By: Ram Manohar | Updated at : 29 Apr 2023 11:30 AM (IST)
తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని బ్రిజ్ భూషణ్ వెల్లడించారు.
Wrestlers Protest:
రెండు కేసులు నమోదు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఢిల్లీ పోలీసులు రెండు FIRలు నమోదు చేశారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారంటూ ఆరోపణల ఆధారంగా కేసు నమోదు చేశారు. దీనిపై బ్రిజ్ భూషణ్ స్పందించారు. తాను ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు. ఎలాంటి విచారణకైనా సిద్ధంగానే ఉన్నానని తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టుపైన తనకు గౌరవం ఉందన్న ఆయన...న్యాయస్థానం ఎలాంటి తీర్పునిచ్చినా స్వీకరిస్తానని అన్నారు. రెజ్లర్‌లు రోజుకో డిమాండ్ చేస్తున్నారని మండి పడ్డారు.
"నాకు ఆ ఆరోపణలకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఇన్నోసెంట్‌ని. ఎలాంటి విచారణకైనా సిద్ధమే. దర్యాప్తు సంస్థలకు పూర్తి సహకారం అందిస్తాను. సుప్రీంకోర్టు తీర్పుని గౌరవిస్తాను. రెజ్లర్‌లు రోజుకో డిమాండ్ తెరపైకి తీసుకొస్తున్నారు. ముందు నాపై FIR నమోదు చేయాలని అన్నారు. అది అయిపోయింది. ఇప్పుడు నన్ను జైలుకి పంపాలని డిమాండ్ చేస్తున్నారు. అన్ని పదవుల నుంచి రిజైన్ చేయాలని అంటున్నారు. నేనో ఎంపీని. ఈ పదవి నాకు ప్రజలే ఇచ్చారు. రాజ్యాంగబద్ధంగా వచ్చిన హోదా ఇది. వినేష్ ఫోగట్ వల్ల వచ్చిన పదవి కాదిది. కేవలం ఓ కుటుంబం మాత్రమే ఈ నిరసనలు చేస్తోంది. మిగతా ప్లేయర్స్ అంతా నాకు మద్దతుగా ఉన్నారు"
- బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, WFI చీఫ్
#WATCH | They (wrestlers) did not complain to any police station, sports ministry or federation for 12 years. Before their protest, they used to praise me, invite me to their weddings and take photographs with me, seek my blessings. Now the matter is with the Supreme Court and… pic.twitter.com/8OaqPO6j0e
— ANI (@ANI) April 29, 2023
ఇన్నాళ్లు ఈ రెజ్లర్‌లు అంతా ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు బ్రిజ్ భూషణ్. ఈ ఆందోళనలకు దిగే ముందు కూడా తనతో వాళ్లు బాగానే ఉన్నారని, ఆ తరవాత ఏమైందో తెలియదని వెల్లడించారు.
"దాదాపు 12 ఏళ్లుగా ఆ రెజ్లర్‌లు ఏ పోలీస్ స్టేషన్‌లో కూడా నాపై ఫిర్యాదు చేయలేదు. అటు క్రీడా మంత్రిత్వా శాఖకూ కంప్లెయింట్ చేయలేదు. ఈ నిరసనలు చేపట్టే ముందు నాతో వాళ్లు బాగానే ఉన్నారు. నన్ను పొగిడే వాళ్లు. వాళ్ల పెళ్లికి కూడా నన్ను పిలిచారు. నాతో సెల్ఫీలు దిగారు. నా ఆశీర్వాదం తీసుకున్నారు. ఏదేమైనా ఇప్పుడీ కేసు సుప్రీంకోర్టుకి చేరుకుంది. ఎలాంటి తీర్పు వచ్చినా గౌరవిస్తాను. ఇది వాళ్లంతట వాళ్లుగా చేస్తున్న నిరసన కాదు. ఈ దీక్ష వెనకాల కాంగ్రెస్ ఉందన్న అనుమానముంది. "
- బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, WFI చీఫ్
#WATCH | I have been saying from the beginning that some industrialists and Congress are behind this protest. This is not a protest by wrestlers: Wrestling Federation of India (WFI) president Brij Bhushan Sharan Singh pic.twitter.com/LID21jnwqL
— ANI (@ANI) April 29, 2023
Weather Latest Update: కాస్త చల్లబడ్డ వాతావరణం, నేడు వర్షాలు, ఈదురుగాలుల అలర్ట్ - ఐఎండీ
ABP Desam Top 10, 1 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Gold-Silver Price Today 01 June 2023: పుంజుకుంటున్న పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
IBPS RRB XII Recruitment 2023: గ్రామీణ బ్యాంకుల్లో 8463 ఉద్యోగాలు, దరఖాస్తు ప్రారంభం!
Telangana Formation Day: తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన 12 సంఘటనలు, చారిత్రక ఘట్టాలు ఇవే!
Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !
Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!
ఆసుపత్రిలో చేరిన ఎంఎస్ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స
Konaseema: హిజ్రా హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, మిస్టరీ కేసు ఛేదించిన కోనసీమ పోలీసులు