అన్వేషించండి

Aam Aadmi Party crisis: గాయపడిన సింహం మరింత ప్రమాదకరం - కేజ్రీవాల్‌కు రాఘవ్ చద్దా డైరక్ట్ వార్నింగ్

Raghav Chadha : ఆమ్ఆద్మీ పార్టీ పై రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఆరోపణల దాడి పెంచారు. తన బయో నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అనే పేరు తీసేశారు.

Rajya Sabha MP Raghav Chadha : ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)లో కీలక నేతగా, అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాకు, పార్టీ నాయకత్వానికి మధ్య విభేదాలు ఇప్పుడు బహిరంగమయ్యాయి.  గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై చద్దా ఓ ప్రకటనచేశారు. తనపై ఒక పథకం ప్రకారం స్క్రిప్టెడ్ క్యాంపెయిన్  జరుగుతోందని విమర్శించారు.  

రాఘవ్ చద్దాను రాజ్యసభలో ఆప్ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగిస్తూ పార్టీ నిర్ణయం తీసుకోవడంతో ఈ వివాదం ముదిరింది. ఆయన స్థానంలో అశోక్ కుమార్ మిట్టల్‌ను నియమించిన పార్టీ, రాజ్యసభ సెక్రటేరియట్‌కు ఒక లేఖ రాస్తూ.. ఆప్ కోటాలో రాఘవ్ చద్దాకు మాట్లాడే అవకాశం ఇవ్వవద్దని కోరింది. దీనిపై చద్దా స్పందిస్తూ, నన్ను నిశ్శబ్దంగా ఉంచగలరేమో కానీ, ఓడించలేరు అంటూ ఒక వీడియో విడుదల చేశారు. తాను ప్రజా సమస్యలను లేవనెత్తుతుంటే పార్టీ ఎందుకు అడ్డుకుంటోందని ఆయన ప్రశ్నించారు.

ముఖ్యంగా తనపై వస్తున్న మూడు ప్రధాన ఆరోపణలను చద్దా కొట్టిపారేశారు. ప్రతిపక్షాలు వాకౌట్ చేసినప్పుడు తాను సభలోనే కూర్చుంటున్నానన్నది పచ్చి అబద్ధమని, సీసీటీవీ ఫుటేజ్ చూస్తే నిజం తెలుస్తుందని సవాల్ చేశారు. అలాగే, ప్రధాన ఎన్నికల కమిషనర్  తొలగింపు పిటిషన్‌పై సంతకం చేయలేదన్న ఆరోపణపై స్పందిస్తూ.. పార్టీ నుంచి తనకు అలాంటి విజ్ఞప్తి రాలేదని, పైగా పార్టీలోని 10 మంది ఎంపీల్లో 6-7 మంది కూడా సంతకం చేయలేదని, కేవలం తననే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారని ప్రశ్నించారు.

మరోవైపు ఆప్ నాయకత్వం చద్దాపై తీవ్ర విమర్శలు చేస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు చద్దా లండన్‌లో ఉండి పార్టీకి దూరంగా ఉన్నారని, క్లిష్ట సమయంలో పార్టీకి అండగా నిలవలేదని ఆరోపిస్తున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సైతం స్పందిస్తూ.. చద్దా  కాంప్రమైజ్ అయ్యారని, సీరియస్ రాజకీయ అంశాలను వదిలి కేవలం సాఫ్ట్ పీఆర్   కోసమే పని చేస్తున్నారని విమర్శించారు. పంజాబ్ వ్యవహారాల్లో ఆయన అతిగా జోక్యం చేసుకుంటున్నారనే అసంతృప్తి కూడా పార్టీలో ఉంది.  

ప్రస్తుతం రాఘవ్ చద్దా తన సోషల్ మీడియా బయో నుంచి AAP  పేరును తొలగించారు.  కేవలం  రాజ్యసభ ఎంపీ  అని మార్చుకున్నారు.  ఆయన త్వరలోనే బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ, చద్దా ఆ విషయాన్ని ధృవీకరించలేదు.  గాయపడిన సింహం మరింత ప్రమాదకరం అనే డైలాగ్‌తో ఆయన ఇచ్చిన హెచ్చరిక, ఆప్ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Bonalu Traffic Diversions: బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా
బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా
Jemimah Injury Twist: ద హండ్రెడ్ లీగ్ నుంచి జెమిమా అవుట్.. హామ్‌స్ట్రింగ్ గాయంతో దూరం, ఆసియాక‌ప్ కు ముందు టీమ్ ఇండియా కు బిగ్ షాక్!
ద హండ్రెడ్ లీగ్ నుంచి జెమిమా అవుట్.. హామ్‌స్ట్రింగ్ గాయంతో దూరం, ఆసియాక‌ప్ కు ముందు టీమ్ ఇండియా కు బిగ్ షాక్!
ABP Desam Top 10, 8 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 8 August 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget