Surya Namaskar LIVE : 75 కోట్ల సూర్య నమస్కారాల చాలెంజ్ .. ! ఇందులో ఇలా మీరు కూడా భాగం అవ్వండి
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా సరికొత్తగా 75 కోట్ల సూర్య నమస్కారాల చాలెంజ్ జరగుతోంది. పతంజలితో కలిసి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమం చేపట్టింది.
సూర్య నమస్కారాలు ఆరోగ్య ప్రదాయనిగా వేద విజ్ఞానం చెబుతోంది. అందుకే దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా సరికొత్తగా 75 కోట్ల సూర్య నమస్కారాల చాలెంజ్ జరగుతోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా జరిగే ఈ ఆన్‌లైన్ చాలెంజ్ ఫిబ్రవరి 20 వరకు కార్యక్రమం కొనసాగనుంది.
हमने भी जिद ऐसी ठानी है
— Tijarawala SK (@tijarawala) January 3, 2022
सर्वे भवंतु सुखिन: मानी है👍#75करोड_सूर्यनमस्कार
आजादी की 75वीं वर्षगांठ की बेला में#योगामृत_महोत्सव का शुभारंभ आज हैदराबाद में सायं 4.30 बजे👍
150 देशों के प्रतिनिधियों की भागीदारी से विश्व में एकता और स्वास्थ्य चेतना का शुभारंभ होगा@kamleshdaaji pic.twitter.com/ZfN2p8MHxi
హార్ట్ ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్, ఫిట్ ఇండియా, పతంజలి ఫౌండేషన్ తదితర జాతీయ స్థాయి సంస్థలు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో దీన్ని చేపట్టాయి. చాలెంజ్‌లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగా సాధకులు క్రమం తప్పకుండా సూర్యనమస్కారాలు చేస్తారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. నిర్ణీత గడువులోగా ప్రతి ఒక్కరూ 12 సూర్య నమస్కారాల సర్కిల్‌ను రోజుకు 13 సార్లు చొప్పున సాధన చేస్తారు. ఫిబ్రవరి 20లోపు వీలును బట్టి 21 రోజుల్లో పూర్తి చేస్తారు. అలా పూర్తి చేసిన వారికి నిర్వాహకులు ధ్రువీకరణ పత్రం అందజేస్తారు.
Also Read: ఇదేందయ్యా ఇది నేనెప్పుడూ చూడలా... బస్సులో కోడి పిల్లకు టికెట్... అవాక్కైన ప్రయాణికులు
దేశవ్యాప్తంగా ఇప్పటికే అనేక హిందూ సంస్థలు ఇందులో భాగమయ్యాయి. పెద్ద ఎత్తున సూర్య నమస్కాలను దేశ విద్యార్థులకు.. యువతకు అలవాటు చేస్తున్నారు. 75 కోట్ల సూర్య నమస్కారాల రికార్డును సాధించి... ఆరోగ్యకరమైన భారత్‌ను తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నారు. పలు ప్రాంతాల్లోని వెయ్యికి పైగా విశ్వవిద్యాలయాలు, 40 వేలకు పైగా కళాశాలలు ఈ 75 కోట్ల సూర్య నమస్కారాల చాలెంజ్‌లో పాల్గొననున్నాయి. దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు ఇందులో పాల్గొనేలా చేసేందుకు కృషి జరుగుతోంది.
Also Read: ఎన్నికలకు ముందు రూ.700 కోట్లతో స్పోర్ట్స్ యూనివర్సిటీకి మోదీ శంకుస్థాపన
Also Read: UP Election 2022: తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో యోగి.. అయోధ్య నుంచేనా పోటీ!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి