అన్వేషించండి

AI Summit Congress: ఏఐ సమ్మిట్‌లో అర్థనగ్న నిరసనలు - కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు - సమర్థించుకోలేకపోతున్న ప్రతిపక్ష పార్టీ

Congress party: జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఏఐ సమ్మిట్ లో అర్థనగ్న నిరసనతో దేశం పరువును అంతర్జాతీయంగా తీశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Congress topless protest at AI Summit:  దేశ ప్రతిష్టను ప్రపంచ యవనికపై చాటిచెప్పేందుకు భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన  గ్లోబల్ ఏఐ  సమ్మిట్  వేదికగా జరిగిన ఒక అనూహ్య ఘటన ఇప్పుడు రాజకీయ దుమారానికి దారితీసింది. కాంగ్రెస్ అనుబంధ విభాగమైన యూత్ కాంగ్రెస్ నేతలు నిర్వహించిన అర్థనగ్న నిరసన, దేశ విదేశీ ప్రతినిధుల ముందు భారత్ గౌరవానికి భంగం కలిగించేలా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ దిగ్గజాలు, ఇన్వెస్టర్లు , వివిధ దేశాల ప్రతినిధులు భారత్  సాంకేతిక సామర్థ్యాన్ని పరిశీలిస్తున్న తరుణంలో ఈ నిరసన చోటుచేసుకుంది. దేశాభివృద్ధికి కీలకంగా భావిస్తున్న సమ్మిట్‌లో ఇలాంటి  అర్థనగ్న ప్రదర్శనలు చేపట్టడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో భారత్ పరువు చులకన అయ్యిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది కేవలం రాజకీయ నిరసనగా కాకుండా, దేశ ప్రతిష్టను దిగజార్చే చర్యగా ప్రముఖులు అభివర్ణిస్తున్నారు.

సొంత పార్టీ ముఖ్యమంత్రికే సంకట పరిస్థితి 

ఈ నిరసన జరిగిన సమయంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  సదస్సులో ప్రసంగిస్తున్నారు.  ఒకవైపు కాంగ్రెస్ ముఖ్యమంత్రి పెట్టుబడులను ఆకర్షించేందుకు కృషి చేస్తుంటే, అదే పార్టీకి చెందిన కేడర్ ఇలాంటి విపరీత ధోరణులకు పాల్పడటం పార్టీని ఆత్మరక్షణలో పడేసింది. ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలకు సొంత పార్టీ శ్రేణులే గండికొట్టినట్లయ్యిందని  భావిస్తున్నారు. ఈ ఘటనపై రాజకీయ, సామాజిక , టెక్ రంగ ప్రముఖులు తీవ్రంగా స్పందిస్తున్నారు.  రాజకీయాల్లో విభేదాలు సహజమని, కానీ దేశ ప్రతిష్టకు సంబంధించిన అంతర్జాతీయ వేదికలపై ఇలాంటి వికృత చేష్టలు తగవని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార దాహంతో దేశ వ్యతిరేక ధోరణులను  ప్రోత్సహిస్తోందని విమర్శకులు ఆరోపిస్తున్నారు. అభివృద్ధి సదస్సును రాజకీయ రణరంగంగా మార్చడం ఏమాత్రం సమర్థనీయం కాదని సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం మండిపడుతున్నారు.  

అయోమయంలో కాంగ్రెస్ అధిష్టానం 

ఈ విమర్శల ధాటికి కాంగ్రెస్ పార్టీ సరైన వివరణ ఇచ్చుకోలేక ఇబ్బంది పడుతోంది. ప్లానింగ్ ప్రకారం జరిగిందా లేదా యువజన విభాగం అత్యుత్సాహంతో చేసిందా అనే దానిపై స్పష్టత లేనప్పటికీ, నష్టం మాత్రం జరిగిపోయింది. దేశ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావించడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విపక్షాలు దాడిని ఉధృతం చేశాయి. ముఖ్యంగా ఏఐ రంగంలో భారత్ అగ్రగామిగా ఎదిగే క్రమంలో ఈ ఘటన ఒక మచ్చగా మిగిలిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.  

భద్రతా వైఫల్యంపై కూడా ప్రశ్నలు 

అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అంతర్జాతీయ సదస్సులోకి నిరసనకారులు ఎలా ప్రవేశించారనే దానిపై కూడా భద్రతా సంస్థలు ఆరా తీస్తున్నాయి. ఇది కేవలం నిరసన మాత్రమే కాదని, సమ్మిట్‌ను భగ్నం చేసే కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ సాగుతోంది. ఏది ఏమైనా, ఈ ఘటన కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో తలవంపులు తెచ్చిపెట్టడమే కాకుండా, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.  

 

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Woman Arrest: ప్రేమ మత్తుతో దారి తప్పిన యువతి.. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికింది!
ప్రేమ మత్తుతో దారి తప్పిన యువతి.. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికింది!
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
Bilateral Revenue War: వేల కోట్ల ఆదాయం మొత్తం మీకేనా మాకు చిల్లిగవ్వ లేదా.. ద్వైపాక్షిక సిరీస్ రెవెన్యూ షేరింగ్ పై విండీస్ క్రికెట్ బాస్ సంచలన వ్యాఖ్యలు
వేల కోట్ల ఆదాయం మొత్తం మీకేనా మాకు చిల్లిగవ్వ లేదా.. ద్వైపాక్షిక సిరీస్ రెవెన్యూ షేరింగ్ పై విండీస్ క్రికెట్ బాస్ సంచలన వ్యాఖ్యలు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Vinukonda Guntur Highway Expansion: వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Anupama Parameswaran : పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
Embed widget