By: ABP Desam | Updated at : 02 Jan 2022 07:43 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
కర్ణాటకలో కోడి పిల్లకు టికెట్
అసలు కన్నా కొసరుకు ఎక్కువైందన్న సామెతకు సరిగ్గా సరిపోతుంది ఈ కుటుంబం పరిస్థితి. సంచార జీవనం సాగించే ఓ కుటుంబం ఓ కోడి పిల్లను రూ.10 పెట్టి కొనుకున్నారు. వేరే ప్రాంతానికి వెళ్లేందుకు బస్సు ఎక్కారు. ఇక్కడే మొదలైంది అసలు విషయం. పది రూపాయల కోడి పిల్లకు టికెట్ కొనాలని రూ.52 ఛార్జ్ చేశాడు. ఆర్టీసీ బస్సుల్లో నిర్ణీత బరువు కన్నా అధికంగా సరకులు తీసుకెళ్తే లగేజ్ టికెట్ కొడతాడు బస్సు కండక్టర్. కానీ కర్ణాటకలో ఓ సంచార కుటుంబానికి వింత అనుభవం ఎదురైంది. పది రూపాయలు పెట్టి కొన్న కోడి పిల్లకు రూ.52 టికెట్ కొట్టాడు కండక్టర్. ఈ టికెట్ చూసి ఆ కుటుంబం అవాక్కయ్యారు.
Also Read: Mancherial: దొంగను బంధించేందుకు మహిళ సాహసం.. ప్యాంటు, బెల్టు పట్టుకొని లాగి.. అభినందించిన పోలీసులు
రూ.10కి కొనుక్కున్న కోడిపిల్లకు రూ.52 బస్ ఛార్జ్ అని తెలిసి ముగ్గురు సభ్యుల సంచార కుటుంబం షాక్ అయ్యింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. ఉడిపి జిల్లా బైందూరు తాలూకాలోని షిరూర్ వెళ్లేందుకు కోడిపిల్లను తీసుకుని హోసానగర్ పట్టణంలో కేఎస్‌ఆర్‌టీసీ బస్సు ఎక్కిందో కుటుంబం. బస్సు కండక్టర్ కుటుంబాన్ని టికెట్ కొనమని అడిగాడు. కుటుంబంలోని ఓ వ్యక్తి షిరూర్‌కు మూడు టిక్కెట్లు ఇవ్వమని అడిగాడు. కండక్టర్ గోనె సంచిలో ఉంచిన కోడిపిల్ల చప్పుడు విన్నాడు. అది చూసిన కండక్టర్ ఏంటని అడిగాడు. అది కోడిపిల్ల అని వాళ్లు సమాధానం ఇచ్చింది. దీంతో కండక్టర్ కోడి పిల్లకు హాఫ్ టిక్కెట్ తీసుకోమని చెప్పి రూ.52 హాఫ్ టిక్కెట్ కొట్టాడు. అదే బస్సులో ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికులు కోడిపిల్లకు డబ్బులు వసూలు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Also Read: న్యూ ఇయర్ పార్టీ కోసం మేకలను దొంగిలించిన పోలీస్.. చివరకు ఏమైందంటే..
గతంలోనూ ఇలాంటి ఘటన
ఇలాంటి ఘటనే గతంలోనూ చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్రంలో చిక్కబళ్లాపుర జిల్లాలోని గౌరిబిదనూరు నుంచి పెద్దనహళ్లి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఒక రైతు రెండు కోళ్లను తన వెంట తీసుకెళ్తున్నాడు. ఈ రెండు కోళ్లకు కండక్టర్ హాఫ్ టికెట్ వసూలు చేశాడు. గౌరీబిదనూరులో ఒక్కో కోడిని రూ. 150కి పెట్టి కొనుగోలు చేసిన రైతు టౌన్ బస్టాండ్‌లో బస్సు ఎక్కాడు. ఆర్టీసీ బస్సులో టికెట్ కోసం కండక్టర్ కు రూ.50 నోటును ఇచ్చాడు. పెద్దలకు రూ.24 టికెట్ ధర ఛార్జ్ చేస్తారు. కండక్టర్ రూ. 26 తిరిగి ఇస్తారని రైతు ఎదురుచూశాడు. కానీ అతని షాక్‌కు గురయ్యాడు. కానీ కండక్టర్ కేవలం రూ. 2 తిరిగి ఇచ్చాడు. పైగా మూడు టికెట్లు ఇచ్చాడు. మూడు టికెట్లు ఎందుకని రైతు ప్రశ్నించగా... రెండు కోళ్లకు కూడా కలిసి మూడు టికెట్లు ఇచ్చానని చెప్పాడు.
Also Read: Delhi HC on Marriage: 'అలా చెప్పి పెళ్లి చేయడం మోసమే..' దిల్లీ హైకోర్టు సంచలన తీర్పు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
సంక్రాంతి నుంచి ఫ్యామిలీ డాక్టర్ - వైద్యులను నియమించుకుంటున్నామన్న ఏపీ ప్రభుత్వం !
Munawar Faruqui : హైదరాబాద్ లో మునవార్ ఫారుఖీ షో, అడ్డుకుంటామని బీజేవైఎస్ వార్నింగ్
Kurnool News : కర్నూలు జిల్లాలో గడప గడపకూ నిరసన సెగ
Nizamabad News: వర్షం పడింది- మొక్కజొన్నకు డిమాండ్ పెరిగింది
Breaking News Live Telugu Updates: మంత్రి బొత్సతో అసంపూర్తిగా ముగిసిన ఉపాధ్యాయ సంఘాల చర్చలు
IND Vs ZIM: వికెట్ పడకుండా కొట్టేశారు - మొదటి వన్డేలో టీమిండియా ఘనవిజయం!
Vijayashanthi : ఫైర్ బ్రాండ్ విజయశాంతి దారెటు ? బీజేపీలో ఆమెను దూరం పెడుతున్నారా ?
ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?
Rajinikanth as Governor: రజనీకాంత్కు గవర్నర్ పోస్ట్ ! బీజేపీ ఆఫర్ ఇచ్చిందా ? తలైవా అంగీకరించారా ?