Watch Video: క్యాన్సర్‌తో పోరాటం చేసి గెలిచిన శునకం, మళ్లీ డ్యూటీలోకి కూడా దిగింది
Watch Video: పంజాబ్ పోలీస్ డాగ్‌స్క్వాడ్‌లోని కుక్క క్యాన్సర్‌తో పోరాటం చేసి గెలిచింది.
Watch Video:
పంజాబ్ పోలీస్ డాగ్‌స్క్వాడ్
ఓ క్రైమ్ జరిగినప్పుడు కేవలం పోలీస్‌లే కాదు. డాగ్‌స్క్వాడ్ కూడా సీన్‌లోకి దిగుతుంది. చాలా కీలకమైన క్లూస్‌ని సేకరిస్తుంది. స్క్వాడ్‌లోని శునకాలకు ఆ స్థాయిలోనే ట్రైనింగ్ ఇస్తారు. అయితే..పంజాబ్ పోలీస్‌ల డాగ్‌స్క్వాడ్‌లోని ఓ కుక్క క్యాన్సర్ బారిన పడింది. బతకదేమో అనుకున్నా...ఆ జబ్బుతో పోరాడి గెలిచింది ఆ శునకం. కీలకమైన ఆపరేషన్స్‌లో పోలీసులకు హెల్ప్ చేసిన సిమ్మీ (కుక్క పేరు) పూర్తిగా రికవర్ అయ్యి మళ్లీ డ్యూటీలో దిగిందని పంజాబ్ పోలీసులు వెల్లడించారు. ANI ఇందుకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేసింది. సిమ్మీ చాలా యాక్టివ్‌గా కనిపించింది. జీప్‌లో నుంచి ఉత్సాహంగా బయటకు దూకి..డ్యూటీలో జాయిన్ అయింది. ఎస్‌పీ హర్జీత్ సింగ్ ఇందుకు సంబంధించిన వివరాలు చెప్పారు.
" చాలా రోజులుగా సిమ్మీ క్యాన్సర్‌తో పోరాడుతోంది. ఇప్పుడు రికవర్ అయింది. డ్యూటీలో కూడా చేరింది. మునుపటితో పోల్చి చూస్తే..ఆరోగ్యం మెరుగైంది. ఓ విదేశీ యువకుడు డ్రగ్స్‌ని అక్రమంగా తరలిస్తుండగా...ఆ కేస్‌ని ఛేదించింది"
- పంజాబ్ పోలీసులు
#WATCH | Faridkot: A Labrador dog named Simmy, who is part of the Punjab Police Canine squad, beats cancer and joins back duty pic.twitter.com/hT4qEqFqH4
— ANI (@ANI) May 19, 2023
Dog Simmy was suffering from cancer for a long time. Now her health has improved. She helps in anti-sabotage checking, in the past, she helped the Police to seize intoxicating substances from a foreigner: Harjit Singh, SSP, Faridkot pic.twitter.com/oFABaPvZ6n
— ANI (@ANI) May 19, 2023
ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. "చాలా ఆనందంగా ఉంది" అని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరి కొందరు ఆ శునకాన్ని "హీరో" అంటూ పొగిడారు. "క్యాన్సర్‌ని ఓడించి మళ్లీ డ్యూటీలోకి రావడం చాలా గొప్ప విషయం. పంజాబ్ పోలీసులకు హ్యాట్సాఫ్" అని ఇంకొందరు పొగుడుతున్నారు.
#WATCH | Faridkot: A Labrador dog named Simmy, who is part of the Punjab Police Canine squad, beats cancer and joins back duty pic.twitter.com/hT4qEqFqH4
— ANI (@ANI) May 19, 2023
#WATCH | Faridkot: A Labrador dog named Simmy, who is part of the Punjab Police Canine squad, beats cancer and joins back duty pic.twitter.com/hT4qEqFqH4
— ANI (@ANI) May 19, 2023