Rajni Kanth Health Live: రజినీ ఆరోగ్యంపై ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల.. ఆయనకు సమస్య ఏంటంటే..
అగ్ర నటులు రజినీ కాంత్ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఆయన భార్య స్పందించారు. లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు.
LIVE
Background
గురువారం (అక్టోబరు 29) సాయంత్రం ఉన్నట్టుండి అనారోగ్యం కారణంగా రజినీ కాంత్ చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. విషయం బయటకు రావడంతో రజనీ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీనిపై రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ స్పందించారు. ‘‘రజనీకాంత్ ఎప్పటిలాగానే సాధారణ హెల్త్ చెకప్ కోసమే ఆసుపత్రికి వచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. ఏడాదికి ఒకసారి ఆయనకు ఇలాంటి పరీక్షలు చేయిస్తుంటాం. కంగారు పడాల్సింది ఏమీ లేదు’’ అని పేర్కొన్నారు.
ఆయన కొన్ని గంటల తర్వాత ఇంటికి వస్తారని మొదట అనుకున్నారు. అయితే శుక్రవారం పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని ఆసుపత్రి వర్గాలు చెప్పినట్లు తెలుస్తోంది. తలనొప్పి, అస్వస్థత కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరారనే ఒకరకమైన ప్రచారం కూడా జరిగింది. గురువారం రాత్రి రజనీ కాంత్‌ను చూసేందుకు ఆయన కుమార్తె ఐశ్వర్య కూడా కావేరి ఆస్పత్రికి వచ్చారు.
మరోవైపు, రజినీ కాంత్ ఇప్పటిదాకా ఉన్న చివరి చిత్రం 'దర్బార్'. ప్రస్తుతం శివ దర్శకత్వంలో 'అన్నాత్తే' అనే సినిమాలో నటించారు. ఈ సినిమాను తెలుగులో 'పెద్దన్న' అనే టైటిల్‌తో రిలీజ్ చేయబోతున్నారు. దీపావళి కానుకగా సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీంతో ప్రమోషన్స్ షురూ చేశారు. ఇప్పటికే ఈ సినిమా మోషన్ పోస్టర్ ని, టీజర్ ను విడుదల చేశారు. తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. అభిమానులను ఆకట్టుకునే విధంగా ట్రైలర్ ను కట్ చేశారు. మద్రాస్, కలకత్తా బ్యాక్ డ్రాప్ లో సినిమా నడుస్తుందని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.
Also Read: Family Drama Movie Review 'ఫ్యామిలీ డ్రామా' సమీక్ష: థ్రిల్లింత కొంత... సుహాస్ నటన కొండంత!
రజినీ కాంత్ హెల్త్ బులెటిన్ విడుదల
రజినీ కాంత్ ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులెటిన్‌ను కావేరీ ఆస్పత్రి విడుదల చేసింది. 28వ తేదీన ఆయనకు అస్వస్థత వచ్చిందని పేర్కొంది. తమ ఆస్పత్రిలోని నిపుణుల టీమ్ ఆయనకు ఆరోగ్య పరీక్షలు చేసిన అనంతరం కరోటిడ్ ఆర్టరీ రివాస్కులరైజేషన్ అనే మెడికల్ ప్రొసీజర్ చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. ఈ మేరకు దాన్ని విజయవంతంగా పూర్తి చేశామని, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని వివరించారు. మరికొద్ది రోజుల్లోనే ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని కావేరీ ఆస్పత్రి ఓ ప్రకటనలో వెల్లడించింది.
కరోటిడ్ ఆర్టరీ రివాస్కులరైజేషన్ అంటే..
మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే రక్త నాళాల్లో ప్లాక్స్ ఏర్పడడం వల్ల రక్త సరఫరాకు అడ్డంకి ఏర్పడుతుంది. ఫలితంగా మెదడుకు ఆక్సీజన్ కూడా సరిపడా అందదు. కాబట్టి కరోటిడ్ ఆర్టరీ రివాస్కులరైజేషన్ అనే మెడికల్ ప్రొసీజర్ ద్వారా రక్త నాళాల్లో ప్లాక్స్‌ను తొలగిస్తారు.
ఆస్పత్రికి పోటెత్తుతున్న ఫోన్లు
రజినీ ఆరోగ్యంపై ఆస్పత్రి వర్గాలు స్పష్టత ఇవ్వాలని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు పెద్ద ఎత్తున చెన్నైలోని కావేరీ ఆస్పత్రికి పెద్ద ఎత్తున ఫోన్లు చేస్తున్నారు. రజినీ ఆరోగ్యం గురించి చెప్పాలని కోరుతున్నారు. అంతేకాక, పలువురు అభిమానులు కూడా కావేరీ ఆస్పత్రికి చేరుకున్నారు.
రజినీ భార్య స్పందన
‘‘రజనీకాంత్ ఎప్పటిలాగానే సాధారణ హెల్త్ చెకప్ కోసమే ఆసుపత్రికి వచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. ఏడాదికి ఒకసారి ఆయనకు ఇలాంటి పరీక్షలు చేయిస్తుంటాం. కంగారు పడాల్సింది ఏమీ లేదు’’ అని పేర్కొన్నారు.