By: ABP Desam | Updated at : 03 Jan 2022 03:07 PM (IST)
హైదరాబాద్ - బెంగళూరు మధ్య కూడా బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదన
బుల్లెట్ ట్రైన్‌ల కారిడార్‌లను రైల్వేశాఖ పెంచింది. తాజాగా హైదరాబాద్ - బెంగళూరు మధ్య కూడా బుల్లెట్ ట్రైన్ ను నడపాలని నిర్ణయించుకుంది. గతంలో ప్రతిపాదించిన వాటిలో హైదరాబాద్ నుంచి ముంబైకి బుల్లెట్ ట్రైన్ ఉంది. ఇప్పుడు ఇది రెండో లైన్ అనుకోవాలి. ఇప్పటికే మొత్తం 8 కారిడార్లలో బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదించారు. ఒక్క ముంబై - అహ్మబాబాద్ రూట్‌లో 508 కిలోమీటర్ల నిడివితో బుల్లెట్ రైలు మార్గం నిర్మాణ పనులు మాత్రంసాగుతున్నాయి. అదీ కూడా నత్త నడకన సాగుతున్నాయి. దీని కోసం ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ పేరుతో ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేశారు.
Also Read: ఇదేందయ్యా ఇది నేనెప్పుడూ చూడలా... బస్సులో కోడి పిల్లకు టికెట్... అవాక్కైన ప్రయాణికులు
మరోవైపు ముంబై - హైదరాబాద్ బుల్లెట్ రైలు మార్గానికి సంబంధించి డీపీఆర్ తుది దశలో ఉంది. వీటితో పాటు బెంగళూరు - హైదరాబాద్ , నాగ్‌పూర్ - వారణాసి , పట్నా - గౌహతి , అమృత్‌సర్ - పఠాన్‌కోట్ - జమ్ము ల్లో కొత్తగా నేషనల్ రైల్ ప్లాన్ 2022లో బుల్లెట్ చ్రైన్ ప్రణాళికలు చేర్చారు . బుల్లెట్ ట్రైన్ కలిగిన దేశాల సరసన ఇండియాను నిలపపాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇందు కోసం జపాన్ సాయంచేస్తోంది. దాదాపుగా ఆరేళ్ల క్రితం నిర్మాణ పనులు ప్రారంభించిన అహ్మదాబాద్ - ముంబై బుల్లెట్ ట్రైన్ ఇంకా భూసేకరణ సమస్యలు ఎదుర్కొంటోంది. అవన్నీ పూర్తి చేసుకుని నిర్మాణం కావాలి., నిధులు కూడా పెద్ద సమస్య.
Also Read: ఎన్నికలకు ముందు రూ.700 కోట్లతో స్పోర్ట్స్ యూనివర్సిటీకి మోదీ శంకుస్థాపన
ముంబై - అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు రూ. లక్ష కోట్లను జపాన్ లోన్‌గా ఇస్తోంది. మిగతా ప్రాజెక్టులకు నిధుల సమీకరణ గురించి ఇంకా ఆలోచించలేదు. అన్నీ పూర్తి చేసుకుని నిర్మాణం పూర్తవ్వాలంటే ఓ తరం మారుతుందని అంచనా వేస్తున్నారు . మరో రెండు దశాబ్దాల తర్వాతే బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే నిజమైతే.. అత్యంత వేగవంతమైన బుల్లెట్ ట్రైన్ వ్యవస్థను అత్యంత ఆలస్యంగా ఏర్పాటు చేసుకున్నదేశంగా భారత్ మిగిలిపోతుందన్న సెటైర్లు కూడా ఉన్నాయి. ఇక హైదరాబాద్ నుంచి ప్రతిపాదన బుల్లెట్ ట్రైన్లు ముంబై- బెంగళూరుకు వెళ్లేలా ప్రయాణించాలంటే ... దశాబ్దాలు పట్టడం ఖాయమని అనుకోవచ్చు. ఇప్పటికైతే... ప్రతిపాదనలు ఉన్నాయని సంతోషపడటమే.
Also Read: UP Election 2022: తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో యోగి.. అయోధ్య నుంచేనా పోటీ!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
TS SET: టీఎస్ సెట్ - 2023 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డుల డౌన్లోడ్ లింక్ ఇదే
బేగంపేట ఎయిర్ పోర్టులో రేవంత్ కు ఘన స్వాగతం, రాత్రి గచ్చిబౌలిలో బస
SSC Delhi Police: ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్ష ప్రిలిమినరీ ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం
No Wishes From KCR: కేసీఆర్ కొత్త సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు విష్ చేయలేదు?
SI Exam Results: ఎస్ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో
Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?
Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్తో కేసు నమోదు
Revanth Reddy News: ముగిసిన రేవంత్ ఢిల్లీ పర్యటన, మళ్లీ వెనక్కి రమ్మని అధిష్ఠానం పిలుపు - మరో భేటీ
Ravi Bishnoi: టీ20 నెంబర్ వన్ బౌలర్ రవి బిష్ణోయ్, చరిత్ర సృష్టించిన యువ స్పిన్నర్
/body>