అన్వేషించండి
Advertisement
Republic Day 2023: గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొన్న అగ్నివీర్ - తొలిసారి ఇలా!
Republic Day 2023: 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మొదటి సారి అగ్నివీర్ గణతంత్ర దినోత్సవ పరేడ్ లో ప్రదర్శించారు. అలాగే మేక్ ఇన్ ఇండియా కింద తయారు చేసిన ఆయుధాలను కూడా ప్రదర్శించారు.
Republic Day 2023: 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను భారత దేశ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో మహిళా శక్తి నుంచి సైనిక శక్తి వరకు కవాతు నిర్వహించారు. ఈ సంవత్సరం మొదటి సారిగా అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్.. గణతంత్ర దినోత్సన పరేడ్ లో పాల్గొంది. ఈ ఒక్కటే కాకుండా ఈ ఏడు మొదటి సారిగా కనిపించిన మరికొన్నింటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఏడు గణతంత్ర వేడుకల్లో కొత్తగా కనిపించినవి..!
- ఈ సంవత్సరం రిపబ్లిక్ డే పరేడ్ ను మొదటి సారిగా కర్తవ్య్ మార్గంలో నిర్వహించారు.
- 2023 గణతంత్ర దినోత్సవ వేడకల్లో మొదటి సారిగా స్వావలంబన భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకుని భారత దేశంలో తయారు చేసిన 105 ఎంఎం లైట్ ఫీల్డ్ గన్‌ల ద్వారా 21 గన్ సెల్యూట్ అందించబడింది.
- గణతంత్ర దినోత్సవానికి తొలిసారిగా ఈజిప్టు నాయకుడిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. మంగళవారం ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్సీసీ ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. దీంతో పాటు రిపబ్లిక్ డే పరేడ్‌లో ఈజిప్టు సైన్యం తొలిసారిగా తన ఉనికిని చాటుకుంది.
- అగ్నిపథ్ పథకం కింద మొదటిసారిగా అగ్నివీర్ రిపబ్లిక్ డేలో భాగమైంది.
- రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ద్రౌపది ముర్ముకు ఇది మొదటి గణతంత్ర దినోత్సవం. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సొంత రాష్ట్ర సంస్కృతిని కాపాడేందుకు ఒడిశా పట్టుచీరను ధరించారు.
- ఈ సంవత్సరం మొదటి సారిగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ యొక్క ఒంటెల దళంలో మహిళా రైడర్లు పాల్గొన్నారు. ఇందులో సోనాల్, నిషా, భగవతి, అంబిక, కుసుమ్, ప్రియాంక, కౌశల్య, కాజల్, భావన, హీనా సహా 12 మంది మహిళా రైడర్లు ఉన్నారు.
- అలాగే ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్‌లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మొదటి సారిగా డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఒక శకటాన్ని ప్రదర్శించింది. ఈ శకటం పేరు డ్రగ్స్ ఫ్రీ ఇండియా.
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన పరేడ్‌లో 35 మంది మహిళా కానిస్టేబుళ్లతో కూడిన ఢిల్లీ పోలీస్ మహిళా పైప్ బ్యాండ్ పాల్గొన్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
పాలిటిక్స్
సినిమా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Dr. Rahul ChaudharyPresident of Administration in NDIIT
Opinion