By: Ram Manohar | Updated at : 19 May 2023 01:02 PM (IST)
కర్ణాటక కేబినెట్ విస్తరణపై ఢిల్లీలో సుదీర్ఘ చర్చలు జరగనున్నాయి.
Karnataka Cabinet:
ఢిల్లీకి డీకే, సిద్దరామయ్య
కర్ణాటకలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు రాజకీయాలన్నీ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పటికే ఖర్గే, సోనియా, రాహుల్‌తో వరుసగా భేటీ అయిన డీకే శివకుమార్, సిద్దరామయ్య..ఇప్పుడు మరోసారి ఢిల్లీ వెళ్లారు. సీఎంగా సిద్దరామయ్యను, డిప్యుటీ సీఎంగా డీకే శివకుమార్‌ని సీఎల్‌పీ అధికారికంగానే ప్రకటించింది. అయితే...కేబినెట్‌లో ఎవరెవరు ఉండాలన్న విషయంలో మళ్లీ చర్చలు మొదలయ్యాయి. ఈ బెర్త్‌ని ఫైనల్ చేసేందుకే శివకుమార్, సిద్దరామయ్య ఢిల్లీ వెళ్లారు. ఎవరెవరికి మంత్రి పదవులివ్వాలి..? ఎవరికి ఏ మినిస్ట్రీ ఇవ్వాలి అన్న అంశాలపై డిస్కస్ చేయనున్నారు. ఇప్పటికే CLP మీటింగ్‌లో ఈ చర్చ జరిగింది. సిద్దరామయ్యను లీడర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మే 20వ తేదీన సిద్దరామయ్య, డీకే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే...వీరిద్దరితో పాటు ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేయాలో ఇవాళ (మే 18న) తేల్చనుంది హైకమాండ్. అందుకోసమే ఇద్దరూ ఢిల్లీ బాట పట్టారు. ప్రభుత్వ ఏర్పాటుకి గవర్నర్‌నీ ఆహ్వానించారు. ఢిల్లీలో ఖర్గేతో కీలక చర్చలు జరపనున్నారు. దీనిపై డీకే శివకుమార్ స్పందించారు.
"నాతో పాటు సిద్దరామయ్య, రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా ఢిల్లీకి వెళ్తున్నాం. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేని కలిసి చర్చిస్తాం. ఆయన సూచనలకు అనుగుణంగా కేబినెట్‌ని విస్తరిస్తాం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడమే మా ఫస్ట్ ప్రియారిటీ. క్యాబినెట్‌కి సంబంధించిన ఓ విషయమైనా...దీని తరవాతే. మీకు చెప్పకుండా (మీడియాని ఉద్దేశించి) మేం ఏమీ చేయం. దీనిపై అనవసరమైన ఊహాగానాలు వద్దు. అందరం కలిసికట్టుగానే పని చేస్తాం"
- డీకే శివకుమార్, కర్ణాటక డిప్యుటీ సీఎం
#WATCH | "We are going to implement our guarantee," says #Karnataka Deputy CM-designate DK Shivakumar, as he leaves from his residence for Sree Kanteerava Stadium in Bengaluru where the swearing-in ceremony will take place on 20th May.
— ANI (@ANI) May 19, 2023
He will then leave for Delhi. pic.twitter.com/vtVlPJpzyV
అసలు సవాలు ఇప్పుడే..
సీఎం రేసులో సిద్దరామయ్య గెలిచారు. ఇక్కడి వరకూ ఓ టెన్షన్ అయితే...ఇప్పుడు అసలైన టెన్షన్ మొదలైంది. కేబినెట్‌లో ఎవరికి అవకాశమివ్వాలన్నది కాంగ్రెస్‌కి సవాలుగా మారింది. అందరికీ సమన్యాయం చేస్తూనే మంత్రివర్గ విస్తరణ చేపట్టడం అంత తేలికైన పనేం కాదు. ముఖ్యంగా ఆయా కమ్యూనిటీలని రిప్రజెంట్ చేసేలా ఓ మంత్రి తప్పకుండా ఉండాలని చూస్తోంది అధిష్ఠానం. ఇక్కడే తడబడుతున్నట్టు సమాచారం. మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న వాళ్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. హైకమాండ్ వాళ్లకు ఆ మినిస్ట్రీ ఇవ్వకపోతే...అలకలు ఖాయం. మళ్లీ మునుపటి పరిస్థితే ఎదురవచ్చు. గెలిచిన వాళ్లు తిరుగుబావుటా ఎగరేస్తే కాంగ్రెస్‌కి కష్టాలు తప్పవు. అయితే...దీనిపై ఇప్పటికే హైకమాండ్ క్లారిటీగా ఉన్నట్టు సమాచారం.
"జాతీయ నేతలంతా మా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. కేబినెట్ ఏర్పాటైన మొదటి రోజు నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు రెడీగా ఉన్నాం"
- డీకే శివకుమార్, కర్ణాటక డిప్యుటీ సీఎం
Also Read: Watch Video: క్యాన్సర్‌తో పోరాటం చేసి గెలిచిన శునకం, మళ్లీ డ్యూటీలోకి కూడా దిగింది
UPI: ఫోన్ తియ్-పే చెయ్, మే నెలలో యూపీఐ లావాదేవీల రికార్డ్
Karnataka Cabinet: కర్ణాటకలో ఇకపై ఉచిత విద్యుత్, అప్పటి నుంచే అమలు - మిగతా హామీలకూ గ్రీన్ సిగ్నల్
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు
Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం
Education Loan: సిబిల్ స్కోర్ తక్కువైనా ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది, హైకోర్ట్ కీలక నిర్దేశం
Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?
YS Viveka Case : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ - సీబీఐకి ఇచ్చిన ఆదేశాలు ఇవే !
Samantha: అవును, అది నిజమే - ప్రియాంక చోప్రా ‘సిటాడెల్’లో పాత్రపై స్పందించిన సమంత
MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని టాప్-5 కార్ కలెక్షన్ - ఆర్మీ స్పెషల్ కారు కూడా గ్యారేజ్‌లో!