Russia-Ukraine Crisis: 'ప్రధాని మోదీ మాటలు రష్యాపై ప్రభావం చూపాయి'
Russia-Ukraine Crisis: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం గురించి ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు రష్యాపై ప్రభావం చూపాయని సీఐఏ చీఫ్ అన్నారు.
Russia-Ukraine Crisis: జీ20 సమావేశాల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ "ఇది యుధ్ధం చేసే యుగం కాదు" అని వ్యాఖ్యానించారు. మోదీ చెప్పిన ఈ మాటలు.. రష్యన్లపై ప్రభావం చూపాయని తాజాగా సీఐఏ (Central Intelligence Agency) డైరెక్టర్ విలియమ్స్ జే బర్న్స్ వ్యాఖ్యానించారు.
రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తన వైఖరిని స్పష్టంగా చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. యుధ్ధం పై ప్రత్యక్షంగా స్పందించకుండా, పౌరుల హత్యలు, అణ్వాయుధాల వినియోగంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసినట్టు ఆయన అన్నారు.
రష్యా, పాశ్చాత్య దేశాల మధ్య జరుగుతున్న వివాదాన్ని పరిష్కరించే దిశగా భారత్ అనుసరిస్తున్న దౌత్య వైఖరిని మోదీ వ్యాఖ్యలు స్పష్టం చేశాయి. ప్రతి సంవత్సరం వార్షిక సమావేశానికి రష్యా వెళ్ళే ప్రధాని మోదీ ఈ ఏడాది వెళ్లలేదు. ఆయన డిసెంబరు 16న రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్ కాల్‌లో సంభాషించారు. రష్యా, ఉక్రెయిన్ యుధ్ధం ప్రారంభం అయినప్పటి నుంచి వారు ఇదు సార్లు ఫోన్ కాల్‌లో మాట్లాడుకున్నారు.
జెలెన్‌స్కీ
ఈ యుద్ధం మొదలై ఇప్పటికే దాదాపు 11 నెలలు పూర్తయింది. అయినప్పటికీ ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తాజాగా అమెరికా కాంగ్రెస్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని సవాళ్లను ఎదుర్కొని నిలబడతామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌కు అమెరికా మొదటి నుంచి అండగా ఉంటోంది. ఈ విషయమై అగ్రరాజ్యానికి థాంక్స్ చెప్పేందుకు వచ్చారు జెలెన్‌స్కీ.
జెలెన్‌స్కీ. ఉక్రెయిన్ అధ్యక్షుడికి బైడెన్ మర్యాదపూర్వక స్వాగతం పలికారు. అమెరికా సైనిక సహకారం కొనసాగిస్తుందని హామీ ఇచ్చారు. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని నిర్మూలించి శాంతి నెలకొల్పుతామని చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్‌పై సైనిక చర్య మొదలు పెట్టినప్పటి నుంచి జెలెన్‌స్కీ దేశం దాటి వెళ్లలేదు. ఇన్నాళ్లకు అమెరికా వచ్చారు. ఇదే తొలి అధికారిక పర్యటన. వచ్చే ఏడాది యుద్ధం కీలక మలుపు తిరిగే అవకాశముందని జోస్యం చెప్పారు జెలెన్‌స్కీ. రష్యాకు ఉక్రెయిన్ ఎప్పుడూ సరెండర్ అవ్వదని తేల్చి చెప్పారు.
Also Read: Rahul Gandhi On BJP Govt: 'మొత్తానికి భయపడ్డారు'- కేంద్రం రాసిన లేఖకు రాహుల్ గాంధీ కౌంటర్