపారు. ఇందులో మూడు బిల్లులను గవర్నర్ రెండోసారి వెనక్కి పంపారు. దీంతో గవర్నర్ అధికారాలపై మరోసారి చర్చ ప్రారంభమైంది.
అంతర్జాతీయ వార్తలు:
- బంగ్లాదేశ్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల వల్ల పలు జిల్లాల్లో 13 మంది మరణించారు. 45 లక్షల మంది ప్రజలు ముంపునకు గురైనట్లు బంగ్లా ప్రభుత్వం తెలిపింది. 8 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని చెప్పారు.
- ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం మహిళలపై మరిన్ని ఆంక్షలు విధించింది. బురఖా ధరించడం, బహిరంగ ప్రదేశాలకు వెళ్లడంపై కొత్త ఆంక్షలు విధించారు. చెడు ప్రవర్తనను అరికట్టడమే కొత్త నిబంధనను అమలు చేస్తున్నామన్నారు.
క్రీడా వార్తలు:
- బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ పై హత్య కేసు నమోదైంది. రఫీకుల్ ఇస్లాం అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ స్టేషన్‌లో షకీబ్‌పై కేసు నమోదైంది. షకీబ్ అల్ హసన్ బంగ్లాదేశ్ అవామీ లీగ్ నాయకుడిగా ఉన్నాడు. షకీబ్ తోపాటు మాజీ ప్రధాని షేక్ హసీనాపైనా ఈ కేసు నమోదైంది.
మంచిమాట
మందలో ఒకరిగా ఉండకు... వందలో ఒకరిగా ఉండు- స్వామి వివేకానంద
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ట్రెండింగ్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion