Rashtrapatni Remark Row: కాంగ్రెస్ నేత అధీర్ రంజన్‌కు జాతీయ మహిళా కమిషన్ సమన్లు
Rashtrapatni Remark Row: కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధురీకి సమన్లు జారీ చేసింది జాతీయ మహిళా కమిషన్.
Rashtrapatni Remark Row: కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధురీకి జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) నోటీసులు జారీ చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై ఆయన చేసిన వ్యాఖ్యలకు రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది ఎన్‌సీడబ్ల్యూ. ఆగస్టు 3న ఉదయం 11.30 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
Remark of Parliamentarian Adhir Ranjan Chowdhury towards the President of India is very derogatory. This sexist remark shows his mindset towards women. When he can speak like this towards the highest authority of India, how must he be behaving with others?: NCW chief Rekha Sharma pic.twitter.com/PYH0JhLhAB
— ANI (@ANI) July 28, 2022
ఇదీ జరిగింది
కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌధురి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశించి 'రాష్ట్రపత్ని' అనటం తీవ్ర వివాదస్పదమైంది. ఈ వ్యాఖ్యలపై భాజపా మండిపడింది. కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలంటూ ఉభయసభలు ప్రారంభం కాగానే భాజపా ఎంపీలు ఆందోళనకు దిగారు.
లోక్ సభలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, రాజ్యసభలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ క్షమాపణలు చెప్పి తీరాలని డిమాండ్ చేశారు.