Rahul Gandhi US Visit: అమెరికాలో రాహుల్ గాంధీ "లవ్ షాప్", త్వరలోనే ఓపెనింగ్
Rahul Gandhi US Visit: ఈ నెల 28న రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు.
Rahul Gandhi US Visit:
కాలిఫోర్నియాలో లవ్ షాప్
రాహుల్ గాంధీ త్వరలోనే అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 31వ తేదీన అగ్రరాజ్యానికి వెళ్తారని కాంగ్రెస్ వెల్లడించినప్పటికీ..ఈ షెడ్యూల్‌లో మార్పులు చేర్పులు జరిగాయి. ఈ నెల 28వతేదీనే రాహుల్ అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్టు ప్రకటించింది. మే 29,30వ తేదీల్లో Stanford Universityలో ఓ కార్యక్రమం జరగనుంది. ఇందులోనే NRIలతో భేటీ అవనున్నారు రాహుల్. అయితే..ఈ షెడ్యూల్ మొత్తంలో ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చింది కాంగ్రెస్. కాలిఫోర్నియాలోని శాంటక్లారా వద్ద రాహుల్ గాంధీ "లవ్ షాప్" ఓపెన్ చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పోస్టర్‌నీ రిలీజ్ చేసింది పార్టీ. ప్రధాని నరేంద్ర మోదీ జూన్ 22న అమెరికాకి వెళ్లనున్నారు. అంత కన్నా ముందే రాహుల్ అక్కడికి వెళ్తున్నారు. అంతకు ముందు రాహుల్ లండన్ పర్యటనకు వెళ్లారు. అక్కడ Cambridge Universityలో స్పీచ్ కూడా ఇచ్చారు. ఈ స్పీచ్‌పైనే బీజేపీ భగ్గుమంది. భారత్‌లో డెమొక్రసీ లేదంటూ రాహుల్...బీజేపీ సర్కార్‌పై చేసిన కామెంట్స్‌ని ఆ పార్టీ నేతలు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. అంతే కాదు. ఎంపీనైన తనకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని, పార్లమెంట్‌లో మైక్ ఆఫ్ చేస్తున్నారని ఆరోపించారు రాహుల్. దీనిపైనా బీజేపీ నేతలు మండి పడ్డారు. పరాయి దేశానికి వెళ్లి భారత్ పరువు తీస్తారా అని విమర్శించారు. మీడియానీ మోదీ సర్కార్ కంట్రోల్ చేస్తోందని రాహుల్ లండన్ పర్యటనలో విమర్శించారు. ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడే వారికి మాత్రమే గౌరవం దక్కుతోందని అన్నారు. ఇప్పుడు అమెరికా పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో...ఆయన మళ్లీ ఇలాంటి కామెంట్స్ చేస్తారా..? లేదంటే వివాదాలకు దూరంగా ఉంటారా..? అన్న చర్చ జరుగుతోంది.
భారీ మెజార్టీ ఇచ్చినందుకు కర్ణాటక ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. విద్వేష రాజకీయాల్ని కర్ణాటక ప్రజలు తిప్పికొట్టారని స్పష్టం చేశారు. ఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్‌క్వార్టర్స్ వద్ద మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ...ఇది ప్రజల విజయం అని అన్నారు.
"ఇంత భారీ మెజార్టీతో గెలిపించిన కర్ణాటక ప్రజలకు నా కృతజ్ఞతలు. కష్టపడి పని చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు నా అభినందనలు. కర్ణాటకలో కాంగ్రెస్ పేద ప్రజలవైపు నిలబడింది. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే...ఈ సారి మేం ద్వేషంతో పోటీ చేయలేదు. ప్రేమతోనే పోటీ చేశాం. దేశ ప్రజలంతా ప్రేమ పూరిత రాజకీయాలనే కోరుకుంటున్నారని కర్ణాటక ప్రజలు నిరూపించారు. విద్వేషపూరిత రాజకీయాలకు స్వస్తి పలికారు. ప్రేమపూర్వక రాజకీయాలకే ఓటు వేశారు. ఇచ్చిన ప్రతిహామీని నెరవేర్చుతాం. మొదటి రోజు నుంచే ఈ పని మొదలు పెడతాం"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత
చాలా రోజుల సస్పెన్స్ తరవాత కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్యను (Karnataka CM Race) ఎంపిక చేసింది హైకమాండ్. ఈ నిర్ణయంలోనూ రాహుల్ కీలక పాత్ర పోషించారు. డీకే శివకుమార్, సిద్దరామయ్య మధ్య సంధి కుదిర్చే ప్రయత్నం చేశారు.
Also Read: Karnataka Cabinet: కర్ణాటక కాంగ్రెస్‌కి మరో సవాలు, కేబినెట్ విస్తరణపై ఢిల్లీలో సుదీర్ఘ చర్చలు!