Corona Cases: దేశంలో మళ్లీ భారీగా పెరిగిన కేసులు- కొత్తగా 20 వేల మందికి వైరస్
Corona Cases: దేశంలో కొత్తగా 20,409 కరోనా కేసులు నమోదయ్యాయి. 32 మంది మృతి చెందారు.
Corona Cases: దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 20,409 కరోనా కేసులు నమోదయ్యాయి. 32 మంది మృతి చెందారు. కొవిడ్ నుంచి తాజాగా 22,697 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.48 శాతానికి చేరింది.
India reports 20,409 new COVID19 cases today; Active caseload at 1,43,988 pic.twitter.com/3YYULK8bZJ
— ANI (@ANI) July 29, 2022
- మొత్తం కేసులు : 4,39,79,730
- మొత్తం మరణాలు: 5,26,258
- యాక్టివ్ కేసులు: 1,43,988
- మొత్తం రికవరీలు: 4,33,09,484
వ్యాక్సినేషన్
దేశంలో కొత్తగా 38,63,960 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 203.60 కోట్లు దాటింది. మరో 3,98,761 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
కరోనా నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని కేంద్రం.. రాష్ట్రాలను ఆదేశించింది. కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని కోరింది. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రామాన్ని కూడా వేగంగా కొనసాగించాలని నిర్ణయించింది కేంద్ర ఆరోగ్య శాఖ. వ్యాక్సినేషన్‌లో మరో కొత్త మైలురాయిని చేరింది భారత్. దేశవ్యాప్తంగా 200 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.
కరోనా ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే పలు రిపోర్ట్‌లు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో భారత్‌లో కూడా ఫోర్త్ వేవ్ వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read: International Tiger Day 2022: పులులు కూడా ఇంట్రావర్ట్‌లేనట - వాటి గంభీరం, గాండ్రింపు అంతా పైపైకే
Also Read: MiG-21 Fighter Jet Crash : రాజస్థాన్ లో కుప్పకూలిన ఎయిర్ ఫోర్స్ మిగ్-21, ఇద్దరు పైలెట్లు మృతి