Rahul Gandhi Tweet: 'మోదీని ఓడించాలంటే అదే మార్గం'- అరెస్ట్ తర్వాత రాహుల్ ట్వీట్
Rahul Gandhi Tweet: దేశంలో శాంతియుత నిరసనలు చేసేందుకు కూడా అవకాశం లేకుండా అణిచివేయాలని చూస్తున్నారని మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.
Rahul Gandhi Tweet: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ విచారించడాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ చేపట్టిన నిరసన దీక్ష ఉద్రిక్తంగా మారింది. ఈ నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో ఫైర్ అయ్యారు. మోదీ రాజ్యంలో శాంతియుత నిరసనకు కూడా అవకాశం లేదని ఆరోపించారు.
तानाशाही देखिए, शांतिपूर्ण प्रदर्शन नहीं कर सकते, महंगाई और बेरोज़गारी पर चर्चा नहीं कर सकते।
— Rahul Gandhi (@RahulGandhi) July 26, 2022
पुलिस और एजेंसियों का दुरूपयोग करके, हमें गिरफ़्तार करके भी, कभी चुप नहीं करा पाओगे।
'सत्य' ही इस तानाशाही का अंत करेगा। pic.twitter.com/M0kUXcwH8L
అరెస్ట్
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీని ఈడీ ప్రశ్నించడంపై రాహుల్, పార్టీ ఎంపీలు ఆందోళనకు దిగారు. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం నుంచి విజయ్ చౌక్ వరకూ నిరసన ప్రదర్శన జరిపారు. విజయ్ చౌక్ వద్ద పోలీసులు రాహుల్ గాంధీని, ఇతర ఎంపీలను నిర్బంధంలోకి తీసుకున్నారు.
రాహుల్‌తో పాటు రంజీత్ రంజన్, కేసీ వేణుగోపాల్, మాణిక్కం ఠాగూర్, ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి, కె.సురేష్ తదితరులను పోలీసు బస్సులో ఎక్కించి కింగ్స్ వే క్యాంపునకు తీసుకువెళ్లారు.
మరోవైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని.. ఈడీ 3 గంటల పాటు ప్రశ్నించింది. నేషనల్ హెరాల్డ్ కేసుపై సోనియాను పలు ప్రశ్నలు వేసింది ఈడీ.
Also Read: Fact Check: భయ్యా! తెలియని వాళ్లకి లిఫ్ట్ ఇవ్వడం నేరమా? లైసెన్స్ తీసేసుకుంటారా?
Also Read: Kargil Vijay Diwas 2022: మంచు కొండల్లో పాక్‌పై మరపురాని గెలుపు- భారత్ పరాక్రమానికి ప్రపంచం ఫిదా!