అన్వేషించండి

MLC Anantha Babu: హైకోర్టులో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య ముందస్తు బెయిల్ పిటిషన్!

Driver Subramanyam Murder Case | డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ పాత్ర ఉందని సిట్ తేల్చడంతో ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

MLC Anantha Babu | అమరావతి: ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో బెయిల్ వచ్చే వరకు సిట్ (SIT) అధికారులకు అందుబాటులో ఉండకూడదని ఆమె ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లక్ష్మీదుర్గ పరారీలో ఉండటంతో, ఆమె ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు కూడా ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. 

ఈ కేసు విచారణలో భాగంగా పాత విషయాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. గతంలో ఘర్షణ సమయంలో అనంతబాబు తోయడం వలనే డ్రైవర్ సుబ్రహ్మణ్యం ప్రాణాలు కోల్పోయాడని అప్పటి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు వెల్లడించడం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేసిన సిట్ అధికారులు.. నాటి ఎస్పీ రవీంద్రనాథ్ బాబుతో పాటు డీఎస్పీ మురళీకృష్ణారెడ్డిని కూడా విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ విచారణ ద్వారా హత్యకు సంబంధించిన మరిన్ని కీలక ఆధారాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.

కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య పాత్ర..
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సిట్ (SIT) దాఖలు చేసిన తాజా ఛార్జిషీట్‌తో కేసు కీలక మలుపు తిరిగింది. దళిత యువకుడైన సుబ్రహ్మణ్యం హత్యలో ఎమ్మెల్సీ అనంత బాబుతో పాటు ఆయన భార్య అనంత లక్ష్మి దుర్గ పాత్ర ఉందని సిట్ నిర్ధారించింది. ఆమె ఈ హత్యకు ప్రేరేపించడమే కాకుండా, నేరానికి సంబంధించిన అన్ని దశల్లోనూ తన భర్తకు సహకరించినట్లు దర్యాప్తు సంస్థ అభియోగాలు మోపింది. దీంతో ఈ కేసులో ఆమెను కూడా నిందితురాలిగా పేర్కొంటూ పోలీసులు తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు.

తన భార్యపై ఛార్జిషీట్ విషయం తెలియగానే, ఎమ్మెల్సీ అనంత బాబు అజ్ఞాతంలోకి వెళ్లారు. శాసనమండలిలో ఉన్న ఆయన, కనీసం తన వ్యక్తిగత సిబ్బందిని లేదా గన్‌మెన్‌లను కూడా తీసుకోకుండా హుటాహుటిన అక్కడి నుండి వెళ్ళిపోవడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. తన భార్య అరెస్టు కాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన పరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లక్ష్మీదుర్గ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

వైసీపీ హయాంలో హత్య..
2022 మే 19న డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అప్పట్లో అనంతబాబు స్వయంగా మృతదేహాన్ని తన కారులో తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించగా, తమ కొడుకును ఎమ్మెల్సీనే హత్య చేశాడని బాధితులు ఆరోపించారు. ఈ క్రమంలో గతంలో అరెస్ట్ అయిన అనంత బాబు ప్రస్తుతం బెయిల్‌పై ఉండగా, ఆయన భార్య పేరును ఛార్జ్ షీటులో చేర్చిన తరువాత భార్యాభర్తలు అజ్ఞాతంలోకి వెళ్లగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు దర్యాప్తులో ఏపీ పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నిందితుడికి మేలు చేసేలా, అతనికి డిఫాల్ట్ బెయిల్ వచ్చే వరకు ఆగి ఛార్జ్‌షీట్ దాఖలు చేయడంపై ధర్మాసనం ప్రశ్నించింది. కేసు దర్యాప్తు మీ వల్ల కాకపోతే సీబీఐకి అప్పగిస్తాం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
YS Jagan Local Body Elections Strategy 2026: గెలుపోటములు కాదు.. పోటీ ముఖ్యం - లోకల్ పోల్స్‌లో క్యాడర్‌కు జగన్ సందేశం - అసలు ప్లానేంటి?
గెలుపోటములు కాదు.. పోటీ ముఖ్యం - లోకల్ పోల్స్‌లో క్యాడర్‌కు జగన్ సందేశం - అసలు ప్లానేంటి?
AP Municipal Elections: మేయర్లు, ఛైర్మన్ల నేరుగా ఎన్నిక - ఏపీ మున్సిపల్ పోరులో బిగ్ ట్విస్ట్! కూటమి పాలనకు ఇది తొలి లిట్మస్ టెస్ట్ !
మేయర్లు, ఛైర్మన్ల నేరుగా ఎన్నిక - ఏపీ మున్సిపల్ పోరులో బిగ్ ట్విస్ట్! కూటమి పాలనకు ఇది తొలి లిట్మస్ టెస్ట్ !

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Embed widget