Russia-Ukraine War LIVE: రష్యా దాడుల్లో 137 మంది మృతి: ఉక్రెయిన్ అధ్యక్షుడు వెల్లడి
Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఉక్రెయిన్‌పై సైనిక ఆపరేషన్ చేస్తున్నట్లు ప్రకటించారు.
LIVE
Background
Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించింది. ఉక్రెయిన్‌లో సైనిక ఆపరేషన్ చేపట్టనున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. పౌరులను కాపాడేందుకే ఈ చర్యలు చేపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రజలను ఉద్దేశించి టెలివిజన్ ద్వారా ప్రసంగించారు పుతిన్.
[quote author=వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు]ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించుకోవడం మా ప్లాన్ కాదు. ఉక్రెయిన్‌లో సైనికీకరణకు వ్యతిరేకంగా పనిచేస్తాం. ఈ విషయంలో కలగజేసుకోవాలని ప్రయత్నించినా, మా దేశం, ప్రజలకు ముప్పు కలిగేలా ఆలోచనలు చేసినా.. రష్యా వెనువెంటనే తగిన చర్యలు తీసుకుంటుంది. చరిత్రలో ఎన్నడూ జరగని పరిణామాలకు ఇది దారితీస్తుంది. [/quote]
Our plans (of special military operation) in Ukraine do not include occupying Ukrainian territory. We will aim at demilitarization and denazification of Ukraine : Russian President Vladimir Putin in his address pic.twitter.com/YZLh3PWQw3
— ANI (@ANI) February 24, 2022
Anyone who tries to interfere with us, or even more so, to create threats for our country & our people, must know that Russia’s response will be immediate and will lead you to such consequences as you have never before experienced in your history: Russian President Vladimir Putin pic.twitter.com/xSCWPTByWv
— ANI (@ANI) February 24, 2022
ఉక్రెయిన్ నుంచి ఎదురవుతున్న ముప్పుకు ప్రతిస్పందనగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్ను ఆక్రమించుకోవాలని తమకు ఎలాంటి లక్ష్యం లేదని పుతిన్ పేర్కొన్నారు. రక్తపాతానికి ఉక్రెయిన్ పాలకులదే బాధ్యత అని చెప్పారు.
ఈ సందర్భంగా అంతర్జాతీయ సమాజానికి హెచ్చరికలు చేశారు పుతిన్. రష్యా చేపట్టిన చర్యల్లో తలదూర్చేందుకు ప్రయత్నిస్తే.. 'ఇదివరకు ఎన్నడూ చూడని పరిణామాలు చూడాల్సి ఉంటుంది' అని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
అమెరికా రియాక్షన్
పుతిన్ ప్రకటనపై అమెరికా వెనువెంటనే స్పందించింది. రష్యా చేసే ఈ దాడుల వల్ల జరిగే విధ్వంసం, ప్రాణనష్టానికి ఆ దేశానిదే పూర్తి బాధ్యత అని పేర్కొంది. అమెరికా తన మిత్ర దేశాలతో కలిసి నిర్ణయాత్మకంగా స్పందిస్తుందని అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు.
రష్యా దాడుల్లో 137 మంది మృతి: ఉక్రెయిన్ అధ్యక్షుడు వెల్లడి
ఉక్రెయిన్‌పై రష్యా దాడిని తిప్పికొట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ తెలిపారు. రష్యా చేపట్టిన దాడుల్లో గురువారం ఒక్కరోజే 137 మంది చనిపోయారు. వీరంతా వార్ హీరోలు అని జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. పౌరులు, సైనికులు దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేశారని పేర్కొన్నారు. వందలాది సైనికులు, వేలాది పౌరులు గాయపడ్డారని, వారికి చికిత్స అందిస్తున్నామని చెప్పారు.
70 స్ఖావరాలు
ఉక్రెయిన్ సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని రష్యా భీకర దాడులు చేపడుతోంది. ఉక్రెయిన్‌లోని 70 సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది రష్యా. ధ్వంసం చేసిన వాటిలో 11 ఎయిర్ ఫీల్డ్స్ కూడా ఉన్నట్లు తెలిపింది.
మరోవైపు తాము చేసిన ప్రతిదాడిలో 100 మందికిపైగా రష్యా సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.
#BREAKING Russia says destroys over 70 military targets, including 11 airfields, in Ukraine pic.twitter.com/rcFXZ7VjMf
— AFP News Agency (@AFP) February 24, 2022
కుప్పకూలిన విమానం
ఉక్రెయిన్‌కు చెందిన ఓ సైనిక విమానం రాజధాని కీవ్ నగరంలో కుప్పకూలింది. విమానంలో 14 మంది సభ్యులు ఉన్నారు. రష్యా గురువారం ఉదయం నుంచి ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తోంది.
పుతిన్‌దే పూర్తి బాధ్యత
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ఐరోపా కమిషన్ తీవ్రంగా ఖండించింది. దీనికి పుతిన్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఐరోపా కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ హెచ్చరించారు.
‘President Putin is responsible for bringing war back to Europe,’ European Commission chief Ursula von der Leyen said, adding that the EU would impose new sanctions on Russia over its ‘barbaric attack’ on Ukraine https://t.co/oqzuJANs32 pic.twitter.com/yrrhsbHJtC
— Reuters (@Reuters) February 24, 2022
ఎమెర్జెన్సీ మీటింగ్
ఉక్రెయిన్- రష్యా యుద్ధం, తాజా పరిణామాలపై ప్రధాని మోదీ నేతృత్వంలో అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. తాజా పరిణామాలను మోదీకి విదేశాంగ శాఖ వివరించనుంది. ఉక్రెయిన్‌లో భారతీయుల క్షేమంపై, యుద్ధం వల్ల భారత్‌పై పడే ప్రభావం గురించి మోదీ చర్చించనున్నారు.