ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ పంపిణీ- రాజస్థాన్ సర్కార్ ప్రకటన
మహిళలుకు శానిటరీ నాప్కిన్స్ ఉచితంగా పంపిణీ చేస్తామని రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ ప్రకటించారు.
రాజస్థాన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇక నుంచి మహిళలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ ఇస్తామని సీఎం అశోక్ గహ్లోత్ ప్రకటించారు. మధోపుర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో గహ్లోత్ ఈ విషయాన్ని వెల్లడించారు.
Rajasthan | Why should women suffer in silence during their mensuration cycle. Hesitation around it should be left behind. Under the public interest, we will provide 12 sanitary napkins to every woman, every month: CM Ashok Gehlot, Sawai Madhopur pic.twitter.com/MoFryK2R34
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) December 14, 2022
ఈ ప్రకటన ఎంతో మంది పేద మహిళలకు ప్రయోజనకరంగా ఉంటుందని కాంగ్రెస్ అభిప్రాయపడింది. వీటి ద్వారా ఆర్థికంగా వెనుకబడిన మహిళలు, గ్రామీణ, గిరిజన ప్రాంతాలలోని మహిళలు అనారోగ్యం పాలు కాకుండా ఉంటారని పేర్కొంది.
Also Read: Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ 'జోడో యాత్ర'లో ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్