Rajinikanth Discharged: కోలుకున్న సూపర్ స్టార్ రజినీ కాంత్.... కావేరీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
సూపర్ స్టార్ రజనీకాంత్ పూర్తిగా కోలుకున్నారు. ఆదివారం సాయంత్రం ఆయన కావేరీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కొన్ని రోజుల క్రితం స్వల్ప అస్వస్థతతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో జాయిన్ అయిన రజినీకాంత్ కోలుకున్నారు. ఆదివారం సాయంత్రం ఆయన డిశ్చార్జ్ అయ్యారు.
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న రజినీకాంత్
సూపర్ స్టార్ రజినీకాంత్ కొన్ని రోజుల క్రితమే దిల్లీకి వెళ్లి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్నారు. అక్కడ నుంచి వచ్చిన తరువాత తన ఫ్యామిలీతో కలిసి 'అన్నాత్తే' సినిమాను చూశారు. అయితే గురువారం సాయంత్రం ఆయన సడెన్ గా కావేరీ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఈ విషయం బయటకు రావడంతో అభిమానులు టెన్షన్ పడ్డారు. రజినీకాంత్ తలనొప్పి, అస్వస్థత కారణంగా హాస్పిటల్ లో జాయిన్ అయ్యారనే ప్రచారం జరిగింది.
Superstar #Rajinikanth walks out of Kauvery Hospital. pic.twitter.com/CYh2skXuHy
— Manobala Vijayabalan (@ManobalaV) October 31, 2021
రజినీ కాంత్ అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారన్న విషయం బయటకు రావడంతో అభిమానులు ఆందోళన చెందారు. దీనిపై రజినీకాంత్ సతీమణి లతా రజినీకాంత్ స్పందించారు. రజనీకాంత్ ఎప్పటిలాగానే సాధారణ హెల్త్ చెకప్ కోసమే ఆసుపత్రికి వచ్చారని తెలిపారు. ఏడాదికి ఒకసారి ఇలాంటి పరీక్షలు చేయించుకుంటారని ప్రకటించారు. శుక్రవారం పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని ఆసుపత్రి వర్గాలు సూచించడంతో రజినీకాంత్ ఆసుపత్రిలోనే ఉన్నారు. తలనొప్పి, అస్వస్థత కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరారని ప్రచారం కూడా జరిగింది.
Also Read: సూపర్ స్టార్ రజినీ హెల్త్‌పై భార్య కీలక ప్రకటన.. ఆరోగ్యం ఎలా ఉందంటే..
రజినీకాంత్ ఆరోగ్యానికి సంబంధించి కావేరీ ఆసుపత్రి ఎప్పటికప్పుడు వివరాలు కూడా అందించింది. 28వ తేదీన ఆయనకు అస్వస్థత వచ్చిందని పేర్కొంది. తమ ఆస్పత్రిలోని నిపుణుల టీమ్ ఆయనకు ఆరోగ్య పరీక్షలు చేసిన అనంతరం కరోటిడ్ ఆర్టరీ రివాస్కులరైజేషన్ అనే మెడికల్ ప్రొసీజర్ చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. ఈ మేరకు దాన్ని విజయవంతంగా పూర్తి చేశామని, ప్రస్తుతం ఆయన కోలుకున్నారని వివరించారు.
Also Read: రజినీ ఆరోగ్యంపై ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల.. ఆయనకు సమస్య ఏంటంటే..
Also Read: ‘మెరుపు మురళి’ ట్రైలర్.. విలేజ్ సూపర్ హీరోగా టొవినో థామస్.. ఇతడో అల్లరి ‘పిడుగు’
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి