అన్వేషించండి

Rohit Pawar:అజిత్ పవార్ విమాన ప్రమాదం పెద్ద కుట్ర - రామ్మోహన్ నాయుడు రాజీనామాకు రోహిత్ పవార్ డిమాండ్

Ajit Pawar Plane Crash: అజిత్ పవార్ విమాన ప్రమాదంపై టీడీపీని టార్గెట్ చేశారు. మంత్రి రామ్మోహన్ నాయుడు రాజీనామాకు శరద్ పవార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారు.

Rohit Pawar Seeks Minister Rammohan Naidu Resignation: మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాద మరణం వెనుక పెను కుట్ర దాగి ఉందని ఆయన మేనల్లుడు, ఎమ్మెల్యే రోహిత్ పవార్ చేసిన ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ఈ విమాన ప్రమాదం కేవలం సాంకేతిక లోపం వల్ల జరిగింది కాదని, అజిత్ పవార్‌ను హతమార్చేందుకు పథకం ప్రకారం జరిగిన కుట్రగా ఆయన అభివర్ణించారు. విమానంలో బాంబుల్లా పనిచేసే అదనపు ఇంధన ట్యాంకులను అమర్చడం వల్లే పేలుడు తీవ్రత ఎక్కువగా ఉందని రోహిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ ఘటనపై పారదర్శకమైన విచారణ జరగాలంటే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని రోహిత్ పవార్ డిమాండ్ చేశారు. ఈ ప్రమాదానికి గురైన విమానాన్ని నడిపిన  వీఎస్ఆర్ వెంచర్స్  సంస్థకు, మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీకి మధ్య సంబంధాలు ఉన్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి పదవిలో ఉంటే విచారణ సంస్థలపై ఒత్తిడి ఉండే అవకాశం ఉందని, అందుకే ఆయన తప్పుకోవాలని స్పష్టం చేశారు.   

దర్యాప్తులో అనేక లొసుగులు ఉన్నాయని రోహిత్ పవార్ వేలెత్తి చూపారు. ప్రయాణానికి కొద్ది నిమిషాల ముందు పైలట్లను ఎందుకు మార్చారు? విమానంలోని వాయిస్ రికార్డర్  ఎందుకు పనిచేయలేదు? విమాన ఇంజన్లు కాలం చెల్లినవని తెలిసినా అధికారులు ఎలా అనుమతించారు? వంటి ప్రశ్నలను ఆయన లేవనెత్తారు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే స్వతంత్ర కమిటీతో విచారణ జరపాలని ఆయన ప్రధాని మోదీకి రాసిన లేఖలో కోరారు.   

ఈ మొత్తం వ్యవహారంపై అంతర్జాతీయ నిపుణులతో విచారణ జరిపించాలని రోహిత్ పవార్ విజ్ఞప్తి చేశారు. స్థానిక దర్యాప్తు సంస్థల నివేదికలపై తమకు నమ్మకం లేదని, నిజనిజాలు బయటకు రావాలంటే నిష్పక్షపాత విచారణే మార్గమని ఆయన పేర్కొన్నారు. అజిత్ పవార్ వంటి సీనియర్ నాయకుడి మరణం వెనుక ఉన్న శక్తులను వెలికితీయకపోతే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  

టాప్ హెడ్ లైన్స్

Reasons For Prashant Kishor Win: బంకీపూర్‌ ఉప ఎన్నికల్లో BJP ఓటమి.. ప్రశాంత్ కిశోర్ విజయానికి 5 అతిపెద్ద కారణాలు
బంకీపూర్‌ ఉప ఎన్నికల్లో BJP ఓటమి.. ప్రశాంత్ కిశోర్ విజయానికి 5 అతిపెద్ద కారణాలు
Iran US War: చర్చల కోసం ఇరాన్ మమ్మల్ని అడుక్కుంటోంది, కానీ..! డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనం
చర్చల కోసం ఇరాన్ మమ్మల్ని అడుక్కుంటోంది, కానీ..! డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనం
24 గంటల్లో అధికారులపై చర్య తీసుకోకుంటే తిరుగుబాటు: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరిక
24 గంటల్లో అధికారులపై చర్య తీసుకోకుంటే తిరుగుబాటు: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరిక
Indian Cricket Coaching Changes: కోచింగ్ స్టాఫ్ త‌ర్వాత‌ హెడ్ ఫిజియో కమలేష్ పై వేళాడుతున్న క‌త్తి, రివ్యూ చేయ‌నున్న బీసీసీఐ
టీమిండియా కోచింగ్ స్టాఫ్ త‌ర్వాత‌ హెడ్ ఫిజియో కమలేష్ పై వేళాడుతున్న క‌త్తి, రివ్యూ చేయ‌నున్న బీసీసీఐ

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget