Cup of chai: దుబాయ్‌లో ఒక్క టీ రూ.లక్షకు అమ్మేస్తున్న సుచేతా శర్మ - ఐడియా ఉండాలి కానీ డబ్బుల పంట పండించడం ఈజీనే !
Dubai: దుబాయ్‌లోని ఫైనాన్షియల్ టవర్స్‌లో గత నెల ఓ రెస్టారెంట్ ప్రారంభమయిది. ఒక్కడ ఓ చాయ్ తాగాలంటే రూ. లక్ష చెల్లించాల్సిందే. ఈ హోటల్ సుచేతశర్మ అనే ఇండియన్ పెట్టారు.
1 lakh for a cup of chai: కాస్త టీ తాగాలని ఆ హోటల్ కు వెళ్లి కూర్చుని బాబూ ఓ టీ తీసుకురా అని యథాలాపంగా ఆర్డర్ వేస్తే.. తాగేసిన తర్వాత ఆస్తులు రాసిచ్చేయాల్సి రావొచ్చు.ఎందుకంటే ఆ హోటల్లో టీ కూడా రూ. లక్ష ఉంటుంది. అయితే అది మన దేశంలో కాదు.. దుబాయ్ లో. దుబాయ్ లోని ప్రసిద్ధ ఫైనాన్షియల్ టవర్స్ లో రెండు నెలల క్రితం ఓ రెస్టారెంట్ ప్రారంభమయింది. దాని పేరు బోహో కేఫ్. పేరుకు హోటలే కానీ టీ మాత్రమే స్పెషాలిటీ . పేరుతో తగ్గట్లుగా గోల్డ్ కారక్ చాయ్ అసలు ప్రత్యేకత. అందులో ఒక్కో టీ కనీసం రూ. లక్ష రూపాయలు ఉటుంది.
ఫైనాన్షియల్ టవర్స్లో ఏర్పాటు చేసిన బోహో కేఫ్ ఔట్ లెట్ అత్యంత లగ్డరీగా ఉంటుంది. ఎంత అంటే అక్కడ సిల్వర్‌తో తయారు చేసి.. గోల్డ్ కోటింగ్ ఇచ్చిన స్ఫూన్లు, టీ కప్పులే వాడతారు. స్వచ్చమైన ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ వాడతారు. అందుకే ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఇది దుబాయ్ లోనే హాట్ టాపిక్ అయింది. అక్కడి టీ టేస్ట్ చేయాలన్నట్లుగా ప్రచారంలోకి వచ్చింది. ఎంత గోల్డ్ పేట్లలో.. స్ఫూన్లతో సర్వ్ చేసినా అందులో ఉండేది టీ నే కదా అని చాలా మంది అనుకుంటారు. కానీ ప్రత్యేకతతలు మాత్రం గుర్తించాల్సిందే.
Also Read: భారతీయులకు గుడన్యూస్.. ఇక నుంచి వీసా లేకుండానే రష్యాకు వెళ్లొచ్చట
అత్యంత లగ్జరీగా.. అందరూ సేవించే టీని సర్వ్ చేయడానికి ప్రత్యేకమైన కాన్సెప్ట్ గా దీన్ని పెట్టామని సుచేతా శర్మ చెబుతున్నారు. బంగారు లీప్ మీద గోల్డ్ ప్లేటెడ్ కప్పుల్లో సర్వ్ చేయడం .. అత్యంత నాణ్యమైన టీ పొడిని ఉపయోగిచడం తమ ప్రత్యేకత అని చెబుతున్నారు. బాగా డబ్బులు ఉన్న వాళ్లు మాత్రమే ఇలా అయితే వస్తారు.. మరి మిగిలిన వారికి ఈ రెస్టారెంట్ అందుబాటులోఉండదా దానికీ సుచేతా శర్మ సమాధానం ఇచ్చారు. అంత డబ్బులు పెట్టకూడదనుకున్న వారికి మరో ఆఫర్ పెట్టారు. అదేమిటంటే గోల్జ్ కు బదులు కేవలం వెండితో తయారు చేసి నటీ కప్పుల్ని ఉపయోగించడం. ఇలాంటి టీని 150 దిర్హామ్స్ కే అంటే మూడున్న్ర వేల రూపాయలకే అందుబాటులోకి ఉంచినట్లుగా సుచేతా శర్మ చెబుతున్నారు.
Also Read: రైతుల ఐడియా అదుర్స్.. చలి తట్టుకోవడానికి ఆలుగడ్డ పంటలకు మద్యం పిచికారీ
ఎవరైనా మూడ్ బాగా లేనప్పుడు ప్రశాంతంగా వెళ్లి టీ తాగాలనుకుంటారు. బంగారు ప్లేట్లు,కప్పుల్లో టీ తాగడం అంటే మరింత ప్రశాంతత వస్తుంది. ఇలాంటి టీ తాగడానికి ఎవరు వస్తారు అనుకుంటారు కానీ సుచేత శర్మ ఐడియా చాలా మందికి నచ్చింది. అదీ కూడా దుబాయ్ లో. మంచి లగ్జరియస్ టవర్ లో ఏర్పాటు చేసిన జోహో కేఫ్ కు గోల్డెన్ టీ తాగడానికి కుబేరులు బాగానే తరలివస్తున్నారు. దీంతో సుచేతా శర్మ పంట పండినట్లేనని దుబాయ్ లో టీ సెలర్లు అనుకుంటున్నారు.